(Source: ECI/ABP News/ABP Majha)
AP Assembly Live Updates 2022: వచ్చే ఏడాది విశాఖ నుంచి పాలన, మంత్రి అమర్ నాథ్ సంచలన వ్యాఖ్యలు
ఏపీ అసెంబ్లీ సమావేశాల నిరంతర అప్ డేట్స్ కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.
LIVE
Background
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అత్యంత కీలక దశకు చేరుకున్నట్లుగా కనిపిస్తున్నాయి. అసలు ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర వరకూ సమయం ఉంది. కానీ నేడో రేపో ఎన్నికలన్నట్లుగా రాజకీయ పార్టీలు తమ వ్యూహాలను అమలు చేస్తున్నాయి. వచ్చే ఎన్నికలకు ఏ స్ట్రాటజీతో వెళ్లాలని సీఎం జగన్ సుదీర్ఘంగా కసరత్తు చేస్తున్నారు. తాను సగం మంది జనాభాకు ప్రతి ఇంటికి ఏటా రూ. నాలుగైదు లక్షలు ఇస్తున్నానని... గడప గడపకూ పార్టీ నేతలను పంపించి చెబుతున్నారు. మళ్లీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తననే ఎన్నుకోవాలని ఆయన పార్టీ నేతల ద్వారా సందేశం పంపుతున్నారు. ఈ కార్యక్రమాన్ని జగన్ సీరియస్‌గా తీసుకున్న తీరు చూస్తే వచ్చే ఎన్నికల్లో తన సంక్షేమ పాలనపై రిఫరెండంగానే ఓటింగ్‌కు వెళ్లాలని డిసైడయ్యారని అనుకుంటారు. కానీ జగన్ ఇప్పుడు అనూహ్యంగా రూటు మారుస్తున్నారు. మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెస్తున్నారు. మూడు రాజధానులే తమ విధానమని.. ప్రకటించబోతున్నారు. మూడు రాజధానులకే ప్రజల మద్దతు ఉందని ఈ అంశాన్నే అజెండాగా చేసుకుని ఎన్నికలకు వెళ్లే ఉద్దేశంలో ఉన్నారన్న అభిప్రాయమూ వినిపిస్తోంది. ఇప్పుడు జగన్ ముందు రెండు మార్గాలున్నాయి. ఒకటే సంక్షేమం. రెండు మూడు రాజధానులు. ఏ పడవపై పెట్టి ఎన్నికలు ఈదుతారన్నది ఇప్పుడు కీలకంగా మరింది.
సంక్షేమంపై ఎంతో నమ్మకం పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి !
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి తన పాలనపై ఎంతో నమ్మకం. తాను ప్రతి కుటుంబం సుభిక్షంగా ఆకలి దప్పులు లేకుండా.. చదువుల ఖర్చులేకుండా.. వైద్యం తిప్పలు లేకుండా ఖర్చులకూ డబ్బులిస్తూ.. అందర్నీ సుఖంగా చూసుకుంటున్నానని నమ్ముతున్నారు. అర్హుల పేరుతో చాలా మంది అనర్హులను చేసినప్పటికీ ఆయన .. తన ఓటు బ్యాంక్ చెక్కు చెదకుండా ఉండేంతగా పథకాలను అమలు చేస్తున్నానని గట్టి నమ్మకంతో ఉన్నారు. వారందరి ఓట్లు గుంపగుత్తగా తనకే పడతాయని ధీమాగా ఉన్నారు. అందుకే 175 సీట్లు ఎందుకు గెలవకూడదని ఆయన ప్రశ్నిస్తున్నారు. పార్టీ నేతలకూ అదే చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తన సంక్షేమ పాలనే అజెండాగా ఓట్లు అడగాలని అనుకున్నారు. అందుకే పార్టీ నేతలందర్నీ గడప గడపకూ పంపుతున్నారు.
హఠాత్తుగా మూడు రాజధానుల వైపు చూపు !
అయితే జగన్ ఇప్పుడు తన సంక్షేమంపై ధీమా కోల్పోయినట్లుగా కనిపిస్తోంది. మూడు రాజధానుల ఎజెండాగా ఎన్నికలకు వెళ్తే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నారు. అందుకే మూడు రాజధానుల అంశాన్ని హఠాత్తుగా తెరపైకి తెచ్చారు. మూడు రాజధానుల బిల్లు పెడతామని మంత్రులు ప్రకటనలు చేశారు. వాస్తవంగా చూస్తే మూడు రాజధానుల బిల్లు మరోసారి పెట్టడం చట్టం చేయడం అనేది సాధ్యం కాదు. ఎందుకంటే హైకోర్టు ఈ అంశంలో స్పష్టమన తీర్పు ఇచ్చింది. అయితే అసెంబ్లీ చర్చించడానికి ఎలాంటి ఆటంకాలు ఉండవు. అసెంబ్లీలో చర్చించి.. మూడు రాజధానులపై తన వాదన వినిపించి.. అదే అదెండాతో ప్రజల్లోకి వెళ్లి .. మరోసారి ఎన్నికలను ఎదుర్కోవాలన్న ఆలోచన జగన్ చేస్తున్నారని అంటున్నారు. అందుకే పార్టీ నేతలతో .. మూడు రాజధానులపై ఘాటుైన ప్రకటనలు చేయిస్తున్నారని అంటున్నారు.
ప్రజల పల్స్ తెలుసుకోవడానికా ?
అధికారం చేపట్టిన కొత్తలో మూడు రాజధానులు అంటే కొంత కదలిక కనిపించింది. అమరావతిలో ఓ వర్గం వారే అభివృద్ధి చెందుతారనే ప్రచారాన్ని వ్యవస్థీకృతంగా చేసి ఉండటంతో ఇతర ప్రాంతాల వారు తమకేంటి అనే ఆలోచనకు వచ్చారు. అయితే ఇప్పుడు దాదాపుగా నాలుగేళ్ల పాలన తర్వాత కూడా అదే అభిప్రాయం ఉండటం కష్టం. ఎందుకంటే ఏపీలో అభివృద్ది పనులు జరగడం లేదు. అమరావతిని ఉద్దేశపూర్వకంగా ఆపేసినా .. పోలవరం కూడా ఆగిపోయింది. ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి కాలేదు. రోడ్లు కూడా అధ్వాన్యంగా తయారయ్యాయి. చిన్న చిన్న పనులు కూడా చేయలేని పరిస్థితి ఉంది. ఇది సహజంగానే ప్రజల్లో అసంతృప్తి కలిగిస్తోంది. పెరిగిన ధరలు.. ఇతర వ్యవహారాలు కూడా ప్రజల్లో అసంతృప్తికి కారణం అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల పల్స్ తెలుసుకోవడానికి సీఎం జగన్ సంక్షేమం, మూడు రాజధానుల అంశాన్ని వ్యూహాత్మకంగా తెరపైకి తెస్తున్నారని అంటున్నారు.
మొత్తంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వచ్చే ఎన్నికల ఎజెండాను ఖరారు చేసుకోవడంలో క్రాస్ రోడ్స్‌లో ఉన్నారు. తన పాలన.. సంక్షేమంపై ఓట్లు అడగాలా.. మూడు రాజధానులపైనా అన్నది ఆయన తేల్చుకోవాల్సి ఉంది.
వచ్చే ఏడాది విశాఖ నుంచి పాలన, మంత్రి అమర్ నాథ్ సంచలన వ్యాఖ్యలు
మంత్రి గుడివాడ అమర్ నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే విద్యాసంవత్సవరంలో విశాఖ నుంచి పాలన ప్రారంభం అవుతుందన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన ఆయన వికేంద్రీకరణపై త్వరలో బిల్లు పెడతామని స్పష్టం చేశారు.
ఏపీ శాసనసభ సోమవారానికి వాయిదా
ఏపీ శాసనసభ సోమవారానికి వాయిదా పండింది. ప్రభుత్వం శాసనసభలో 8 ఎనిమిది బిల్లులు ప్రవేశపెట్టింది వాటికి సభ ఆమోదం తెలిపింది. ఏపీ ఆర్థిక వ్యవస్థకు ఎలాంటి ఢోకా లేదని సీఎం జగన్ సభలో తెలిపారు.
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఢోకా లేదు - సీఎం జగన్
CM Jagan : రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఢోకా లేదని సీఎం జగన్ అన్నారు. అసెంబ్లీ రెండో రోజు సమావేశాల్లో సీఎం జగన్ మాట్లాడుతూ... రాష్ట్రంలో బాగుంటే చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. చంద్రబాబు ఆర్థిక పరిస్థితే బాగోలేదేమో అని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగానే ఉందన్నారు. ఆర్థిక పరిస్థితికిపై కేంద్రం, ఆర్బీఐకి తప్పుడు లేఖలు రాశారన్నారు.
AP Assembly Sessions: ఏపీ అసెంబ్లీ రెండో రోజు టీడీపీ సభ్యుల సస్పెన్షన్
ఏపీ అసెంబ్లీ నుంచి వరుసగా రెండో రోజూ టీడీపీ సభ్యులు సస్పెండ్ అయ్యారు. తెలుగుదేశం పార్టీ సభ్యులను స్పీకర్ తమ్మినేని సీతారామ్ సస్పెండ్ చేశారు. స్పీకర్ పోడియం వద్ద తెదేపా ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగడంతో పాటు సభా కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తున్నారని వారిని సస్పెండ్ చేయాలని శాసనసభ వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారు. వెంటనే అందుకు ఆమోదం తెలుపుతూ టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు.
కేసీఆర్, జగన్ ధైర్యంగా రాజీనామా చేశారు: మంత్రి, మేరుగు నాగార్జున
రాజధానికి సంబంధించి నా నియోజకవర్గంలో టీడీపీ పాదయత్రలు చేస్తోంది, ఆ పాదయాత్రలో రాజధాని ప్రాంత రైతులు, దళితులు ఎంత మంది ఉన్నారని మంత్రి మేరుగు నాగార్జున ప్రశ్నించారు. మీ ఉద్యమంలో ఉన్నవారంతా బయటి నుంచి వచ్చినవారేనని.. నక్కా ఆనంద్ బాబు మీ స్థాయి ఏంటి, జగన్ మోహన్ రెడ్డి గురించి మాట్లాడే నైతిక అర్హత మీకుందా అని ప్రశ్నించారు.
మా ముఖ్యమంత్రి పై టీడీపీ నేతలు బరితెగించి మాట్లాడతున్నారు. టీడీపీ నేతలు ప్రజల్లో మనగలిగే పరిస్థితి లేదు
తెలంగాణ కోసం కేసీఆర్, వైసీపీ పార్టీ ఏర్పాటు కోసం జగన్ ధైర్యంగా రాజీనామాలు చేశారు
మీకు దమ్ముంటే మీవాళ్లంతా రాజీనామా చేయండి ... ఎన్నికలకు వెళ్దాం
మీ ఉడత ఊపుళ్లకు చింతకాయలు కూడా రాలవు
రాజధాని ఎక్కడ వస్తుందో ముందే తెలుసు నా దగ్గర డబ్బులు లేకే భూములు కొనలేకపోయానని మీరే చెప్పారు
అందుకే ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని చెబుతున్నాం
వేమూరు నియోజకవర్గంలో మీ ఉద్యమంలో ఎంతమంది రాజధాని ప్రాంతం వారున్నారు
మీ నాయకుడి ఆలోచన దళిత వ్యతిరేక ఆలోచన
దళితుల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్న చంద్రబాబు దగ్గర ఇంకా ఎందుకున్నారోనని బాధకలుగుతుంది
చంద్రబాబు దగ్గర మీరెందుకు ఇంకా ఛప్రాసీ ఉద్యోగం చేస్తున్నారో అర్ధం కావడం లేదు
నిజంగా దళితుల్లో పుట్టిన వారెవరూ చంద్రబాబు దగ్గర ఉండరు. చంద్రబాబు దళిత ద్రోహి
దళితులను వాడుకుని వంచించిన వ్యక్తి చంద్రబాబు
అంబేద్కర్ విగ్రహం పెడతానని చెప్పి మోసం చేశాడు
ఏమీ లేని చోట చెట్లు, పుట్టలో అంబేడ్కర్ విగ్రహం పెడతారా
చంద్రబాబు మోసాలను ఎండగట్టడానికి అంబేద్కర్ పాదాల సాక్షిగా ఎక్కడైనా చర్చకు సిద్ధం
మంత్రి రోజాకు దళితులంటే అమితమైన గౌరవం
గతంలో ఆమె మాట్లాడిన మాటలను వక్రీకరించి టీడిపి నేతలు ప్రచారం చేస్తున్నారు