అన్వేషించండి

Srikakulam Crime New: శ్రీకాకుళం జిల్లా కవిటిలో రెచ్చిపోయిన చైన్‌స్నాచర్లు - ఇద్దరిపై అటాక్- ఉపాధ్యాయురాలికి గాయాలు

Chain Snatchers Crime at Kaviti In Srikakulam: శ్రీకాకుళం జిల్లా కవిటిలో చైన్ స్నాచర్ల రెచ్చిపోయారు. ఓ ఉపాధ్యాయురాలిని గాయపరిచారు. అలా వెళ్తు ఓ మహిళ మెడలోని పుస్తెల తాడు లాక్కున్నారు.

Srikakulam Crime News : శ్రీకాకుళం జిల్లాలో చైన్‌ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. ఈ మధ్య కాలంలో ప్రతి రోజూ ఏదో ప్రాంతంలో ఇలాంటి నేరాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు చైన్‌స్నాచర్లు ఏకంగా ఓ ఉపాధ్యాయురాలిపై హత్యాయత్నం చేశారు. బంగారం కోసం ప్రయత్నించి ఇవ్వకపోవడంతో హతమార్చేందుకు ట్రై చేశారు. 

శ్రీకాకుళంజిల్లా కవిటి మండలంలో సోమవారం ఉదయాన్నే ఘోరం జరిగింది. బొర్రపుట్టుగ గ్రామానికి చెందిన ఉపాధ్యాయురాలు భారతి ఉదయాన్నే స్కూల్‌కు వెళ్తున్నారు. వెనుక నుంచి వచ్చిన చైన్ స్నాచర్లు మొహానికి ముసుగులు వేసుకొని ఉన్నారు. ఒకరు హెల్మెట్‌ పెట్టుకొని ఉన్నారు. ఒక్కసారిగా ఆమె మెడలోని బంగారాన్ని లాక్కునేందుకు యత్నించారు. 

కేటుగాళ్ల ప్రయత్నాన్ని అడ్డుకున్న భారతి... వారితో ఫైట్ చేశారు. వారి ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. అయితే బంగారం ఇవ్వలేదని కసితో ఆమెపై వారు దాడి చేశారు. ఈ పెనుగలాటలో ఆమె కిందపడిపోయారు. దీంతో ఆమె తలకు బలమైన గాయాలు అయ్యాయి. 

భారతి కేకలు విన్న స్థానికులు పరుగు పరుగున అక్కడికి వచ్చారు. ఇంతలో చైన్‌ స్నాచర్లు పరారయ్యారు. గాయాలైన భారతీని స్థానికులు కవిటిలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అలా వెళ్తూనే ఈదుపురంలో ఓ మహిళ వద్ద 3 తులలా పుస్తిలతాడు చోరీ చేశారు. 

Also Read: శ్రీకాకుళం జిల్లా దొంగనోట్ల కేసులో కీలక పరిణామం- ఆరు ప్రత్యేక బృందాలతో విచారణ

ఉపాధ్యాయురాలి మెడలో నుంచి బంగారం లాక్కునేందుకు యత్నించిన దొంగలు... విఫలమయ్యారు. అయితే అ రూట్‌లోనే వెళ్తూ వెళ్తూ ఈదుపురంలో మరో మహిళపై అటాక్ చేశారు. స్కూటీపై తన బిడ్డతో వెళ్తున్న ఆమెకు ఈదుపురం వెళ్లేందుకు దారి ఎటు అని అడిగారు. ఆమె రోడ్డులోనే వెళ్లండని అని చెబుతుండగానే చైన్ స్నాచర్లు అటాక్ చేశారు. ఆమె మెడలోని పుస్తెల తాడు లాక్కొని పరారయ్యారు. ఆ వ్యక్తి తెల్లగా వెనుక బ్యాక్ వేసుకొని ఉన్నాడని బాధిత మహిళ చెబుతోంది. 

ఈ మధ్య కాలంలో ఉద్దానం ప్రాంతంలో ఇలాంటి కేసులు పెరిగిపోతున్నాయి. ఉదయాన్నో సాయంత్రం రోడ్డుపై ఒంటరిగా కనిపించే ఆడవాళ్లను చైన్‌ స్నాచర్లు టార్గెట్ చేసుకుంటున్నారు. రవాణా వ్యవస్థ అంతంత మాత్రంగానే ఉన్న ఈ ప్రాంతంలో జనం సాధారణంగా చిన్న చిన్న దూరాలకు కాలినడకన వెళ్తుంటారు. ఇదే చైన్ స్నాచర్లకు వరంగా మారుతోంది. 

ఎవరూ లేని ప్రాంతాల్లో కాపు కాచి దాడులు చేస్తున్నారు. ఇప్పటికే చాలా కేసులు నమోదు అయ్యాయి. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం పరిసరాల్లో కూడా దొంగల బీభత్సం సృష్టించారు. 

Also Read: ఒకరితో మొదలై వంద మంది మహిళలకు ఉపాధి- ఆదర్శంగా శ్రీకాకుళం జిల్లాలోని సీతానగరం

టాప్ హెడ్ లైన్స్

Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Road Accidents: పశ్చిమ గోదావరి జిల్లాలో కాల్వలోకి దూసుకెళ్లిన కారు- నలుగురు యువకులు గల్లంతు
Road Accidents: పశ్చిమ గోదావరి జిల్లాలో కాల్వలోకి దూసుకెళ్లిన కారు- నలుగురు యువకులు గల్లంతు
విజయవాడ.. కృష్ణా నదిలో ఈతకు దిగి ముగ్గురు యువకులు మృతి
విజయవాడ.. కృష్ణా నదిలో ఈతకు దిగి ముగ్గురు యువకులు మృతి
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
Soaked Raisins : రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
Embed widget