Top Headlines: డిప్యూటీ సీఎం పవన్ వ్యాఖ్యల వెనుక ఆంతర్యం ఏంటి? - ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM
Top News: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకూ ఉన్న టాప్ హెడ్ లైన్స్ చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
Today Top Headlines In AP And Telangana:
1. డిప్యూటీ సీఎం పవన్ వ్యాఖ్యల వెనుక ఆంతర్యం ఏంటి?
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ఆశయాలు లక్ష్యాలు నెరవేరాలని దానికి మరో 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండాలని అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ చేసిన ప్రసంగం టిడిపి నేతల్లో జోష్ నింపితే జనసైనికుల్లో అయోమయాన్ని క్రియేట్ చేసింది. చంద్రబాబు ఏపీ కోసం అమరావతి కోసం కంటున్న కలలు నెరవేరాలని అభివృద్ధిపరంగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాల అడుగుజాడల్లో తామంతా నడుస్తామని పవన్ అన్నారు. ఇది రాజకీయంగా ప్రస్తుత పరిస్థితుల్లో అభివృద్ధి అనే యాంగిల్ మాట్లాడిన మాటలు కావొచ్చు. కానీ జనసైనికులు మాత్రం దీన్ని మరోలా భావించే ప్రమాదం ఉందని కామెంట్స్ వినపడుతున్నాయి. ఇంకా చదవండి.
2. పెన్షన్‌దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
పెన్షన్‌దారులకు ఏపీ ప్రభుత్వం (AP Government) గుడ్ న్యూస్ చెప్పింది. పింఛన్ల పంపిణీపై కొత్త మార్గదర్శకాలు (New Guidelines) విడుదల చేసింది. వరుసగా 2 నెలలు పింఛన్ తీసుకోకున్నా మూడో నెలలో ముందు నెలల పింఛన్‌తో కలిపి మొత్తం ఇచ్చేలా ఆదేశాలు జారీ చేసింది. వరుసగా 3 నెలలు పింఛన్ తీసుకోకుంటే శాశ్వతంగా వలస వెళ్లినట్లు భావిస్తూ పింఛన్ నిలిపివేయనున్నారు. ఈ నెల నుంచే ఈ గైడ్ లైన్స్ అమల్లోకి వస్తాయి. అయితే, ఇప్పటివరకూ ఒక నెలలో పింఛన్ తీసుకోకుంటే దాన్ని మళ్లీ ఇచ్చేవారు కాదు. ఇంకా చదవండి.
3. ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు
తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల కేసు కీలక మలుపు తిరిగింది. బీఆర్‌ఎస్ పార్టీ గుర్తుపై గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్‌కు ఊరట ఇచ్చే తీర్పును హైకోర్టు వెల్లడించింది. ఈ కేసు విషయంలో పోరాడుతున్న బీఆర్‌ఎస్‌కు ఇదో పెద్ద షాక్ అని చెప్పుకోవచ్చు. నాలుగు వారాల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సింగిల్ బెంచ్ తీర్పును హైకోర్టు కొట్టేసింది. తెలంగాణలో కారు గుర్తుపై పోటీ చేసి విజయం సాధించిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు చట్టాలను ఉల్లంఘించి కాంగ్రెస్‌లో చేరినట్టు బీఆర్‌ఎస్ కోర్టుకు వెళ్లింది. ఇంకా చదవండి.
4. వరంగల్‌లో మావోయిస్టుల ఘాతుకం
వరంగల్ జిల్లాలో మరోసారి దారుణం జరిగింది. ఉనికిని చాటుకోవడానికి కష్టపడుతున్న మావోయిస్టులు ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని హతమార్చారు. తెలంగాణ ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతంలో ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. ఇన్ఫార్మర్ నేపంతో పంచాయితీ కార్యదర్శితో పాటు ఆయన తమ్ముడిని మావోయిస్టులు అర్ధరాత్రి హత్య చేశారు. ములుగు జిల్లా వాజేడు మండలంలోని పెనుగోలు కాలనీలో పంచాయతి కార్యదర్శి ఉయిక రమేష్, తమ్ముడు ఉయిక అర్జున్‌ను మావోయిస్టులు హత్య చేశారు. ఇంకా చదవండి.
5. బ్యాంక్ లాకర్‌లో పొరపాటున కూడా ఇవి దాచొద్దు
దొంగతనం, అగ్నిప్రమాదం సహా ఇతర రిస్క్‌లు లేకుండా విలువైన వస్తువులు, డాక్యుమెంట్లు వంటివాటిని భద్రంగా దాచుకోవడానికి బ్యాంక్ లాకర్లు ఒక పాపులర్ ఛాయిస్. లాకర్లు ఆ వస్తువులకు రక్షణ కల్పించడంతో పాటు వాటి యజమానులకు మనశ్శాంతిని అందిస్తాయి. అయితే, అద్దె కడుతున్నాం కదాని ఏది పడితే అది బ్యాంకు లాకర్‌లో దాచకూడదు. బ్యాంక్ లాకర్లలో ఏమి ఉంచాలి, ఏమి ఉంచకూడదు అనే దానిపై కొన్ని స్పష్టమైన రూల్స్ ఉన్నాయి. లాకర్ అద్దెకు తీసుకున్న ప్రతి ఒక్కరు ఈ రూల్స్ పాటించాలి. ఇంకా చదవండి.