AP Govt Good News: ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఏ క్షణంలోనైనా వారి ఖాతాల్లో నగదు జమ
Andhra Pradesh News | ఏపీ ప్రభుత్వం సంక్రాంతి పండుగ సందర్భంగా శుభవార్త అందించింది. పండుగలోగానే బిల్లుల చెల్లింపుల ప్రక్రియ పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.

Makar Sankranti 2025 | అమరావతి: సంక్రాంతి పండుగ సందర్భంగా ఏపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు శుభవార్త అందించింది. పలు వర్గాలకు చెందిన వారికి బిల్లులు చెల్లించే ప్రక్రియ మొదలైంది. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ఆదేశాలతో అధికారులు వివిధ వర్గాలకు బిల్లులు చెల్లింపులు మొదలుపెట్టారు. ముఖ్యంగా ఉద్యోగులు, పోలీసులు, విద్యార్థులు, చిన్న తరహా కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులు ముందుగా విడుదల అవుతున్నాయి. సంబంధిత బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేయాలని.. సంక్రాంతి పండుగలోగానే బిల్లుల చెల్లింపుల ప్రక్రియ పూర్తి చేయాలని మంత్రులు, అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు.
ఎప్పటికప్పుడు అధికారులతో మంత్రి పయ్యావుల సమీక్ష
నిన్న ఆదివారం అయినప్పటికీ బిల్లుల చెల్లింపులపై ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షించారు. నిన్న, భోగి సందర్భంగా ఈరోజు సెలవు అయినా బిల్లుల చెల్లింపుల ప్రక్రియపై ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు, ఉద్యోగులు పనిచేసి సేవలు అందించారు. దాని ఫలితంగా సోమవారం మధ్యాహ్నాం లేదా సాయంత్రంలోగా దాదాపు రూ. 6700 కోట్ల బిల్లుల చెల్లింపులను ఆర్థిక శాఖ పూర్తి చేయనుంది. సంక్రాంతి సమయానికి సాధ్యమైనన్ని బిల్లులు పూర్తి చేసి, వారిలో సంతోషాన్ని నింపాలన్న ఆదేశాలతో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఆ పనిలో నిమగ్నమయ్యారు. బిల్లుల చెల్లింపుల ప్రక్రియపై అధికారుల నుంచి ఎప్పటికప్పుడూ మంత్రి పయ్యావుల కేశవ్ వివరాలు తెలుసుకుంటున్నారు. జాప్యం జరగకుండా చూడాలని అధికారులకు పదే పదే సూచిస్తున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

