Top Headlines: ఏపీలో దారుణ ఘటన - పుకార్లకు మోహన్ బాబు చెక్, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM
Top News: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకూ ఉన్న టాప్ హెడ్ లైన్స్ చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

Today Top Headlines In AP And Telangana:
1. సీఎం చంద్రబాబుపై వైఎస్ షర్మిల సెటైర్లు
విజన్ 2047 పేరుతో సీఎం చంద్రబాబు (CM Chandrababu) మళ్లీ అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ దశ - దిశ మారాలంటే తక్షణం కావాల్సింది విజన్లు కాదు.. విభజన హామీలని అన్నారు. రాష్ట్రాన్ని నెంబర్ 1గా నిలపాలంటే నెరవేరాల్సింది కేంద్రం ఇచ్చిన హామీలని స్పష్టం చేశారు. దశాబ్ద కాలంగా విభజన హామీలను గాలికి వదిలేసి.. పూర్తిగా అటకెక్కించారని మండిపడ్డారు. 'రాష్ట్ర విభజన సమయంలో ఆనాడు UPA సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక హోదా హామీ ఇచ్చింది.' ఇంకా చదవండి.
2. బాపట్ల జిల్లాలో దారుణం
బాపట్ల జిల్లాలో (Bapatla District) దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి ఆస్తి కోసం వృద్ధ తల్లిదండ్రులను కిరాతకంగా హతమార్చాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాపట్ల మండలం అప్పికట్లలో శుక్రవారం అర్ధరాత్రి ఈ ఘోరం జరిగింది. గ్రామంలో స్కూల్ హెచ్ఎంగా పని చేసి పదవీ విరమణ పొందిన పి.విజయ భాస్కరరావు (74), వెంకటసాయి కుమారి దంపతులు సొంతంగా గృహం నిర్మించుకుని ఉంటున్నారు. వీరికి కిరణ్ అనే కుమారుడు ఉన్నాడు. అతను పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లో పని చేస్తున్నాడు. కిరణ్ 4 రోజుల క్రితమే స్వగ్రామానికి వచ్చి అప్పటి నుంచి ఇంట్లోనే ఉంటున్నాడు. ఇంకా చదవండి.
3. ఆ ఎన్నికలు బహిష్కరించిన వైసీపీ
ఎన్నికల్లో పోటీ చేయడానికి వైసీపీ ముందుకు రావడం లేదు. గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరించిన వైసీపీ తాజాగా సాగునీటి సంఘాల ఎన్నికలనూ బహిష్కరిస్తున్నట్లుగా ప్రకటించింది. సాగునీటి సంఘాల ఎన్నికల్లో ఆయా జిల్లాల్లో ప్రభుత్వ సూచనలతో అధికార యంత్రాంగం సాయంతో అక్రమాలకు పాల్పడ్డారని వైసీపీ ఆరోపిస్తోంది. కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న అత్యంత దారుణ వైఖరికి నిరసనగా, ఎన్నికలు బహిష్కరించాలని జగన్ నిర్ణయించారు. ఇంకా చదవండి.
4. ఆ పుకార్లకు మోహన్ బాబు చెక్
మోహన్ బాబు ఎక్కడ? వేర్ ఈజ్ మోహన్ బాబు? కలెక్షన్ కింగ్ కనిపించకుండా పోయారా? ఒక సెక్షన్ ఆఫ్ మీడియాలో ఇది హాట్ టాపిక్ అయింది. లెజెండరీ నటుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు అజ్ఞాతంలోకి వెళ్లారని ప్రచారం జరుగుతోంది దానిపై ఆయన స్పందించారు సోషల్ మీడియాలో ఒక ట్వీట్ చేశారు. తన మీద తప్పుడు ప్రచారం జరుగుతోంది అని సోషల్ మీడియా నెట్వర్కింగ్ సైట్ ఎక్స్ వేదికగా మోహన్ బాబు పేర్కొన్నారు. పుకార్లకు చెక్ పెట్టారు. తనకు ముందస్తు బెయిల్ రాలేదని, తన బెయిల్ రిజెక్ట్ అయిందని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని ఆయన తెలిపారు. ఇంకా చదవండి.
5. అండగా నిలిచిన అభిమానులందరికీ కృతజ్ఞతలు - అల్లు అర్జున్
తనకు అండగా నిలిచిన అభిమానులందరికీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) కృతజ్ఞతలు తెలిపారు. శనివారం ఉదయం జైలు నుంచి విడుదలైన ఆయన జూబ్లీహిల్స్‌లోని నివాసానికి చేరుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు. 'నాకు అండగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు. నేను చట్టాన్ని గౌరవిస్తాను, కట్టుబడి ఉంటాను. బాధిత కుటుంబానికి మరోసారి సానుభూతి తెలియజేస్తున్నా. నేను సినిమా చూసేందుకు వెళ్లినప్పుడు అనుకోకుండా ఈ ఘటన జరిగింది.' ఇంకా చదవండి.





















