అన్వేషించండి

PM Kisan yojana: పీఎం కిసాన్ యోజన డబ్బులు పడలేదా? ఏం జరిగిందో ఇలా చెక్‌ చేసుకోండి!

PM Kisan yojana: పిఎం కిసాన్ 20వ విడత విడుదల అయ్యాయి. చాలా మంది రైతుల ఖాతాలో నిధులు జమ అవుతున్నాయి. మీ ఖాతాలో డబ్బులు చేరాయో లేదో ఇలా తెలుసుకోండి.

PM Kisan yojana: దేశంలో కోట్ల మంది రైతులు ఉన్నారు. భారత ప్రభుత్వం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద వీరి ఖాతాలో నిధులు జమ చేస్తోంది. సంవత్సరానికి రైతులకు ప్రభుత్వం 6 వేల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తుంది. ఇందులో 2000 రూపాయల చొప్పున మూడు వాయిదాలు వేస్తోంది. ప్రభుత్వం ఇప్పటి వరకు మొత్తం 19 వాయిదాలు చెల్లించింది. ఇప్పుడు 20వ విడత నిధులు వేస్తోంది.  

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నుంచి లబ్ధిదారులైన రైతుల ఖాతాలో 20వ వాయిదా డబ్బును విడుదల చేశారు. మీరు కూడా పీఎం కిసాన్ యోజన లబ్ధిదారులైతే, మీ ఖాతాలో వాయిదా డబ్బు వచ్చిందో లేదో ఇంట్లో కూర్చొని తెలుసుకోవచ్చు.

20వ వాయిదా డబ్బు వచ్చిందో లేదో ఈ విధంగా చెక్ చేయండి

పీఎం మోదీ దేశంలోని 9.7 కోట్ల మంది రైతుల ఖాతాలో 20,500 కోట్ల రూపాయలను విడుదల చేశారు. పీఎం కిసాన్ యోజన 20వ వాయిదా మీ ఖాతాలో వచ్చిందో లేదో తెలుసుకోవాలనుకుంటే, ఇలా చేయండి. దీని కోసం మీరు మొదట పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్ pmkisan.gov.in ని సందర్శించాలి. ఇక్కడ ఫార్మర్ కార్నర్ విభాగంలో 'బెనిఫిషియరీ స్టేటస్'పై క్లిక్ చేయండి. దీంతో కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఆధార్ నంబర్, మొబైల్ నంబర్ లేదా బ్యాంక్ ఖాతా నంబర్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. సరైన సమాచారం నమోదు చేసిన తర్వాత, మీ లబ్ధి స్టాటస్‌ పూర్తి వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి.

వాయిదా డబ్బు రాకపోతే ఏమి చేయాలి?

మీ ఖాతాలో పీఎం కిసాన్ వాయిదా డబ్బులు రాకపోతే, మొదట మీరు ఇ-కెవైసి, ఆధార్-బ్యాంక్ లింక్ , భూమికి సంబంధించిన సమాచారాన్ని సకాలంలో అప్‌డేట్ చేశారో లేదో చెక్‌ చేయండి. వీటిలో ఏదైనా అసంపూర్తిగా లేదా తప్పుగా ఉంటే, వాయిదా నిలిచిపోవచ్చు. ఆ తర్వాత మీరు పీఎం కిసాన్ పోర్టల్‌లో బెనిఫిషియరీ స్టేటస్‌లో తనిఖీ చేయండి.

అక్కడ e-KYC, ఆధార్ ,ల్యాండ్ సీడింగ్‌లో 'నో' కనిపిస్తే, మీరు ఈ ప్రక్రియను పూర్తి చేయాలి. అంతా సరిగ్గా ఉన్నా డబ్బు రాకపోతే, మీరు జిల్లా వ్యవసాయ కార్యాలయాన్ని సంప్రదించండి లేదా హెల్ప్‌లైన్ నంబర్ 155261 లేదా 18001155261కి కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు.

టాప్ హెడ్ లైన్స్

తెలుగు రాష్ట్రాల్లో వానలే వానలు! తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్! ఏపీలో ఈదురు గాలుల ముప్పు!
తెలుగు రాష్ట్రాల్లో వానలే వానలు! తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్! ఏపీలో ఈదురు గాలుల ముప్పు!
Annadata Sukhibhava Status Check Online: ఏపీ రైతుల ఖాతాల్లో 7000 జమ.. అన్నదాత సుఖీభవ స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి
ఏపీ రైతుల ఖాతాల్లో 7000 జమ.. అన్నదాత సుఖీభవ స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి
Rythu Bharosa In Telangana 2026: తెలంగాణ రైతులకు అదిరిపోయే గుడ్ న్యూస్! జూన్ 30 నుంచే రైతు భరోసా నిధులు విడుదల! 9రోజుల్లో ఖాతాల్లో నగదు!
తెలంగాణ రైతులకు అదిరిపోయే గుడ్ న్యూస్! జూన్ 30 నుంచే రైతు భరోసా నిధులు విడుదల! 9రోజుల్లో ఖాతాల్లో నగదు!
Andhra Pradesh Weather: ఆంధ్రప్రదేశ్‌లో బుధవారం పిడుగుల వర్షం! జాగ్రత్త పడాల్సిన జిల్లాలు ఇవే! 
ఆంధ్రప్రదేశ్‌లో బుధవారం పిడుగుల వర్షం! జాగ్రత్త పడాల్సిన జిల్లాలు ఇవే! 

వీడియోలు

Vinicius Jr History vs Scotland | రోనాల్డో రికార్డ్స్ సమం చేసిన వినీసియస్
IND W vs BAN W T20 World Cup Highlights | బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
Shree Charani Creates History In T20 World Cup | శ్రీ చరణి హిస్టారికల్ రికార్డ్
94-Year-Old Woman Renounces US Citizenship | US సిటిజన్‌షిప్ వద్దని తిరిగొచ్చిన బామ్మ
Bhumika Ramesh Biography | మేఘసందేశం భూమి రియల్ లైఫ్ స్టోరీ ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Afghanistan Earthquake: అఫ్గానిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు కంపించిన భూమి
అఫ్గానిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు కంపించిన భూమి
Tirumala Devotees Rush: తిరుమలలో అనూహ్య రద్దీ- సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
తిరుమలలో అనూహ్య రద్దీ- సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
Made in Jonnagiri Gold Biscuits: బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!
బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!
KTR Politics: కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్
కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్
NRI Priest Arrest: పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
Vizag Land Scam: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
Jai Moondra Cricket Career: ఐర్లాండ్ తరపున దుమ్మురేపిన రాజస్థాన్ క్రికెటర్ జై ముంద్రా.. అసలు ఎవరితను ?
ఐర్లాండ్ తరపున దుమ్మురేపిన రాజస్థాన్ క్రికెటర్ జై ముంద్రా.. అసలు ఎవరితను ?
Pawan Kalyan Comments :
"క్రిమినల్స్‌కి వత్తాసు పలికే వైసీపీ కమిట్‌మెంట్‌ చూసి ముచ్చటేస్తుంది- వారు అలానే ఉండి, మరింత కరిగిపోవాలి" పవన్ కామెంట్స్ వైరల్ 
Embed widget