Today Top Headlines: ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - పండుగ పూట హైదరాబాద్‌లో డ్రగ్స్ గ్యాంగ్ అరెస్ట్, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM
Top News: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకూ ఉన్న టాప్ హెడ్ లైన్స్ చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

Today Top Headlines In AP And Telangana:
1. ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
సంక్రాంతి పండుగ సందర్భంగా ఏపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు శుభవార్త అందించింది. పలు వర్గాలకు చెందిన వారికి బిల్లులు చెల్లించే ప్రక్రియ మొదలైంది. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ఆదేశాలతో అధికారులు వివిధ వర్గాలకు బిల్లులు చెల్లింపులు మొదలుపెట్టారు. ముఖ్యంగా ఉద్యోగులు, పోలీసులు, విద్యార్థులు, చిన్న తరహా కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులు ముందుగా విడుదల అవుతున్నాయి. సంబంధిత బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేయాలని.. సంక్రాంతి పండుగలోగానే బిల్లుల చెల్లింపుల ప్రక్రియ పూర్తి చేయాలని మంత్రులు, అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఇంకా చదవండి.
2. తెలుగు రాష్ట్రాల సీఎంల భోగీ శుభాకాంక్షలు
తెలుగు వారి లోగిళ్లలో పెద్ద పండుగలలో సంక్రాంతి ఒకటి. మూడు రోజుల పండుగలో తొలి రోజు భోగిని పురస్కరించుకుని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి బండి సంజయ్ సహా పలువురు నేతలు తెలుగు ప్రజలకు భోగి శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ ప్రజలందరికి సీఎం చంద్రబాబు భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పవిత్రమైన ఈ భోగి పండుగ మీకు, మీ కుటుంబానికి కొత్త వెలుగులు తేవాలని, పాత బాధలు పోయి సానుకూల దృక్పథంతో జీవితంలో ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భోగి మంటలతో మీ సమస్యలన్నీ తీరిపోయి మీకు భోగ భాగ్యాలు కలగాలని ఆకాంక్షిస్తున్నాను. ఇంకా చదవండి.
3. పండుగ పూట హైదరాబాద్‌లో డ్రగ్స్ గ్యాంగ్ అరెస్ట్
సంక్రాంతి పండుగ పూట హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం రేపాయి. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు డ్రగ్స్ పట్టుకున్నారు. బెంగళూరు నుంచి కొందరు నగరానికి డ్రగ్స్ తీసుకొచ్చారు. ఎల్బీనగర్ లోని మారుతీ లార్జ్ లోని 306 రూమ్ లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఎంఎండిఎస్ డ్రగ్స్ విక్రయిస్తున్న నలుగురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంక్రాంతి టార్గెట్ గా చేసుకుని నగరానికి డ్రగ్స్ తీసుకొచ్చి విక్రయిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు దాడి చేసినట్లు తెలుస్తోంది. ఇంకా చదవండి.
4. మాజీ ఎంపీ మందా జగన్నాథానికి నివాళులు
సీనియర్ రాజకీయ నాయకుడు, నాగర్‌కర్నూలు నుంచి 4సార్లు ఎంపీగా ఎన్నికైన మందా జగన్నాథం తీవ్ర అనారోగ్యంతో కన్నుమూశారు. హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ఆయన మృతిచెందారు. మందా జగన్నాథం మృతి పట్ల తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రులు సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి(Revanth ReddY) సానుభూతి తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన చేసిన సేవలు మరువలేనివని గుర్తుచేసుకున్నారు. మందా జగన్నాథం మృతిపట్ల ఏపీ సీఎం చంద్రబాబు(Chandra Babu) సంతాపం తెలిపారు. ఇంకా చదవండి.
5. ఆదిలాబాద్‌లో కోడిపందేల స్థావరాలపై దాడులు
తెలంగాణలో సంక్రాంతి సందడి మొదలైంది. సంక్రాంతి పండుగ వేళ మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో కోడిపందాల స్థావరాలపై పోలీసులు దాడి చేశారు. మంచిర్యాల జిల్లాలోని కోటపల్లి మండలం నాగంపేట బొప్పరం గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో కోడిపందాలు నిర్వహిస్తున్నారన్న పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు కోడి పందాల స్థావరంపై ఆదివారం కోటపల్లి ఎస్సై రాజేందర్ ఆధ్వర్యంలో పోలీసులు దాడులు నిర్వహించారు. ఇంకా చదవండి.





















