Today Top Headlines: దావోస్‌లో రెండో రోజు సీఎం చంద్రబాబు బిజీ బిజీ - హైదరాబాద్‌లో ఐటీ సోదాలు, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM
Top News: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకూ ఉన్న టాప్ హెడ్ లైన్స్ చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

Today Top Headlines In AP And Telangana:
1. దావోస్‌లో రెండో రోజు సీఎం చంద్రబాబు బిజీ బిజీ
స్విట్జర్లాండ్‌లోని దావోస్ లో జరుగుతోన్న ప్రపంచ ఆర్థిక సదస్సుకు వెళ్లిన ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొలిరోజు పర్యటనలో పలువురు పెట్టుబడిదారులతో సమావేశమయ్యారు. ఇప్పుడు రెండూ రోజూ ప్రపంచ దిగ్గజ కంపెనీల అధిపతులతో వరుస సమావేశాలు నిర్వహించనున్నారు. అందులో భాగంగా 15కు పైగా సమావేశాల్లో వివిధ సంస్థల ప్రతినిధులతో చంద్రబాబు ముఖాముఖి భేటీల్లో పాల్గొననున్నారు. గ్రీన్ హైడ్రోజన్ - గ్రీన్ మాన్యుఫాక్చరింగ్, నెక్స్ట్ పెట్రోకెమికల్ హబ్, ఎనర్జీ ట్రాన్సిషన్, బ్లూ ఎకానమీ సదస్సు, రౌండ్ టేబుల్ వంటి సమావేశాలకు చంద్రబాబు హాజరుకానున్నారు. ఇంకా చదవండి.
2. జనసేన కొత్త మెలిక
" నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలి " ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో గట్టిగా వినపడుతున్న డిమాండ్ ఇది. పాలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డితో మొదలుపెట్టి పిఠాపురం వర్మ, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, లాంటి వాళ్ళు ఈ డిమాండ్ ను గట్టిగా వినిపించారు. ఒకవైపు హై కమాండ్ ఈ విషయంపై సైలెంట్ గా ఉండమని కూటమి లో చర్చించుకున్నాకే ఎలాంటి నిర్ణయం అయినా ఫైనల్ అవుతుందని నేతలకు సంకేతాలు పంపింది. అయితే అలాంటి సంకేతాలు వెళ్లి కనీసం రెండు మూడు గంటలన్నా గడవక ముందే మంత్రి భరత్ ఏకంగా నారా లోకేష్ భవిష్యత్తు సీఎం అంటూ దావోస్ పర్యటనలో ఉన్న చంద్రబాబు సమక్షంలోనే సంచలన కామెంట్స్ చేశారు. ఇంకా చదవండి.
3. కీలక సమావేశంలో కూల్‌గా రమ్మీ ఆడిన డీఆర్వో
కీలక సమావేశంలో అనంతపురం డిఆర్ఓ మాలోల రమ్మీ గేమ్ ఆడడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అనంతపురం జిల్లా కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్ లో వేది కపై ఎస్సీ వర్గీకరణ సమస్యపై ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు సోమవారం వినతిపత్రాలు స్వీకరిస్తూ బిజీగా ఉన్నారు. వర్గీకరణకు వ్యతి రేకంగా, అనుకూలంగా వచ్చినవారితో కలెక్టర్ కార్యాలయం హడావిడిగా ఉంది. ఇంకా చదవండి.
4. దావోస్‌లో గ్రాండ్ ఇండియా పెవిలియన్‌కు సీఎం రేవంత్
దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సులో భారత్ పతాకం రెపరెపలాడింది. ప్రపంచ పెట్టుబడిదారులను ఆకర్షించేలా ఘనంగా గ్రాండ్ ఇండియా పెవిలియన్(Grand Indian Pavilion) ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు జయంత్ చౌధరి, చిరాగ్ పాస్వాన్‌తోపాటు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి(Revanth Reddy) మంత్రి శ్రీధర్‌బాబు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. ఇంకా చదవండి.
5. దిల్ రాజు సహా ప్రముఖ నిర్మాతల ఇళ్లపై ఐటీ దాడులు
హైదరాబాద్‌లో పలు చోట్ల ఐటీ అధికారులు ఆకస్మిక దాడులు చేస్తున్నారు. గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాము సినిమాలు నిర్మించిన దిల్ రాజు ప్రొడక్షన్స్ పై ఐటీ అధికారులు ఫోకస్ చేశారు. ప్రముఖ నిర్మాతలు, తెలంగాణ ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు, శిరీష్, లతో పాటు దిల్ రాజు కూతురు హన్సితా రెడ్డిలకు సంబంధించిన ఆస్తులపై ఐటి సోదాలు చేపట్టినట్లు సమాచారం. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లలో పలు నిర్మాతల ఇళ్లు, ఆఫీసులు, ఇతర ఆస్తులపై ఐటీ అధికారులు తనిఖీలు జరుగుతున్నాయి. ఇంకా చదవండి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

