అన్వేషించండి

Warangal Crime News Today: వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 

Maoists In Warangal: పార్టీ సమాచారాన్ని పోలీసులకు అందిసున్నారే నెపంతో వరంగల్‌లో ఇద్దర్ని చంపేశారు మావోయిస్టులు. ఇందులో ఒకరు ప్రభుత్వ ఉద్యోగి ఉన్నారు. ఇద్దరూ ఒక కుటుంబానికి చెందిన వాళ్లే.

వరంగల్‌లో దారుణం


    > వరంగల్‌లో రెచ్చిపోయిన మావోయిస్టులు
    > ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దరి హత్య
    > ఇద్దరూ ఒకే ఫ్యామిలీకి చెందిన అన్నదమ్ముళ్లు
    > ఇద్దరిలో ఒకరు ప్రభుత్వ ఉద్యోగి

Maoists Killed Two Persons In Warangal: వరంగల్ జిల్లాలో మరోసారి దారుణం జరిగింది. ఉనికిని చాటుకోవడానికి కష్టపడుతున్న మావోయిస్టులు ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని హతమార్చారు. తెలంగాణ ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దు ప్రాంతంలో ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. ఇన్ఫార్మర్ నేపంతో పంచాయితీ కార్యదర్శితో పాటు ఆయన తమ్ముడిని మావోయిస్టులు అర్ధరాత్రి హత్య చేశారు. 

ములుగు జిల్లా వాజేడు మండలంలోని పెనుగోలు కాలనీలో పంచాయతి కార్యదర్శి ఉయిక రమేష్, తమ్ముడు ఉయిక అర్జున్‌ను మావోయిస్టులు హత్య చేశారు. మావోయిస్టుల సమాచారాన్ని పోలీసులకు అందిస్తున్నారన్న అనుమానంతో అర్ధరాత్రి అన్నదమ్ములను నరికి చంపారు. ఉయిక రమేష్, ఉయిక అర్జున్‌ను హత్య చేసిన చోట మావోయిస్టులు లేఖ వదిలి వెళ్ళారు. అన్నదమ్ముల హత్యతో ఏజెన్సీ ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. 

పటిష్ట నిఘా ఉన్నా సరే సరిహద్దులో ఉన్న గ్రామంలో హత్య

తెలంగాణ ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దు ప్రాంతాల్లో పోలీస్ బలగాలు పెద్ద ఎత్తున కూంబింగ్ ఆపరేషన్ చేస్తున్నాయి. నిఘా కూడా పెంచాయి. ఇలాంటి టైంలో మావోయిస్టులు ఇద్దర్నీ హత్య చేయడం సంచలనంగా మారింది. సరిహద్దు ప్రాంతాల్లో తీవ్ర నిర్బంధం కొనసాగుతున్నప్పటికీ గ్రామంలోకి వచ్చిన మావోయిస్టులు ఇద్దరిని హత్య చేసి వెళ్లిపోవడం అందర్నీ ఆందోళనకు గురి చేస్తోంది. దీన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు ఘటనపై విచారణ వేగవంతం చేశారు. 

చంపేసిన చోట లేఖను విడిచిపెట్టి వెళ్లిన మావోయిస్టులు

పోలీస్ ఇన్ ఫార్మర్లుగా మారిన రమేష్, అర్జున్‌ వారికి తమ పార్టీకి సంబంధించిన మాచారం అందిస్తున్నారని లేఖ పేర్కొన్నారు మావోయిస్టులు. గ్రామంలో ఉంటూ పార్టీ కార్యక్రమాలను, లీడర్ల కదలికలను వారి అనుచరుల ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారని అన్నారు. సేకరించిన విషయాలను మండల సెంటరకు వెళ్ళే పోలీసులకు అందిస్తున్నారని లేఖలో ప్రస్తావించారు. S1B కంట్రోల్‌లోకి వెళ్లి పనిచేస్తూ ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న గ్రామాలు సమాచాం సేకరిస్తున్నారట.  లంకపిల్ల, ఉన్నప్ప, ఊట్ల, శ్యానులదొడ్డి, వాయిపేట గ్రామాలతోపాటు చుట్టు పక్క గ్రామాల బంధువులు, స్నేహితుల ద్వారా సమాచారం సేకరించి  పోలీసులకు చేరవేస్తున్నారని లేఖలో వివరించారు.

Also Read: దేవుడిలా వచ్చి సీపీఆర్ చేసి మహిళ ప్రాణాలు కాపాడిన పోలీస్ కానిస్టేబుల్స్

వార్నింగ్ ఇచ్చినా పద్దతి మార్చుకోలేదన్న మావోయిస్టులు

మావోయిస్టులపై కొన్ని దాడులకు ఈ సమాచారం కారణమైందని అన్నారు. ఆ తరువాత రమేష్‌కు ఉద్యోగం వచ్చి వాజేడు మండలంలో ఉంటున్నాడని. షికారు, చేపల వేట, పశువుల మేపడం పేరుతో అడవిలోకి వెళ్లి సమాచారం సేకరిస్తూ పోలీసులకు చెప్పుతున్నాడని తెలిపారు. పెనుగోలు గ్రామస్థులు గుట్టపైన ఉండొద్దని ఒత్తిడి చేసే దింపారని ప్రస్తావించారు. పద్దతి మార్చుకోవాలని హెచ్చరించినా వినలేదని అందుకే రమేష్‌ను హత్య చేశామన్నారు. వెంకటాపురం, వాజేడు ఏరియా కమిటీ కార్యదర్శి శాంత పేరుతో ఈ లేఖ విడుదల చేశారు.

Also Read: ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Warangal Crime News Today: వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
Adilabad Tiger News: ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Warangal Crime News Today: వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
Adilabad Tiger News: ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
Pushpa 2: యూట్యూబ్‌ షేక్ అవ్వాలంతే... 'పుష్ప 2'లో శ్రీ లీల స్పెషల్ సాంగ్ 'కిస్సిక్' రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్
యూట్యూబ్‌ షేక్ అవ్వాలంతే... 'పుష్ప 2'లో శ్రీ లీల స్పెషల్ సాంగ్ 'కిస్సిక్' రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
Ram Charan: మైసూరులో రామ్ చరణ్ సినిమా షూటింగ్... చాముండేశ్వరి మాత ఆశీస్సులతో RC16 Movie షురూ
మైసూరులో రామ్ చరణ్ సినిమా షూటింగ్... చాముండేశ్వరి మాత ఆశీస్సులతో RC16 Movie షురూ
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Embed widget