అన్వేషించండి

East Godavari News: వైసీపీ అధినేత జగన్ ఓటమి - కుటుంబంతో సహా ఆత్మహత్యకు వ్యక్తి యత్నం, రక్షించిన పోలీసులు

East Godavari News: వైసీపీ అధినేత జగన్ ఎన్నికల్లో ఓడిపోవడాన్ని జీర్ణించుకోలేని ఓ వ్యక్తి కుటుంబంతో సహా గోదావరిలో దూకుతానని హల్చల్ చేశాడు. రాజమండ్రి కొవ్వూరు గామన్ బ్రిడ్జ్ వద్ద ఈ ఘటన జరిగింది.

Man Tried To Jump Into The River In Rajamundry: తూర్పుగోదావరి (East Godavari) జిల్లాలో మంగళవారం విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. వైసీపీ అధినేత జగన్ (Ysrcp Leader Jagan) ఎన్నికల్లో ఓడిపోవడంతో ఓ వ్యక్తి తన కుటుంబంతో సహా గోదావరిలో దూకేందుకు యత్నించాడు. ఈ ఘటన రాజమండ్రిలో కొవ్వూరు (Kovvuru) గామన్ బ్రిడ్జి వద్ద జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బ్రాహ్మణగూడెంకు చెందిన వ్యక్తి మంగళవారం ఉదయం కొవ్వూరు గామన్ వంతెనపైకి ఫ్యామిలీతో సహా వచ్చి గోదావరిలో దూకుతానని హల్చల్ చేశాడు. సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి అత్యధిక మంది ఓట్లు వేసినప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడిపోయారని ప్రశ్నించాడు. దీనిపై విచారణ చేయాలని డిమాండ్ చేశాడు.

వంతెనపై నానా హంగామా

జగన్ తనకు చాలా సాయం చేశారని.. ఈరోజు తాను ఆరోగ్యంగా ఉన్నానంటే అందుకు జగనే కారణమని అన్నాడు. తాము వేసిన ఓట్లన్నీ ఏమైపోయాయంటూ నిలదీశాడు. ఓటమి పాలైన జగన్‌ను తాను చూడలేక భార్య, పిల్లలతో గోదావరిలో దూకుతానంటూ నానా హంగామా చేశాడు. ఈ సందర్భంగా వంతెనపై వైసీపీ జెండా ఎగురవేశాడు. జగన్‌కు అనుకూలంగా నినాదాలు చేశాడు. పోలీసులు వస్తే గోదావరిలో దూకేస్తానంటూ బెదిరించాడు. ఈ క్రమంలో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడకు చేరుకున్న పోలీసులు సదరు వ్యక్తిని వారించి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపించారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Sharmila: రేషన్ బియ్యం స్మగ్లింగ్ ఓ నేషనల్ మాఫియా - సీబీఐతో దర్యాప్తు చేయించాలని షర్మిల డిమాండ్
రేషన్ బియ్యం స్మగ్లింగ్ ఓ నేషనల్ మాఫియా - సీబీఐతో దర్యాప్తు చేయించాలని షర్మిల డిమాండ్
The Raja Saab Exclusive Update : ఫెస్టివల్స్‌ని టార్గెట్ చేస్తున్న ‘రాజా సాబ్’.. ప్రభాస్ డై హార్డ్ ఫ్యాన్స్‌కి పండగే
ఫెస్టివల్స్‌ని టార్గెట్ చేస్తున్న ‘రాజా సాబ్’.. ప్రభాస్ డై హార్డ్ ఫ్యాన్స్‌కి పండగే
Sajjala Bhargav Reddy Latest News: సజ్జల భార్గవ్‌రెడ్డికి షాక్- ముందస్తు బెయిల్‌కు సుప్రీంకోర్టు నిరాకరణ
సజ్జల భార్గవ్‌రెడ్డికి షాక్- ముందస్తు బెయిల్‌కు సుప్రీంకోర్టు నిరాకరణ
Tiger Attacks in Asifabad: ఆసిఫాబాద్ జిల్లాలో పెద్దపులి టెన్షన్, దాడి నుంచి రక్షించుకునేందుకు ఈ కొత్త టెక్నిక్ తెలుసా?
ఆసిఫాబాద్ జిల్లాలో పెద్దపులి టెన్షన్, దాడి నుంచి రక్షించుకునేందుకు ఈ కొత్త టెక్నిక్ తెలుసా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

జగన్ కేసుల్లో పురోగతి! సుప్రీం  కీలక ఆదేశాలుఆసిఫాబాద్ జిల్లాలో పులుల దాడిపై ఏబీపీ గ్రౌండ్ రిపోర్ట్హనుమంత వాహనంపై పద్మావతి అమ్మవారుVenkata Satyanarayana Penmetsa Mumbai Indians | IPL 2024 Auction లో దుమ్మురేపిన కాకినాడ కుర్రోడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila: రేషన్ బియ్యం స్మగ్లింగ్ ఓ నేషనల్ మాఫియా - సీబీఐతో దర్యాప్తు చేయించాలని షర్మిల డిమాండ్
రేషన్ బియ్యం స్మగ్లింగ్ ఓ నేషనల్ మాఫియా - సీబీఐతో దర్యాప్తు చేయించాలని షర్మిల డిమాండ్
The Raja Saab Exclusive Update : ఫెస్టివల్స్‌ని టార్గెట్ చేస్తున్న ‘రాజా సాబ్’.. ప్రభాస్ డై హార్డ్ ఫ్యాన్స్‌కి పండగే
ఫెస్టివల్స్‌ని టార్గెట్ చేస్తున్న ‘రాజా సాబ్’.. ప్రభాస్ డై హార్డ్ ఫ్యాన్స్‌కి పండగే
Sajjala Bhargav Reddy Latest News: సజ్జల భార్గవ్‌రెడ్డికి షాక్- ముందస్తు బెయిల్‌కు సుప్రీంకోర్టు నిరాకరణ
సజ్జల భార్గవ్‌రెడ్డికి షాక్- ముందస్తు బెయిల్‌కు సుప్రీంకోర్టు నిరాకరణ
Tiger Attacks in Asifabad: ఆసిఫాబాద్ జిల్లాలో పెద్దపులి టెన్షన్, దాడి నుంచి రక్షించుకునేందుకు ఈ కొత్త టెక్నిక్ తెలుసా?
ఆసిఫాబాద్ జిల్లాలో పెద్దపులి టెన్షన్, దాడి నుంచి రక్షించుకునేందుకు ఈ కొత్త టెక్నిక్ తెలుసా?
Farmers Protest: ఈ 6 నుంచి రైతుల ‘ఢిల్లీ ఛలో’ పాదయాత్రతో అలర్ట్, భారీగా పోలీసుల మోహరింపు
ఈ 6 నుంచి రైతుల ‘ఢిల్లీ ఛలో’ పాదయాత్రతో అలర్ట్, భారీగా పోలీసుల మోహరింపు
Vajedu SI Suicide News: వారం రోజుల్లో నిశ్చితార్థం- ఇంతలో వాజేడు ఎస్సై సూసైడ్‌- హరిత రిసార్ట్స్‌లో ఏం జరిగింది?
వారం రోజుల్లో నిశ్చితార్థం- ఇంతలో వాజేడు ఎస్సై సూసైడ్‌- హరిత రిసార్ట్స్‌లో ఏం జరిగింది?
Ram Gopal Varma News Today: రాంగోపాల్ వర్మకు హైకోర్టులో స్వల్ప ఊరట- సోమవారం వరకు అరెస్టు చేయొద్దని ఆదేశం 
Ram Gopal Varma News Today: రాంగోపాల్ వర్మకు హైకోర్టులో స్వల్ప ఊరట- సోమవారం వరకు అరెస్టు చేయొద్దని ఆదేశం 
Honor Killing In Hyderabad : కారుతో ఢీ కొట్టి కత్తితో పొడిచి అక్కను చంపిన తమ్ముడు-కులాంతర వివాహం చేసుకుందని కసితో హత్య
Honor Killing In Hyderabad : కారుతో ఢీ కొట్టి కత్తితో పొడిచి అక్కను చంపిన తమ్ముడు-కులాంతర వివాహం చేసుకుందని కసితో హత్య
Embed widget