అన్వేషించండి

Grandhi Srinivas: వైఎస్ఆర్‌సీపీకి బ్యాక్ టు బ్యాక్ షాక్ - ఈ సారి పవన్ కల్యాణ్‌పై గెలిచిన లీడర్ గుడ్ బై

YSRCP: వైఎస్ఆర్‌సీపీకి మరో శ్రీనివాస్ రాజీనామా చేశారు. ఉదయం అవంతి శ్రీనివాస్ రాజీనామా చేయగా మధ్యాహ్నం ఆ బాధ్యతను గ్రంథి శ్రీనివాస్ తీసుకున్నారు.

Grandhi Srinivas resigns from YCP: ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్‌సీపికి గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఉదయం మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా చేశారు. మధ్యాహ్నం భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఆ పని చేశారు. వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించి లేఖ రిలీజ్ చేశారు ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుండి గ్రంథి శ్రీనివాస్ వైసీపీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. పార్టీకి దూరంగా ఉన్నారు. ఇతర పార్టీల్లో చేరేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఏ పార్టీతో చర్చలు  పూర్తయ్యాయో కానీ ఆయన రాజీనామా చేశారు. 

వైసీపీ ఓడిపోయినప్పటి నుంచి సైలెంట్ గా గ్రంధి శ్రీనివాస్          

ఇటీవల గ్రంధి శ్రీనివాస్ ఇంట్లో ఐటీ దాడులు జరిగాయి. దాదాపుగా వారం రోజుల పాటు ఆయన వ్యాపార వ్యవహారాల్లో ఉన్న అవకతవకలన్నింటినీ వెలికి తీశారని ప్రచారం జరుగుతోంది. అంతకు మందు నుంచే ఆయన వైసీపీకి దూరంగా ఉన్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పెద్ద ఎత్తున అప్పటి విపక్ష నేతలపై కక్ష సాధింపులకు పాల్పడటంతో వైసీపీ ఉంటే తనకూ ఇబ్బందులేనన్న ఉద్దేశంతో ఆయన కొంత కాలంగా సైలెంట్ గా ఉన్నారు. దీనికి కూడా ప్రత్యేకమైన కారణం ఉంది. అదేమిటంటే.. ఆయన 2019 ఎన్నికల్లో పవన్ కల్యాణ్ పై గెలిచారు. ఆ తర్వాత పవన్ పై అనేక అనుచిత వ్యాఖ్యలు కూడా చేశారు. పలు మార్లు భీమవరంలో జనసేన, వైసీపీ మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. 

Also Read:  రాజ్యసభకు చిరంజీవి - ఏ పార్టీలోనూ చేరకుండానే - బీజేపీ ప్లాన్‌కు పవన్ గ్రీన్ సిగ్నల్ ?

ఎన్నికల ప్రచారంలో గ్రంధిపై తీవ్ర విమర్శలు చేసిన పవన్            

పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచార సమయంలో భీమవరంలో గ్రంధి శ్రీనివాస్ పై తీవ్ర విమర్శలు చేశారు. రౌడీయిజం చేస్తున్నారు. నియోజకవర్గంలోని ప్రతి వ్యాపారి నుంచి మామూళ్లు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. రౌడీయిజాన్ని అణిచి వేస్తామని హెచ్చరించారు. దీంతో కూటమి గెలిచిన తర్వాత తనకు చిక్కులు తప్పవని ఆయన అనుకుంటున్నారు. అయితే ఆయనను జనసేన పార్టీలో చేర్చుకునే అవకాశం లేదు. టీడీపీ లేదా బీజేపీలో చేరేందుకు ఆయన ప్రయత్నాలు చేశారని అంటున్నారు. కానీ ఆయనకు గ్రీన్ సిగ్లన్ రాలేదని చెబుతున్నారు. 

Also Read:  మమతా బెనర్జీ నేతృత్వంలోకి ఇండియా కూటమి - చేరేందుకు వైఎస్ఆర్‌సీపీ సిద్దమని సంకేతాలు ?

వరుసగా వైసీపీకి గుడ్ బై చెబుతున్న నేతలు           

వైసీపీకి రాజీనామా చేసే నేతల సంఖ్య వరుసగా పెరుగుతోంది. ఇప్పటికే మెజార్టీ సీనియర్ నేతలు యాక్టివ్ గాలేరు.  వారిలో వరుసగా రాజీనామా బాట పడుతున్నారు. మరో వైపు కూటమి ప్రభుత్వంపై పోరుబాట పట్టాలని జగన్ అనుకుంటున్న సమయంలో ఇలా వరుసగా నేతలు ఒకరి తర్వాత ఒకరు గుడ్ బై చెబుతూంటడం.. ఆ పార్టీ పెద్దల్ని కూడా కలవర పరుస్తోంది.                      

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jamili Election Bill: జమిలి ఎన్నికల బిల్లుకు గ్రీన్ సిగ్నల్ - కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
జమిలి ఎన్నికల బిల్లుకు గ్రీన్ సిగ్నల్ - కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
CM Chandrababu: తల్లిదండ్రులు చనిపోయిన చిన్నారులకూ పింఛన్లు - సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు, ఉపాధి బిల్లుల జాప్యంపై తీవ్ర ఆగ్రహం
తల్లిదండ్రులు చనిపోయిన చిన్నారులకూ పింఛన్లు - సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు, ఉపాధి బిల్లుల జాప్యంపై తీవ్ర ఆగ్రహం
Chattisgarh Encounter: దండకారణ్యంలో కాల్పుల మోత - భద్రతా సిబ్బంది, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు, 12 మంది మావోల దుర్మరణం
దండకారణ్యంలో కాల్పుల మోత - భద్రతా సిబ్బంది, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు, 12 మంది మావోల దుర్మరణం
Crime News:  టీడీపీ కండువాలు వేసుకుని టోల్ గేట్లు పెట్టి డబ్బులు వసూలు చేస్తున్న వైసీపీ లీడర్ - అరెస్ట్ - ఇలా కూడా సంపాదిస్తారా?
టీడీపీ కండువాలు వేసుకుని టోల్ గేట్లు పెట్టి డబ్బులు వసూలు చేస్తున్న వైసీపీ లీడర్ - అరెస్ట్ - ఇలా కూడా సంపాదిస్తారా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

మోదీ పాటలు వింటారా? ప్రధాని నుంచి ఊహించని రిప్లైసీపీ ముందు విష్ణు, మనోజ్ - ఇదే లాస్ట్ వార్నింగ్!Sana Satish Babu TDP Rajyasabha | టీడీపీ రాజ్యసభకు పంపిస్తున్న ఈ వివాదాస్పద వ్యక్తి ఎవరంటే..? | ABP Desamగూగుల్‌ సెర్చ్‌లో టాప్‌ ప్లేస్‌లో పవన్ కల్యాణ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jamili Election Bill: జమిలి ఎన్నికల బిల్లుకు గ్రీన్ సిగ్నల్ - కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
జమిలి ఎన్నికల బిల్లుకు గ్రీన్ సిగ్నల్ - కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
CM Chandrababu: తల్లిదండ్రులు చనిపోయిన చిన్నారులకూ పింఛన్లు - సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు, ఉపాధి బిల్లుల జాప్యంపై తీవ్ర ఆగ్రహం
తల్లిదండ్రులు చనిపోయిన చిన్నారులకూ పింఛన్లు - సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు, ఉపాధి బిల్లుల జాప్యంపై తీవ్ర ఆగ్రహం
Chattisgarh Encounter: దండకారణ్యంలో కాల్పుల మోత - భద్రతా సిబ్బంది, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు, 12 మంది మావోల దుర్మరణం
దండకారణ్యంలో కాల్పుల మోత - భద్రతా సిబ్బంది, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు, 12 మంది మావోల దుర్మరణం
Crime News:  టీడీపీ కండువాలు వేసుకుని టోల్ గేట్లు పెట్టి డబ్బులు వసూలు చేస్తున్న వైసీపీ లీడర్ - అరెస్ట్ - ఇలా కూడా సంపాదిస్తారా?
టీడీపీ కండువాలు వేసుకుని టోల్ గేట్లు పెట్టి డబ్బులు వసూలు చేస్తున్న వైసీపీ లీడర్ - అరెస్ట్ - ఇలా కూడా సంపాదిస్తారా?
Manchu Family Issue : మంచు ఫ్యామిలీలో మొత్తం సెటిలైపోయినట్లే - షూటింగ్‌కు మనోజ్ - ప్రెస్‌మీట్ క్యాన్సిల్ దగ్గర నుంచి ఏం జరిగింది ?
మంచు ఫ్యామిలీలో మొత్తం సెటిలైపోయినట్లే - షూటింగ్‌కు మనోజ్ - ప్రెస్‌మీట్ క్యాన్సిల్ దగ్గర నుంచి ఏం జరిగింది ?
Chiranjeevi Rajyasabha:  రాజ్యసభకు చిరంజీవి - ఏ పార్టీలోనూ చేరకుండానే - బీజేపీ ప్లాన్‌కు పవన్ గ్రీన్ సిగ్నల్ ?
రాజ్యసభకు చిరంజీవి - ఏ పార్టీలోనూ చేరకుండానే - బీజేపీ ప్లాన్‌కు పవన్ గ్రీన్ సిగ్నల్ ?
Manchu Mohan Babu Attack News: మంచు మోహన్ బాబు కేసులో బిగ్ ట్విస్ట్- జర్నలిస్టుపై దాడి కేసులో సెక్షన్‌లు మార్పు 
మంచు మోహన్ బాబు కేసులో బిగ్ ట్విస్ట్- జర్నలిస్టుపై దాడి కేసులో సెక్షన్‌లు మార్పు 
Avanthi Srinivas Resign To YSRCP: వైసీపీకి ఉత్తరాంధ్రలో బిగ్ షాక్‌- మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా
వైసీపీకి ఉత్తరాంధ్రలో బిగ్ షాక్‌- మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా
Embed widget