అన్వేషించండి

Ivanka Trump Assassination Plot: ఎంతకు తెగించార్రా ? - ఇవాంకా ట్రంప్ హత్యకు ప్లాన్ చేస్తారా?

Iran IRGC Revenge: ఇవాంకా ట్రంప్ హత్యకు ఇరాన్ మద్దతు ఉన్న ఉగ్రవాది పన్నిన భయంకరమైన కుట్రను అమెరికా ఛేదించింది. ఫ్లోరిడా ఇంటి మ్యాప్‌లతో దొరికిన నిందితుడ్ని ప్రశ్నిస్తున్నారు.

Donald Trump Daughter Safety: అమెరికా అధ్యక్షుడి కుమార్తె ఇవాంకా ట్రంప్‌ను లక్ష్యంగా చేసుకుని సాగిన ఒక భయంకరమైన హత్య కుట్ర వెలుగులోకి రావడం ఇప్పుడు అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తోంది. ఇరాన్ మద్దతు ఉన్న ఒక ఉగ్రవాది ఈ దారుణానికి ఒడిగట్టేందుకు పక్కా ప్లాన్ వేశారని అమెరికన్ ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. కేవలం మాటలకే పరిమితం కాకుండా, ఇవాంకా నివాసముంటున్న ఫ్లోరిడా ఇంటి బ్లూప్రింట్లు  కూడా నిందితుడి వద్ద లభించడం పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది.  

 రివేంజ్ ప్లాన్ - ఎందుకీ కుట్ర? 

ఈ కుట్ర వెనుక మహమ్మద్ బాకర్ సాద్ దావూద్ అల్-సాదీ  అనే 32 ఏళ్ల ఇరాకీ జాతీయుడు ఉన్నట్లు నిర్ధారించారు. ఇతడు ఇరాన్   శక్తివంతమైన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్   తో సంబంధాలు కలిగి ఉన్నాడని సమాచారం. 2020లో ట్రంప్ ఆదేశాల మేరకు అమెరికా జరిపిన డ్రోన్  దాడిలో ఇరాన్ సైన్యాధ్యక్షుడు ఖాసీం సులేమానీ మరణించిన సంగతి తెలిసిందే. తన గురువు సులేమానీ మరణానికి ప్రతీకారంగా,  ట్రంప్ ఇంటిని తగలబెట్టాలంటే ఇవాంకాను చంపాలి  అని అల్-సాదీ ప్రతిజ్ఞ చేసినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. 

 అమెరికా నిఘా వలయం - నిందితుడి అరెస్ట్ 

అదృష్టవశాత్తూ ఈ కుట్రను అమెరికన్ భద్రతా సంస్థలు ఆదిలోనే పసిగట్టాయి. నిందితుడు అల్-సాదీ మే 15న టర్కీలో పట్టుబడగా, అతడిని తాజాగా అమెరికాకు అప్పగించారు. అతడి సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించగా,  మీ రాజభవనాలు కానీ, సీక్రెట్ సర్వీస్ కానీ మిమ్మల్ని రక్షించలేవు.. ప్రతీకారం తీర్చుకునే సమయం ఆసన్నమైంది అంటూ అరబిక్‌లో హెచ్చరికలు చేసినట్లు తేలింది. ప్రస్తుతం అతడిని న్యూయార్క్‌లోని ఒక జైలులో ఉంచి విచారిస్తున్నారు. 

 ట్రంప్ కుటుంబంపై పెరుగుతున్న ముప్పు 

కేవలం ఇవాంకా మాత్రమే కాకుండా, అధ్యక్షుడు ట్రంప్ , ఆయన కుటుంబ సభ్యులందరిపై గత కొన్నాళ్లుగా భద్రతాపరమైన ముప్పు పెరుగుతోంది. ముఖ్యంగా ఇరాన్‌తో సంబంధాలు దెబ్బతిన్నందున, ఈ దాడుల హెచ్చరికలు వాషింగ్టన్ వర్గాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇప్పటికే సీక్రెట్ సర్వీస్ విభాగం ట్రంప్ కుటుంబానికి భద్రతను అత్యంత కట్టుదిట్టం చేసింది. ఏప్రిల్ 2026లో కూడా వాషింగ్టన్‌లో ట్రంప్ పాల్గొన్న ఒక ఈవెంట్ వద్ద భద్రతా లోపాలు బయటపడటంతో అధికారులు ఇప్పుడు మరింత అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం ఇవాంకా క్షేమంగానే ఉన్నప్పటికీ, ఈ అంతర్జాతీయ ఉగ్రవాద కుట్ర వెలుగుచూడటంతో అమెరికా రక్షణ వ్యవస్థలు హై-అలర్ట్ ప్రకటించాయి. "చీకటి శక్తులు విజయం సాధించవు" అన్న నమ్మకంతో ట్రంప్ యంత్రాంగం ముందడుగు వేస్తోంది. 

టాప్ హెడ్ లైన్స్

Seifert, Phillips Carnage:  ప్ర‌త్య‌ర్థి బ్యాటర్ల ఊచకోతతో టీమిండియాకు మ‌రో ఓట‌మి.. ఐదో టీ20లో కివీస్ ఘ‌న విజ‌యం.. సత్తా చాటిన సీఫెర్ట్, ఫిలిఫ్స్, మిల్నే
ప్ర‌త్య‌ర్థి బ్యాటర్ల ఊచకోతతో టీమిండియాకు మ‌రో ఓట‌మి.. ఐదో టీ20లో కివీస్ ఘ‌న విజ‌యం.. సత్తా చాటిన సీఫెర్ట్, ఫిలిఫ్స్, మిల్నే
CM Revanth Reddy: రైళ్లు ఆపినా.. తెలంగాణ కాంగ్రెస్ సైన్యాన్ని ఆపలేకపోయారు: ఢిల్లీలో రేవంత్ రెడ్డి
రైళ్లు ఆపినా.. తెలంగాణ కాంగ్రెస్ సైన్యాన్ని ఆపలేకపోయారు: ఢిల్లీలో రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు
Lokesh Visits Raptadu Victim: రాప్తాడు బాలికకు లోకేశ్ పరామర్శ - మా బిడ్డలా భావించండి.. డాక్టర్లకు విజ్ఞప్తి !
రాప్తాడు బాలికకు లోకేశ్ పరామర్శ - మా బిడ్డలా భావించండి.. డాక్టర్లకు విజ్ఞప్తి !
Murasu Cyclone: దూసుకొస్తున్న మురసు తుపాను.. ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు! 3న తీరం దాటే అవకాశం
దూసుకొస్తున్న మురసు తుపాను.. ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు! 3న తీరం దాటే అవకాశం

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Seifert, Phillips Carnage:  ప్ర‌త్య‌ర్థి బ్యాటర్ల ఊచకోతతో టీమిండియాకు మ‌రో ఓట‌మి.. ఐదో టీ20లో కివీస్ ఘ‌న విజ‌యం.. సత్తా చాటిన సీఫెర్ట్, ఫిలిఫ్స్, మిల్నే
ప్ర‌త్య‌ర్థి బ్యాటర్ల ఊచకోతతో టీమిండియాకు మ‌రో ఓట‌మి.. ఐదో టీ20లో కివీస్ ఘ‌న విజ‌యం.. సత్తా చాటిన సీఫెర్ట్, ఫిలిఫ్స్, మిల్నే
CM Revanth Reddy: రైళ్లు ఆపినా.. తెలంగాణ కాంగ్రెస్ సైన్యాన్ని ఆపలేకపోయారు: ఢిల్లీలో రేవంత్ రెడ్డి
రైళ్లు ఆపినా.. తెలంగాణ కాంగ్రెస్ సైన్యాన్ని ఆపలేకపోయారు: ఢిల్లీలో రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు
Lokesh Visits Raptadu Victim: రాప్తాడు బాలికకు లోకేశ్ పరామర్శ - మా బిడ్డలా భావించండి.. డాక్టర్లకు విజ్ఞప్తి !
రాప్తాడు బాలికకు లోకేశ్ పరామర్శ - మా బిడ్డలా భావించండి.. డాక్టర్లకు విజ్ఞప్తి !
Murasu Cyclone: దూసుకొస్తున్న మురసు తుపాను.. ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు! 3న తీరం దాటే అవకాశం
దూసుకొస్తున్న మురసు తుపాను.. ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు! 3న తీరం దాటే అవకాశం
YS Jagan Protest: పులివెందుల ఆర్వో ఆఫీసుకు తాళం! వైసీపీ అభ్యర్థులతో జగన్ బైఠాయింపు
పులివెందుల ఆర్వో ఆఫీసుకు తాళం! వైసీపీ అభ్యర్థులతో జగన్ బైఠాయింపు
MG Motor Car Price Hike: ఈ 2 కార్ల ధరలు పెరిగాయి, కొనేముందు కొత్త ధరలు చెక్ చేసుకోండి
MG Motors 2 కార్ల ధరలు పెరిగాయి, కొనేముందు కొత్త ధరలు చెక్ చేసుకోండి
Anakapalli Movie OTT : ఓటీటీలోకి వచ్చేస్తోన్న 'అనకాపల్లి' - విలేజ్ రొమాంటిక్ డ్రామా ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి వచ్చేస్తోన్న 'అనకాపల్లి' - విలేజ్ రొమాంటిక్ డ్రామా ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Dastagiri Intercepts Jagan: వివేకాను చంపించింది మీరే.. పులివెందులలో జగన్ కాన్వాయ్‌ను అడ్డుకున్న దస్తగిరి !
వివేకాను చంపించింది మీరే.. పులివెందులలో జగన్ కాన్వాయ్‌ను అడ్డుకున్న దస్తగిరి !
Embed widget