అన్వేషించండి

YSRCP: ఆ ఎన్నికలనూ బహిష్కరించిన వైసీపీ - ఇక ఐదేళ్లు ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయలేరు - మరి క్యాడర్ ఉంటుందా ?

Andhra : సాగునీటి సంఘాల ఎన్నికలను వైసీపీ బహిష్కరించింది. అక్రమాలు జరుగుతున్నాయన్న కారణంగా బహిష్కరిస్తున్నట్లుగా ప్రకటించింది.


YCP has boycotted the elections of irrigation societies: ఎన్నికల్లో పోటీ చేయడానికి వైసీపీ ముందుకు రావడం లేదు. గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరించిన వైసీపీ తాజాగా  సాగునీటి సంఘాల ఎన్నికలనూ బహిష్కరిస్తున్నట్లుగా ప్రకటించింది. సాగునీటి సంఘాల ఎన్నికల్లో ఆయా జిల్లాల్లో ప్రభుత్వ సూచనలతో అధికార యంత్రాంగం సాయంతో అక్రమాలకు పాల్పడ్డారని వైసీపీ ఆరోపిస్తోంది.  కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న అత్యంత దారుణ వైఖరికి నిరసనగా, ఎన్నికలు బహిష్కరించాలని జగన్ నిర్ణయించారు. 

అక్రమాలు చేశారని వైసీపీ ఆరోపణలు

సాగునీటి సంఘాల ఎన్నికల్లో  కూటమి నేతలు రెవెన్యూ, పోలీస్‌ యంత్రాంగాన్ని ప్రయోగించి నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికలు నిర్వహించాలని ఆరోపించారు.  ఎన్నికల నిబంధనల ప్రకారం సాగునీటి సంఘాల అడిగిన చోట్ల సీక్రెట్‌ బ్యాలెట్‌ ప్రకారం ఎన్నికలు జరపాల్సిఉందన్నారు. కానీ  అధికారుల ఏకపక్షంగా వ్యవహరించారని  ఎన్నికల్లో పాల్గొనాలనుకున్న వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై దౌర్జన్యాలకు దిగారని న్నారు. పోలీసులను ప్రయోగించి తప్పుడు కేసులు పెడతామని బెదిరిస్తున్నారని మండిపడుతున్నారు. కూటమి పార్టీలకు చెందిన వారు, తమకు గెలిచే అవకాశం లేకపోయినా, దౌర్జన్యంతో అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎలాగైనా సరే గెలవాలనే ఉద్దేశంతో రౌడీయిజానికి కూడా దిగుతున్నారని ఎన్నికల్లో పాల్గొనడం సరి కాదని వైదొలుగుతున్నట్లుగా ప్రకటించారు.        

Also Read: Mohanbabu New Audio: టీవీ9 రిపోర్టరే తప్పు చేశాడు - అయినా కొట్టినందుకు చింతిస్తున్నా - మరో సంచలన ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు

ఇప్పటికే గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల బహిష్కరణ        

ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరించింది. అధికారంలో ఉన్నప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలకే కాదు.. టీచర్ ఎమ్మెల్సీల్లోనూ పోటీ చేసేవారు. అయితే అధికారం పోయే సరికి ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయలేని పరిస్థితికి వచ్చారు.  గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలో బ్యాలెట్ తో జరుగుతాయి. ఎన్నికల ఫలితాలు ఈవీఎంల వల్ల వచ్చాయని ఆరోపిస్తున్న వైసీపీ నిరూపించడానికి ఎక్కువ అవకాశం ఉండేది. కానీ అెదికారంలో ఉన్నప్పుడు జరిగిన మూడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలోనూ ఘోర పరాజయం పాలయ్యారు. ఆ అనుభవంతో ఇప్పుడు పోటీ చేయకపోవడమే మంచిదని అనుకున్నారు.

Also Read: Grandhi Srinivas: వైఎస్ఆర్‌సీపీకి బ్యాక్ టు బ్యాక్ షాక్ - ఈ సారి పవన్ కల్యాణ్‌పై గెలిచిన లీడర్ గుడ్ బై

అధికార పార్టీ అక్రమాలు చేస్తుందన్న కారణంగానే ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లుగా వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. మరి ఓ ఏడాది తర్వాత స్థానిక ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు జరగాల్సి ఉంది. అప్పుడు కూడా ఇదే కారణంతో బహిష్కరిస్తారా అన్న డౌట్స్ వస్తాయి. ఎందుకంటే ఆ ఎన్నికల్లో గెలవడానికి అధికార పార్టీ అప్పుడు కూడా వైసీపీ చెబుతున్న అధికార దుర్వినియోగం చేసి తీరుతుంది. గతంలో పంచాయతీలు, మున్సిపల్ ఎన్నికలు వైసీపీ ప్రభుత్వం నిర్వహించిన తీరునకు నిరసనగా టీడీపీ ఎన్నికలను బహిష్కరించింది. ఇప్పుడు వైసీపీ కూడా అలా చేస్తే స్థానిక సంస్థల్లో అసలు ప్రజా ప్రతినిధులే లేకుండా పోతారు. ఎన్నికలు ఎలా జరిగినా పోటీ చేయడమే ప్రజాస్వామ్యంలో పార్టీ బలంగా ఉండటానికి ఉపయోగపడుతుందని అంటున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Modi Cabinet Expansion Postponed: మోదీ క్యాబినెట్ విస్తరణకు బ్రేక్!? మంత్రి పదవుల కంటే రాజ్యాంగ సవరణ బిల్లులకే ప్రధాని తొలి ప్రాధాన్యత!
మోదీ క్యాబినెట్ విస్తరణకు బ్రేక్!? మంత్రి పదవుల కంటే రాజ్యాంగ సవరణ బిల్లులకే ప్రధాని తొలి ప్రాధాన్యత!
Telangana BJP Internal Strategy: గ్రేటర్ త్రిశూల పోరుకు బీజేపీ జంగ్ సైరన్! మూడు కార్పొరేషన్ల ఎన్నికల్లో గెలవకపోతే భవిష్యత్తు శూన్యమేనా?
గ్రేటర్ త్రిశూల పోరుకు బీజేపీ జంగ్ సైరన్! మూడు కార్పొరేషన్ల ఎన్నికల్లో గెలవకపోతే భవిష్యత్తు శూన్యమేనా?
Telangana Rakshana Sena ECI Rejection: కవితకు కలసిరాని TRS సెంటిమెంట్! లీగల్ గందరగోళం కంటే జాగృతి వైపు వెళ్లడమే శ్రేయస్కరమా?
కవితకు కలసిరాని TRS సెంటిమెంట్! లీగల్ గందరగోళం కంటే జాగృతి వైపు వెళ్లడమే శ్రేయస్కరమా?
Dalit Christian Vote Bank Politics: వైసీపీ ఓటు బ్యాంక్‌పైనే గురి పెట్టిన జడ శ్రవణ్ - ఉపముఖ్యమంత్రి పోస్టుకు కర్చీఫ్ - పెద్ద ప్లానే?
వైసీపీ ఓటు బ్యాంక్‌పైనే గురి పెట్టిన జడ శ్రవణ్ - ఉపముఖ్యమంత్రి పోస్టుకు కర్చీఫ్ - పెద్ద ప్లానే?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Modi Cabinet Expansion Postponed: మోదీ క్యాబినెట్ విస్తరణకు బ్రేక్!? మంత్రి పదవుల కంటే రాజ్యాంగ సవరణ బిల్లులకే ప్రధాని తొలి ప్రాధాన్యత!
మోదీ క్యాబినెట్ విస్తరణకు బ్రేక్!? మంత్రి పదవుల కంటే రాజ్యాంగ సవరణ బిల్లులకే ప్రధాని తొలి ప్రాధాన్యత!
Andhra Pradesh Zones: 2 మల్టీ జోన్లు... 6 జోన్లు- 26 జిల్లాల ప్రకారం ఏపీలో ఉద్యోగుల విభజనకు మార్గదర్శకాలు
2 మల్టీ జోన్లు... 6 జోన్లు- 26 జిల్లాల ప్రకారం ఏపీలో ఉద్యోగుల విభజనకు మార్గదర్శకాలు
Cristiano Ronaldo Retirement: స్పెయిన్ చేతిలో పోర్చుగల్ ఘోర పరాజయం.. కన్నీళ్లతో క్రిస్టియానో రొనాల్డో వరల్డ్ కప్ కెరీర్ క్లోజ్, సీమోన్ మైండ్ బ్లోయింగ్ వరల్డ్ రికార్డ్!
స్పెయిన్ చేతిలో పోర్చుగల్ ఘోర పరాజయం.. కన్నీళ్లతో క్రిస్టియానో రొనాల్డో వరల్డ్ కప్ కెరీర్ క్లోజ్, సీమోన్ మైండ్ బ్లోయింగ్ వరల్డ్ రికార్డ్!
Pradhan Mantri Fasal Bima Yojana: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. పంట బీమా పథకాల అమలుకు ఉత్తర్వులు
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. పంట బీమా పథకాల అమలుకు ఉత్తర్వులు
Tata Sierra EV on EMI: టాటా సియారా EV కొనడానికి ఎంత జీతం సరిపోతుంది? నెలవారీ EMI ఎంత అవుతుంది? 
టాటా సియారా EV కొనడానికి ఎంత జీతం సరిపోతుంది? నెలవారీ EMI ఎంత అవుతుంది? 
Dalit Christian Vote Bank Politics: వైసీపీ ఓటు బ్యాంక్‌పైనే గురి పెట్టిన జడ శ్రవణ్ - ఉపముఖ్యమంత్రి పోస్టుకు కర్చీఫ్ - పెద్ద ప్లానే?
వైసీపీ ఓటు బ్యాంక్‌పైనే గురి పెట్టిన జడ శ్రవణ్ - ఉపముఖ్యమంత్రి పోస్టుకు కర్చీఫ్ - పెద్ద ప్లానే?
Quitting Job in Midlife : 35 ఏళ్లు దాటాక జాబ్ మానేయాలనుకుంటున్నారా? అయితే ఈ విషయాలు ఆలోచించకపోతే భారీ నష్టం తప్పదు
35 ఏళ్లు దాటాక జాబ్ మానేయాలనుకుంటున్నారా? అయితే ఈ విషయాలు ఆలోచించకపోతే భారీ నష్టం తప్పదు
ఎక్కువ మంది పిల్లలున్న దంపతులకు నగదు ప్రోత్సాహకాలు.. జనాభా వృద్ధిపై ఏపీ సర్కార్ వ్యూహాత్మక అడుగులు
ఎక్కువ మంది పిల్లలున్న దంపతులకు నగదు ప్రోత్సాహకాలు.. జనాభా వృద్ధిపై ఏపీ సర్కార్ వ్యూహాత్మక అడుగులు
Embed widget