అన్వేషించండి

CM Chandrababu: అంగన్వాడీ బాలుడు లక్షిత్ మృతిపై విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశం

Anganwadi boy death after missing | అంగన్వాడీ కేంద్రం నుంచి తప్పిపోయిన ఓ రెండున్నరేళ్ల బాలుడు శవమై కనిపించడంపై సీఎం చంద్రబాబు విచారణకు ఆదేశించారు.

Ap cm Chandrababu | అమరావతి: ఏపీలో మెగా  పేరెంట్స్ టీచర్ మీటింగ్ సమయంలో అదృశ్యమైన ఓ చిన్నారి కథ విషాదాంతమైంది. ప్రకాశం జిల్లాలో రెండున్నర ఏళ్ల బాలుడు లక్షిత్ మృతిపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. కంభం మండలం లింగోజిపల్లిలో లక్షిత్ మృతిపై చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. బాలుడి మృతి ఘటనపై జిల్లా ఎస్పీతో మాట్లాడిన సీఎం చంద్రబాబు అన్ని కోణాల్లో విచారణ జరపాలని ఆదేశించారు.
 
 రెండు రోజులక్రితం లక్షిత్ అనే బాలుడు అంగన్వాడీ కేంద్రం నుంచి బయటకు వెళ్లాడు. అయితే బాలుడు లక్షిత్ దారితప్పి అడవిలోకి వెళ్లిపోయాడని ఎస్పీ తెలిపారు. అడవిలో దాదాపు రెండురోజులపాటు ఆహారం, నీరు లభించక లక్షిత్ మృతి చెందాడని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.  ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని సీఎం చంద్రబాబు ఎస్పీని ఆదేశించారు. 

అసలేం జరిగిందంటే..
కొనకనమిట్ల మండలం గొట్లగట్టుకు చెందిన పొదిలి శ్రీను, సురేఖ దంపతులకు సంతానం ఇద్దరు కాగా, ఓ కుమారుడు లక్షిత్‌, నెలల పాప ఉన్నారు. శ్రీను హైదరాబాద్‌లోని ఓ ఫార్మా కంపెనీలో పనిచేస్తున్న సమయంలో భార్య సురేఖ గర్భం దాల్చింది. ఆమెను రెండు నెలల కిందట డెలివరీ కోసం పుట్టినిల్లు లింగోజిపల్లికి వచ్చారు. ఇటీవల వీరికి ఓ పాప పుట్టింది. రెండున్నరేళ్ల కుమారుడు లక్షిత్‌ను తల్లిదండ్రులు గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రానికి పంపుతున్నారు. జులై 8న ఉదయం 11 గంటల సమయంలో లక్షిత్‌ అంగన్వాడీ కేంద్రం నుంచి బయటకు వెళ్లిపోయాడు. తాను ఆపేందుకు చూడగా, తన చేతి కొరికి వెళ్లిపోయాడని నాలుగో తరగతి విద్యార్థి చెప్పడంతో లక్షిత్ విషయం తెలిసింది. తల్లిదండ్రుల ఫిర్యాదు తో కేసు నమోదు చేసుకున్న పోలీసులు డ్రోన్ల సాయంతో గాలించినా ఆచూకీ దొరకలేదు.

మృతదేహాన్ని చూసి సమచారం ఇచ్చిన మహిళ
గురువారం నాడు బాలుడి మృతదేహం గుర్తించారు. అయితే డెడ్ బాడీ కుళ్లిన స్థితిలో లేకపోవడంతో కొన్ని గంటల కిందే హత్య చేసి ఉంటారని గుర్తించారు. ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాలని మార్కాపురం డీఎస్పీ యు.నాగరాజు ఆదేశించారు. కంభం సీఐ మల్లికార్జునరావు, ఎస్‌.ఐ.నరసింహారావు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి బాలుడి ఆచూకీ కోసం గాలింపులు చేపట్టాయి. గ్రామానికి కొద్ది దూరంలో బాలుడి చెప్పులను పోలీస్ డాగ్ గుర్తించింది. అయినా బాలుడి ఆచూకీ లభ్యం కాలేదు. ఈ క్రమంలో గురువారం ఉదయం సూరేపల్లి శివారులోని పొలాల్లో బాలుడి మృతదేహాన్ని గుర్తించి స్థానికులకు సమాచారం ఇచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని అది అదృశ్యమైన లక్షిత్ మృతదేహమని గుర్తించారు. అసలేం జరిగింది, ఎవరు తీసుకెళ్లారు, ఎలా చనిపోయాడని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Foods To Reduce Stress : ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
Nellore Viral Video: తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
Embed widget