అన్వేషించండి

Chandra Babu Naidu Yoga With Ramdev Baba: అమరావతిలోని ఉండవల్లి గుహల్లో యోగాంధ్ర వైబ్స్! రామ్‌దేవ్ బాబాతో కలిసి సీఎం చంద్రబాబు యోగాసనాలు!

Chandra Babu Naidu Yoga With Ramdev Baba: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఉండవల్లి గుహల వద్ద సీఎం చంద్రబాబు, రామ్‌దేవ్ బాబా కలిసి యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • సూర్యోదయ వేళ ఉండవల్లి గుహల వద్ద యోగాంధ్ర వేడుక జరిగింది.
  • యోగా గురు రామ్‌దేవ్, సీఎం చంద్రబాబు కలిసి యోగాసనాలు వేశారు.
  • రామ్‌దేవ్ బాబా చంద్రబాబును విజనరీ లీడర్‌గా ప్రశంసించారు.
  • ఏపీని ఆధ్యాత్మిక రాజధానిగా, పచ్చదనంతో అభివృద్ధి చేస్తామన్నారు.

Chandra Babu Naidu Yoga With Ramdev Baba: సూర్యోదయ వేళ చారిత్రక ఉండవల్లి గుహల సాక్షిగా యోగ గురు రామ్‌దేవ్ బాబా, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యోగాసనాలు వేశారు. జూన్ 21న జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అమరావతిలో నిర్వహించిన యోగాంధ్ర ప్రోగ్రామ్‌లో పలువురు మంత్రులు, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నార. రామ్‌దేవ్‌బాబాతో కలిసి యోగా చేసిన చంద్రబాబు... యోగా మన సంస్కృతి, మన వారసత్వం అని చెప్పుకొచ్చారు. మరోవైపు చంద్రబాబు దేశానికే ఒక విజనరీ లీడర్ అంటూ రామ్‌దేవ్ బాబా ప్రశంసల వర్షం కురిపించారు.  
Image

అమరావతిలో యోగాంధ్ర వైబ్స్ 

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన  యోగాంధ్ర కార్యక్రమం ఉండవల్లి గుహల వద్ద అత్యంత వైభవంగా జరిగింది. ఈ ఏడాది  యోగా ఫర్ హెల్తీ ఏజింగ్ అనే థీమ్‌తో నిర్వహించిన ఈ వేడుకల్లో రామ్‌దేవ్ బాబా ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Image

సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా బాబాతో కలిసి యోగా సాధన చేశారు. ఈ సందర్భంగా వివిధ రకాల యోగా ప్రక్రియలను, వాటివల్ల కలిగే హెల్త్ బెనిఫిట్స్ గురించి రామ్‌దేవ్ బాబా వివరించారు.

Image

చంద్రబాబు విజనరీ లీడర్- రామ్‌దేవ్ బాబా 

యోగా గురు రామ్‌దేవ్ బాబా మాట్లాడుతూ సీఎం చంద్రబాబుపై ప్రశంసల జల్లు కురిపించారు. గత 30 ఏళ్లుగా చంద్రబాబు ఏది అడిగితే మేం అది చేస్తున్నాం. ఆయన దేశంలోనే అత్యంత విజన్ ఉన్న నాయకుడు అని కొనియాడారు.

Image

ప్రధాని మోదీ వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా చంద్రబాబు ఏపీని తీర్చిదిద్దుతున్నారని, ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలాగే పనిచేస్తే  2047 లక్ష్యం ముందే సాకారమవుతుందని బాబా ఆకాంక్షించారు. అమరావతిని  స్విట్జర్లాండ్‌తో పోల్చిన బాబా, ఇక్కడి 40% పచ్చదనం, 60% నిర్మాణాలు ఉండబోయే ప్లాన్ అద్భుతమని చెప్పారు.

Image

సీఎం చంద్రబాబు తన ప్రసంగంలో కీలక విషయాలు ప్రస్తావించారు. ప్రస్తుతం యువత ఎదుర్కొంటున్న స్ట్రెస్ గురించి మాట్లాడుతూ, ఆధ్యాత్మికతతో కూడిన సాంకేతికత అవసరం అని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా 190 దేశాలు యోగాను అనుసరిస్తున్నాయని, మన ఏపీని త్వరలోనే దేశానికి ఆధ్యాత్మిక రాజధానిగా మారుస్తామని భరోసా ఇచ్చారు.

Image

రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 31 శాతం పచ్చదనాన్ని ఏకంగా 50 శాతానికి పెంచడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ, ఇప్పటికే  20 లక్షల ఎకరాల్లో రైతులు కెమికల్ ఫ్రీ సాగు చేస్తున్నారని గర్వంగా ప్రకటించారు. అమరావతి కోసం 29 వేల మంది రైతులు 33 వేల ఎకరాలు త్యాగం చేశారని, ఇది సామాన్యమైన విషయం కాదని గుర్తుచేశారు.

Image

Image

Image

Image

Image

Image

Frequently Asked Questions

అమరావతిలో జరిగిన యోగా కార్యక్రమంలో ఎవరు పాల్గొన్నారు?

అమరావతిలోని ఉండవల్లి గుహల సాక్షిగా యోగ గురు రామ్‌దేవ్ బాబా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యోగాసనాలు వేశారు. పలువురు మంత్రులు, అధికారులు, విద్యార్థులు కూడా పాల్గొన్నారు.

ఈ ఏడాది యోగాంధ్ర కార్యక్రమం యొక్క థీమ్ ఏమిటి?

ఈ ఏడాది యోగాంధ్ర కార్యక్రమం

సీఎం చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి ఏ లక్ష్యాలను పేర్కొన్నారు?

ఏపీని త్వరలో దేశానికి ఆధ్యాత్మిక రాజధానిగా మార్చాలని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో పచ్చదనాన్ని 31% నుంచి 50%కి పెంచడమే లక్ష్యమన్నారు.

రామ్‌దేవ్ బాబా సీఎం చంద్రబాబును ఎలా ప్రశంసించారు?

రామ్‌దేవ్ బాబా చంద్రబాబును దేశంలోనే విజన్ ఉన్న నాయకుడిగా ప్రశంసించారు. ఆయన ఏపీని వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతున్నారని కొనియాడారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu On Medico Priyanka Death: మెడికో ప్రియాంక మృతి పట్ల సీఎం చంద్రబాబు సంతాపం, ఆమె కుటుంబానికి రూ.20 లక్షల సాయం
మెడికో ప్రియాంక మృతి పట్ల సీఎం చంద్రబాబు సంతాపం, ఆమె కుటుంబానికి రూ.20 లక్షల సాయం
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP, Telangana Weather Update: ఏపీలో 2 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్
ఏపీలో 2 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్
Minor Girls Assault Case: గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
Advertisement

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mamata Banerjee Car Attack: మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
BWF Title Win: కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Embed widget