World Economic Forum: వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో పెట్టుబడులను ఆకర్షించేందుకు తెలుగు సీఎంల మధ్య పోటీ
Revanth Reddy : స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ 2025కు ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. ఈ కార్యక్రమానికి ఉభయ రాష్ట్రాల సీఎంలు హాజరుకానున్నారు.

Chandrababu at World Economic Forum : స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ 2025కి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి హాజరవుతున్నారు. తమ రాష్ట్రాలకు పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించేందుకు మంత్రులు, అధికారుల బృందంతో బయలుదేరుతున్నారు. ఈ పెట్టుబడుల పోటీలో ఎవరు పై చేయి సాధిస్తారన్న దానిపై సర్వత్రా ఆసక్తి, ఉత్కంఠ నెలకొంది. ఈ విషయంలో ఇరువురికీ సమానమైన సానుకూల, ప్రతికూల అంశాలున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో పెట్టుబడులు - సానుకూల, ప్రతికూల అంశాలు
తెలంగాణ విషయానికొస్తే హైదరాబాదే పెట్టుబడులను ఆకర్షించేందుకు ఓ పెద్ద సానుకూలాంశం అని చెప్పవచ్చు. ఇక్కడ పెట్టుబడుల కోసం పెద్దగా ప్రయత్నించాల్సిన అవసరం లేకుండానే పెట్టుబడిదారులు, పారిశ్రామిక వేత్తలు తరలివస్తారు. ఇప్పటికే చాలా కంపెనీలు ఇక్కడ ఇన్వెస్ట్ చేసి, లాభాలను అందిపుచ్చుకోవడం చూస్తూనే ఉన్నాం. అందుకు అవసరమైన పూర్తి ఇన్ ఫ్రా స్ట్రక్చర్ కూడా ఉండడంతో ఇన్వెస్ట్ చేయాలనుకునే కంపెనీలు పెద్దగా ఆలోచించాల్సిన అవసరముండదని భావిస్తున్నారు. ఇక ప్రతికూలతల విషయానికి వస్తే రేవంత్ రెడ్డి తొలిసారి తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన అధికార పగ్గాలు చేపట్టి ఏడాది మాత్రమే పూర్తయింది. దీంతో ఇరువురి మధ్య సంబంధాలు ఎలా ఉంటాయో అన్నది ఆసక్తిగా మారింది.
ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే.. ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబుకు ఈ విషయంలో అపారమైన అనుభవం ఉంది. గతంలోనూ ఆయన పలుమార్లు వరల్డ్ ఎకనామిక్ ఫోరంకు హాజరయ్యారు. అంతేకాదు అభివృద్ధి, దార్శనికతలోనూ చంద్రబాబు ట్రాక్ రికార్డ్ అద్భుతంగా ఉండడం మరో ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. దీంతో సీఎం పెట్టుబడిదారులకు కొత్త వ్యక్తే కాదు. అందువల్ల పెట్టుబడులను ఆకర్షించేందుకు ఇది ఉత్తమ కారణంగా చెప్పవచ్చు. ఈ సమయంలోనే కొన్ని ప్రతికూలతలు ఎదుర్కొనే అవకాశం కూడా కనిపిస్తోంది. గత ఐదేళ్ల జగన్ పాలనలో బ్రాండ్ ఏపీ ఇమేజ్ దారుణంగా దిగజారింది. దీంతో మళ్లీ జగన్ పాలన రాదన్న గ్యారంటీ ఇవ్వగలరా అన్న ప్రశ్న పెట్టుబడి దారుల నుంచి ఆయనకు ఎదురయ్యే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది.
‘బ్రాండ్ ఏపీ’ని ప్రమోట్ చేయనున్న ఆంధ్రా సీఎం
ఉపాధి ఆధారిత పారిశ్రామిక విధానాలను హైలైట్ చేయడం, రాష్ట్రానికి పెట్టుబడులను తీసుకురావడం చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారు. జాతీయ, అంతర్జాతీయ కంపెనీలను ఆకర్షించేందుకు మానవ వనరులు, మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ రాయితీలు, సుస్థిర నాయకత్వం, సమర్థవంతమైన వ్యాపార వాతావరణంతో సహా రాష్ట్ర బలాబలాలను నొక్కి చెప్పేందుకు ఈ వేదికను ఉపయోగించుకుంటారని ఇటీవలే ఆయన ఒక ప్రకటనలో చెప్పారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఈ రోజు సాయంత్రం 4 గంటలకు అమరావతి నుంచి ఢిల్లీకి బయలుదేరి, సోమవారం తెల్లవారుజామున 1.30 గంటలకు జ్యూరిచ్‌కు విమానంలో వెళ్తారని సమాచారం. ఆ తర్వాత స్విట్జర్లాండ్‌లోని భారత రాయబారిని కలిసి.. అనంతరం స్థానిక హోటల్‌లో పారిశ్రామికవేత్తలతో, పలువురు తెలుగు పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే "మీట్ అండ్ గ్రీట్ తెలుగు డయాస్పోరా" కార్యక్రమంలో, సీఎం పెట్టుబడి అవకాశాల గురించి చర్చించి, ఆంధ్రప్రదేశ్‌ను ప్రమోట్ చేయనున్నారు..
Also Read : Amit Shah: విశాఖ స్టీల్ ప్లాంట్ తెలుగువారి ఆత్మగౌరవమన్న అమిత్ షా- జగన్ ప్యాలెస్‌లపై ఆరా తీసిన కేంద్ర మంత్రి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

