Top Headlines: గుంటూరు జిల్లాలో కొకైన్ కలకలం - పెట్టుబడుల ఆకర్షణకు తెలుగు రాష్ట్రాల సీఎంల పోటీ, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM
Top News: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకూ ఉన్న టాప్ హెడ్ లైన్స్ చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

Today Top Headlines In AP And Telangana:
1. గుంటూరు జిల్లాలో కొకైన్ కలకలం
గుంటూరు జిల్లాలో కోకైన్ కలకలం రేపింది. గుంటూరు ఎక్సైజ్ శాఖ పోలీసులు 8.5 గ్రాముల కోకైన్ ను సీజ్ చేసినట్లు తెలిపారు. గుంటూరు శ్యామలా నగర్ వద్ద ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొన్నారు. వారిని విచారించగా కొకైన్ విషయం బయటపడింది. ఈ ఏడాది జిల్లాలో తొలి కొకైన్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. గుంటూరు సిటీలోలో ఒక్క గ్రామ్ కోకైన్ 3 వేల నుంచి రూ.6 వేల రూపాయల వరకు అమ్మకాలు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతోంది. ఇంకా చదవండి.
2. పవన్‌కు కుర్చీ లేదని గమనించిన అమిత్ షా, ఏం చేశారంటే?
విజయవాడ సమీపంలోని గన్నవరం మండలం కొండపావులూరులో NDRF 20వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్శంగా జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ (NIDM) సౌత్ క్యాంపస్‌ను కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, తదితరులు పాల్గొన్నారు. NDRF కార్యకలాపాలు వివరించే ఏవీని సభావేదికపై అధికారులు ప్రదర్శించారు. ఇంకా చదవండి.
3. పెట్టుబడుల ఆకర్షణకు తెలుగు సీఎంల పోటీ
స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ 2025కి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి హాజరవుతున్నారు. తమ రాష్ట్రాలకు పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించేందుకు మంత్రులు, అధికారుల బృందంతో బయలుదేరుతున్నారు. ఈ పెట్టుబడుల పోటీలో ఎవరు పై చేయి సాధిస్తారన్న దానిపై సర్వత్రా ఆసక్తి, ఉత్కంఠ నెలకొంది. ఈ విషయంలో ఇరువురికీ సమానమైన సానుకూల, ప్రతికూల అంశాలున్నాయి. ఇంకా చదవండి.
4. పసుపు బోర్డును స్వాగతించిన ఎమ్మెల్సీ కవిత
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పసుపు బోర్డు ఏర్పాటును స్వాగతించారు. క్వింటాలు పసుపుకు రూ. 15 వేల కనీస మద్ధతు ధర ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆమె డిమాండ్ చేశారు. పసుపు దిగుమతులపై నియంత్రణ విధించాలని, మరోవైపు మద్దతు ధర పెంచాలి. ఈ రెండు జరిగినప్పుడే పసుపు బోర్డుకు సార్థకత వస్తుంది. అప్పుడే పసుపు రైతులకు సంపూర్ణ న్యాయం లభిస్తుందన్నారు. ఏదో తూతూమంత్రంగా పసుపు బోర్డును ఏర్పాటు చేయడం సరికాదని, వారికి తగిన సౌకర్యాలు, పరిశోధన సమర్థ్యాన్ని సమకూర్చాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. ఇంకా చదవండి.
5. ఎమ్మెల్యేల పార్టీ మార్పుపై బీఆర్ఎస్ వ్యూహం ఇదేనా!
ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం ప్రజాప్రతినిధిగా ఎన్నికయిన పార్టీకి రాజీనామా చేసినా ఇతర పార్టీ సభ్యత‌్వం తీసుకున్నా అనర్హులవుతారు. ఈ చట్టం ప్రకారం ఇప్పటికే కాంగ్రెస్ లో చేరిన పది మంది ఎమ్మెల్యేలు అనర్హతా వేటుకు గురయ్యే అర్హత సాధించినట్లే. కానీ అదే చట్టంలో అనర్హతా వేటు ఎవరు వేయాలో నిర్దేశించారు. ఈ విషయంలో స్పీకర్ నిర్ణయమే ఫైనల్. తప్పుడు అఫిడవిట్ సమర్పించారని.. మరో విధమైన ఉల్లంఘనకు పాల్పడ్డారని ఎవరైనా ఎమ్మెల్యేపై కోర్టులు అనర్హతా వేటు వేసిన తీర్పులు ఉన్నాయి కానీ ఇలా పార్టీ ఫిరాయింపుల కింద అనర్హతా వేటు వేసిన తీర్పులు గతంలో లేవు. ఇంకా చదవండి.





















