Amit Shah AP Tour: పవన్ కళ్యాణ్‌కు కుర్చీ లేదని గమనించిన అమిత్ షా, వెంటనే ఏం చేశారో చూడండి
Pawan Kalyan News | ఎన్డీఆర్ఎఫ్ కు సంబంధించిన సౌత్ క్యాంపస్ ప్రారంభోత్సవంతో ఆసక్తికర ఘటన జరిగింది. రెండు కుర్చీలే ఉన్నాయని గమనించిన అమిత్ షా మరో కుర్చీ తెప్పించి పవన్ ను ఆహ్వానించారు.

Amit Shah For Pawan Kalyan | గన్నవరం: విజయవాడ సమీపంలోని గన్నవరం మండలం కొండపావులూరులో NDRF 20వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్శంగా జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ (NIDM) సౌత్ క్యాంపస్‌ను కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, తదితరులు పాల్గొన్నారు. NDRF కార్యకలాపాలు వివరించే ఏవీని సభావేదికపై అధికారులు ప్రదర్శించచారు. దేశంలో NDRFకు మొత్తం 16 బెటాలియన్లు ఉండగా, ఇక్కడ గన్నవరంలో ఉన్నది 10వ బెటాలియన్.

కొండపావులూరులో NDRF 20వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. అక్కడ కేవలం రెండు కుర్చీలు మాత్రమే ఉండటంతో, ఇది గమనించిన అమిత్ సిబ్బందికి చెప్పి మరో కుర్చీ తెప్పించారు. తాము కూర్చునే సమయంలో పవన్ కళ్యాణ్ ను కూడా ఆయన ఆహ్వానించారు. కేంద్ర మంత్రి అమిత్ షా కుర్చీ తెప్పించి పవన్ కళ్యాణ్ కూర్చోబెట్టి గౌరవించారని జనసైనికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కుర్చీల కోసం పవన్ కళ్యాణ్ ఎప్పుడూ వెంపర్లాడలేదని, ఆయన మంచితనానికి హోదాకు తగిన గౌరవం దక్కిందని జనసేన నేతలు చెబుతున్నారు. పవన్ కు అమిత్ షా కుర్చీ తెప్పించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Only 2 chairs vesaru.. Amit Shah garu inko chair theppinchi Kalyan ni kurchobettukunnaru pakkana 😍🙏@PawanKalyan @AmitShah pic.twitter.com/ej7JYN9fmD
— ✒ త్రివిక్రమ్ ᶠᵃⁿ ✍️ (@Harinani_) January 19, 2025
అంతకుముందు ఆదివారం ఉదయం విజయవాడలోని నోవాటెల్ హోటల్‌లో ఏపీ బీజేపీ నేతలతో కేంద్ర మంత్రి అమిత్‌షా సమావేశమయ్యారు. దాదాపు గంటన్నరపాటు బీజేపీ నేతలతో పలు అంశాలపై భేటీ కొనసాగింది. కేంద్రం నుంచి ఏపీకి అందుతున్న సాయంపై గట్టిగా ప్రచారం చేయాలని పార్టీ నేతలకు అమిత్‌షా దిశానిర్దేశం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్, పోలవరం ప్రాజెక్టుతో పాటు రాజధాని అమరావతి నిర్మాణం లాంటి అంశాల్లో కేంద్రం సహకారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని వారికి సూచించారు. మరోవైపు అంతర్గత విభేదాలను పక్కన పెట్టాలని, పార్టీ బలోపేతంపై ఫోకస్ చేయాలని దిశానిర్దేశం చేశారు. ఇటీవల జరిగిన హైందవ శంఖారావం సభ విజయవంతం కావడంపై వీహెచ్‌పీ నేతలను, బీజేపీ నేతలను అమిత్ షా అభినందించారు. అధిష్టానం ఇచ్చే సూచనల్ని పాటిస్తూ తమదైన శైలిలో రాజకీయాలు చేయాలని, కొన్ని అంశాల్లో ఆచితూచి వ్యవహరించాలని గీత దాటవద్దని సున్నితంగా సూచించినట్లు సమాచారం.






















