Top Headlines: వైసీపీ అధినేత జగన్‌కు జోగి రమేష్ షాక్? - రాజకీయాల్లోకి మంచు మనోజ్ దంపతులు!, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM
Top News: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకూ ఉన్న టాప్ హెడ్ లైన్స్ చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
Today Top Headlines In Ap And Telangana:
1. వైసీపీ అధినేత జగన్‌కు జోగి రమేష్ షాక్?
ఉమ్మడి కృష్ణా జిల్లా నూజివీడులో చాలా ఆసక్తికర సంఘటన జరిగింది. వైసిపి కీలక నేత, మాజీ మంత్రి జోగి రమేష్ కూటమి నేతలతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. మంత్రి పార్థసారథితో కలిసి ఊరు మొత్తం ర్యాలీగా తిరిగారు. గౌత లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమం సందర్భంగా టిడిపి నేతలతోపాటు వైసిపి నేత హాజరు కావడంపై ఒక్కసారిగా రాజకీయాల్లో చర్చ మొదలైంది. ఇప్పటికే పలువురు వైసిపి నేతలు 2024 ఎన్నికల ఫలితం తర్వాత జగన్‌కు బై బై చెప్పి కూటమి వైపు అడుగులు వేశారు. వారిలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, సామినేని ఉదయభాను, కిలారు రోశయ్య లాంటి వారు ఉన్నారు. ఇంకా చదవండి.
2. శ్రీకాకుళం జిల్లాలో రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు
శ్రీకాకుళం జిల్లాలో చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. ఈ మధ్య కాలంలో ప్రతి రోజూ ఏదో ప్రాంతంలో ఇలాంటి నేరాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు చైన్‌స్నాచర్లు ఏకంగా ఓ ఉపాధ్యాయురాలిపై హత్యాయత్నం చేశారు. బంగారం కోసం ప్రయత్నించి ఇవ్వకపోవడంతో హతమార్చేందుకు ట్రై చేశారు. శ్రీకాకుళం జిల్లా కవిటి మండలంలో సోమవారం ఉదయాన్నే ఘోరం జరిగింది. బొర్రపుట్టుగ గ్రామానికి చెందిన ఉపాధ్యాయురాలు భారతి ఉదయాన్నే స్కూల్‌కు వెళ్తున్నారు. వెనుక నుంచి వచ్చిన చైన్ స్నాచర్లు మొహానికి ముసుగులు వేసుకొని ఉన్నారు. ఇంకా చదవండి.
3. వైసీపీ శ్రేణులకు విజయసాయి కీలక సూచనలు
వన్ నేషన్ వన్ ఎలక్షన్ కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో 2027లోనే ఎన్నికలు జరగనున్నాయని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అభిప్రాయపడ్డారు. అందుకే వైసీపీ నేతలు, కార్యకర్తలు సిద్దంగా ఉండాలంటూ ఆయన వైజాగ్‌లో సూచించారు. విశాఖలో వైసీపీ కార్యాలయం ప్రారంభత్సవం సందర్భంగా మాట్లాడిన విజయసాయిరెడ్డి ప్రత్యర్థులపై విమర్శలు ఎక్కు పెట్టారు. జమిలి ఎన్నికలు వచ్చినప్పటికీ 2029లోనే ఎన్నికలు ఉంటాయని శనివారం చంద్రబాబు మీడియాకు తెలియజేశారు. దీనికి కౌంటర్‌గానే ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడారు. జమిలి ఎన్నికలు అమలులోకి వస్తాయని అందుకే ఆంధ్రప్రదేశ్‌కు 2027లోనే ఎన్నికలు వస్తాయని అన్నారు. ఇంకా చదవండి.
4. తెలంగాణలో భూమి లేని నిరుపేదలంటే ఎవరు?
తెలంగాణలో భూమిలేని నిరుపేదలకు 12 వేల ఆర్థిక సాయం ఇవ్వబోతున్నట్టు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రకటించింది. రెండు విడతలుగా ఇచ్చే సాయం తొలి దఫా నిధులు ఆరు వేల రూపాయలను ఈ నెల 28న విడుదల చేయనున్నారు. కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా డిసెంబర్ 28ని నిధుల విడుదలకు ముహూర్తంగా ఎంచుకున్నారు. భూమి ఉన్న రైతులకు ఇప్పటికే ఏటా 12 వేల రూపాయాలను ప్రభుత్వం ఇస్తోంది. కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఆ ప్రక్రియకు బ్రేక్ పడింది. దీన్ని సంక్రాంతి నుంచి ఇస్తామంటూ ప్రభుత్వం చెబుతోంది. అంత కంటే ముందు భూమి లేని రైతులకు సాయం చేయాలని భావిస్తోంది. ఇంకా చదవండి.
5. రాజకీయాల్లోకి మంచు మనోజ్ దంపతులు
మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో మొదలైన వివాదం ఇప్పుడు మరో టర్న్ తీసుకోనుంది. తన ఫ్యామిలీకి లైఫ్ థ్రెట్ ఉందని ఆరోపిస్తూ వస్తున్న మంచు మనోజ్ రాజకీయాల్లోకి వస్తున్నట్టు తెలుస్తోంది. భార్య మౌనికతో కలిసి ఇవాళ కీలక ప్రకటన చేయనున్నారని టాక్ నడుస్తోంది. ఇవాళ శోభా నాగిరెడ్డి జయంతి వేడుకల సందర్భంగా ఈ ప్రకటన వస్తుందని అంటున్నారు. మంచు మోహన్ బాబు ఫ్యామిలీ 2019 ఎన్నికల్లో వైసీపీలో చేరారు. తర్వాత ఆ పార్టీ విజయం కోసం ప్రచారం కూడా చేశారు. ఇంకా చదవండి.