Annadata Sukhibhava Status: ఆ రైతుల ఖాతాల్లో మాత్రమే నగదు జమ కాలేదు- అన్నదాత సుఖీభవపై కీలక అప్‌డేట్
Annadata Sukhibhava Payment Status: ఏపీలోని అర్హులైన 44.75 లక్షల మంది రైతుల ఖాతాల్లో అన్నదాత సుఖీభవ నగదు జమ అయిందని వ్యవసాయశాఖ డైరెక్టర్ డిల్లీరావు తెలిపారు.

PM Kisan Annadata Sukhibhava Payment Status online | అమరావతి: ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించింది. సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu) ప్రకాశం జిల్లా దర్శిలో శనివారం నాడు పీఎం కిసాన్ / అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించారు. ఏపీ ప్రభుత్వం రైతులకు పంట పెట్టుబడి సాయం కింద రూ.5000 అన్నదాతల ఖాతాల్లో జమ చేయగా, కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ యోజన స్కీమ్ (PM Kisan Samman Nidhi) కింద రూ.2000 జమ చేసింది.
44.75 లక్షల మంది రైతులకు ప్రయోజనం
అన్నదాత సుఖీఖవ పథకం కింద 99.98 శాతం మంది రైతుల ఖాతాల్లో నిధులు జమ అయినట్లు ఏపీ వ్యవసాయశాఖ డైరెక్టర్ ఢిల్లీరావు తెలిపారు. ఈ పథకానికి తిరస్కరణకు గురైన రైతులు రైతు సేవా కేంద్రాలు (RBK)లో అప్లికేషన్ ఇవ్వాలని సూచించారు. రాష్ట్రంలోని అర్హులైన 44.75 లక్షల మంది రైతులకు అన్నదాత సుఖీభవ సాయం అందిందని ఏపీ వ్యవసాయశాఖ డైరెక్టర్ ఢిల్లీరావు వెల్లడించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్న ప్రాంతాల్లో రైతుల ఖాతాల్లో నగదు జమ కాలేదని తెలిపారు.
ఈ కేవైసీ సమస్య, ఎన్‍పీసీలో యాక్టివ్‌గా లేని ఖాతాల్లో సైతం అన్నదాత సుఖీభవ నిధులు జమకాలేదని వెల్లడించారు. వ్యవసాయశాఖ డేటా ప్రకారం కేవలం 1067 ఖాతాల్లో మాత్రమే నగదు జమ కాలేదు. అన్నదాత సుఖీభవ పథకానికి ఏదైనా కారణంతో రిజెక్ట్ అయిన అన్నదాతలు రైతు సేవా కేంద్రాల్లో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. వ్యవసాయశాఖ అధికారులు వాటిని పరిశీలించి అర్హులైన వారికి పీఎం కిసాన్/ అన్నదాత సుఖీభవ నగదు సాయం అందిస్తామని చెప్పారు.
- ఈకేవైసీ పూర్తి చేయని రైతులు
- భూమి యజమానులు మరణించిన రైతుల పేర్లు జాబితాలో లేకపోవడం
- వారసులకు పాసుపుస్తకాలు జారీ కాకపోవడం
- భూమికి ఆధార్ లింకింగ్ సమస్యలు
- ఎన్‌పీసీఐ అకౌంట్ యాక్టివ్ కాకపోవడం
- వ్యవసాయేతర భూములు (అక్వా సాగు, నిర్మాణ భూములు)
- ప్రస్తుత లేదా మాజీ ప్రజాప్రతినిధులు
- ₹20,000 కంటే ఎక్కువ జీతం పొందే ఉద్యోగులు
- 10 సెంట్ల కంటే తక్కువ భూమి కలిగిన వారు
- మైనర్‌లు
అన్నదాత సుఖీభవ స్టేటస్ పేమెంట్ స్టేటస్ (Annadata Sukhibhava Payment Status:) ఇలా చెక్ చేసుకోండి
అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు మీ ఖాతాలో జమ అయ్యాయో లేదో తెలుసుకోవడానికి చాలా సులభమైన మార్గాలు ఉన్నాయి.
మొబైల్ ఫోన్: మీకు బ్యాంక్ నుంచి డబ్బులు జమ అయినట్లు SMS వస్తే డబ్బులు ఖాతాలో పడినట్లే.
ఆన్‌లైన్ బ్యాంకింగ్/మొబైల్ యాప్: ఆన్‌లైన్ బ్యాంకింగ్ లేదా మీ బ్యాంక్ మొబైల్ యాప్ లో లాగిన్ అయి మీ బ్యాలెన్స్ చెక్ చేసుకోండి.
బ్యాంకు పాస్ బుక్: మీకు ఆన్‌లైన్ బ్యాంకింగ్ లేకపోతే, మీరు బ్యాంకుకు వెళ్లి పాస్ బుక్ అప్‌డేట్ చేయించుకుంటే డబ్బులు జమ అయ్యాయో లేదో తెలుస్తుంది.
అధికారిక వెబ్‌సైట్: అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన అధికారిక వెబ్‌సైట్ http://annadathasukhibhava.ap.gov.inలో మీ ఆధార్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ నెంబర్ ద్వారా మీ పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.
మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అన్నదాత సుఖీభవ పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. 95523 00009 వాట్సాప్‌లో హాయ్ (HI) అని టైప్ చేయాలి. అనంతరం మీకు సేవలు ఎంచుకోండి అని అడుగుతుంది. అక్కడ కనిపించే సేవల్లో అన్నదాత సుఖీభవ (Annadata Sukhibhava) సేవ ఉంటుంది. దానిపై క్లిక్ చేసిన తర్వాత మీ పేరు, ఆధార్ నెంబర్ లాంటి వివరాలు ఎంటర్ చేస్తే అన్నదాత సుఖీభవ మీకు డబ్బులు పడ్డాయో లేదో పేమెంట్ స్టేటస్ తెలుస్తుంది.






















