అన్వేషించండి

IBOMMA Ravi: ఐబొమ్మ రవిని పట్టించింది భార్య కాదు - కీలక విషయాలు వెల్లడించిన ACP శ్రీనివాస్

IBomma: ఐ బొమ్మ రవి గురించి పోలీసులు కీలక విషయాలు మీడియాకు వెల్లడించారు. ఈజీ మనీకి అలవాటు పడి 20 కోట్ల వరకూ సంపాదించాడన్నారు.

Police reveal key details about IBomma Ravi: తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశమైన ఐ-బొమ్మ పైరసీ కేసులో నిందితుడు ఇమంది రవి నుంచి కీలక వివరాలను పోలీసులు  బయట పెట్టారు.  సైబర్ క్రైమ్ అడిషనల్ డిప్యూటీ కమిషనర్   శ్రీనివాస్ మంగళవారం మీడియా సమావేశంలో ఈ విషయాలను వెల్లడించారు. రవి భార్య ఇచ్చిన సమాచారంతోనే అరెస్ట్ చేశామని వార్తలు వస్తున్నాయని, ఆమెను కూడా ప్రశ్నించినట్లుగా ప్రచారం చేస్తున్నారని అవన్నీ తప్పేనని పోలీసులు స్పష్టం చేశారు. తామే ఐబొమ్మ రవి వ్యవహారాలను ట్రాక్ చేసి.. పట్టుకున్నామన్నారు. 

ఈజీ మనీకి అలవాటు పడి ఇరవై కోట్లకుపైగా సంపాదన     

ఐ-బొమ్మ వెబ్‌సైట్‌ను రవి మరో కంపెనీ ద్వారా హోస్ట్ చేసినట్లు, డొమైన్‌ను ‘ఎన్‌జిల్’ కంపెనీలో రిజిస్టర్ చేసినట్లు ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు. కంటెంట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ద్వారా సినిమాలు పోస్ట్ చేసిన రవి, ఈజీ మనీకి అలవాటు పడి రూ.20 కోట్ల వరకు సంపాదించాడని వెల్లడి చేశారు. అలాగే, లక్షల డాలర్లు వెచ్చించి కరేబియన్ దీవుల పౌరసత్వం కొన్నాడని, ఓవర్‌కాన్ఫిడెన్స్‌తో ఉన్నాడని  ఏడీసీపీ తెలిపారు.  పైరసీ దర్యాప్తు సంక్లిష్టమైనదని, వెబ్-3 టెక్నాలజీతో భవిష్యత్తులో పట్టుకోవడం మరింత కష్టమవుతుందన్నారు.  ఇప్పటికీ మూవీరూల్జ్, తమిళ్‌ఎంవీ వంటి పలు పైరసీ సైట్లు నడుస్తున్నాయని, వాటి నిర్వాహకులను పట్టుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.  

విదేశీ పౌరుడైనా ఇక్కడ నేరం చేస్తే చర్యలు తీసుకునే అవకాశం        

ఇమంది రవి ఐ-బొమ్మ, బప్పం వంటి వెబ్‌సైట్ల ద్వారా తెలుగు సినిమాలు పోస్ట్ చేసేవాడు. ఆ వెబ్‌సాఫ్ట్‌వేర్‌లో రీడైరెక్ట్ స్క్రిప్ట్ రాసి, యూజర్లను గేమింగ్, బెట్టింగ్ సైట్లకు రీడైరెక్ట్ చేసేవాడు. ఇది పైరసీతో పాటు మరో నేరానికి దారితీసింది.  రవి ఒంటరిగా ఉండి, వారానికి దేశం తిరిగేవాడని, ఈజీ మనీ అలవాటు పడ్డాడని చెప్పారు. "లక్షల ఆ అమెరికన్ డాలర్లు వెచ్చించి కరేబియన్ దీవుల పౌరసత్వం కొన్నాడు. ఓవర్‌కాన్ఫిడెన్స్‌తో ఉన్నాడు. మా చట్టాల ప్రకారం, విదేశీయులు ఇక్కడ నేరం చేస్తే అది నేరమే. అప్పగింతపై పలు దేశాలతో మా ఒప్పందాలు ఉన్నాయన్నారు.           

రవి స్నేహితుడు నిఖిల్ ను ట్రాక్ చేయడంతోనే దొరికిన రవి                          
 
రవి వెబ్‌సైట్ల పోస్టర్లు డిజైన్ చేసిన నిఖిల్ అనే వ్యక్తి గురించి కూడా ప్రస్తావించారు.  నిఖిల్ పోస్టర్లు డిజైన్ చేసేవాడని అతనితో లావాదేవీలను ట్రాక్ చేసనప్పుడు అసలు విషయం తెలిసిదన్నారు.  మూవీ పోస్టర్లను రవి స్నేహితుడు నిఖిల్‌ తయారు చేస్తున్నాడు. గేమింగ్‌, బెట్టింగ్‌ యాప్‌ ప్రకటనల ద్వారా డబ్బులు వచ్చేవి. ఆ డబ్బును యాడ్‌ బుల్ అనే కంపెనీకి మళ్లించాడు రవి. యాడ్‌ బుల్‌ కంపెనీ రవికి చెందినదే. ఈ కంపెనీకి డాలర్ల రూపంలో డబ్బు వస్తుంది. ఐ-బొమ్మ వంటి సైట్లు పైరసీతో పాటు బెట్టింగ్, గేమింగ్ నేరాలకు దారితీస్తున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.    

టాప్ హెడ్ లైన్స్

High Tension in Shamshabad: పోలీసులపై కారం చల్లి, కుర్చీలు విసిరి రైతులు ఆగ్రహం.. బహదూర్‌గూడలో మరోసారి ఉద్రిక్తత
పోలీసులపై కారం చల్లి, కుర్చీలు విసిరి రైతులు ఆగ్రహం.. బహదూర్‌గూడలో మరోసారి ఉద్రిక్తత
HYDRAA Hyderabad Mega Drive: హైడ్రా సంచలనం - ఒక్కరోజులోనే రూ. 30,000 కోట్ల విలువైన 840 ఎకరాల భూమి స్వాధీనం!
హైడ్రా సంచలనం - ఒక్కరోజులోనే రూ. 30,000 కోట్ల విలువైన 840 ఎకరాల భూమి స్వాధీనం!
Breaking News:
"మొన్నటి ఎన్నికల్లో చెత్తను క్లీన్ చేశారు" కొడాలి నానిపై చంద్రబాబు సెటైర్లు 
Bandi Sanjay vs Etala Rajender: తెలంగాణ బీజేపీలో కీలక పరిణామం! బండి, ఈటల మధ్య సయోధ్య చర్చలు! లక్ష్మణ్‌ ఇంట్లో భేటీ!
తెలంగాణ బీజేపీలో కీలక పరిణామం! బండి, ఈటల మధ్య సయోధ్య చర్చలు! లక్ష్మణ్‌ ఇంట్లో భేటీ!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu Naidu Gudivada Tour: రౌడీయిజం చేస్తే తోకలు కత్తిరిస్తాం.. ఆ నోళ్లలో ఫినాయిల్ వేశారు- గుడివాడ గడ్డపై నుండి చంద్రబాబు సీరియస్ వార్నింగ్ !
రౌడీయిజం చేస్తే తోకలు కత్తిరిస్తాం.. ఆ నోళ్లలో ఫినాయిల్ వేశారు- గుడివాడ గడ్డపై నుండి చంద్రబాబు సీరియస్ వార్నింగ్ !
Sonam Wangchuk:సోనమ్‌ వాంగ్‌చుక్‌ దీక్ష విరమణ- జంతర్‌మంతర్‌ వద్ద హైటెనషన్
సోనమ్‌ వాంగ్‌చుక్‌ దీక్ష విరమణ- జంతర్‌మంతర్‌ వద్ద హైటెనషన్
Raw NTR Press Meet: ఎన్టీఆర్ ఆపేయమంటే ఆపేస్తా... అప్పటి వరకు 'ఊరు వాడ' కంటిన్యూ చేస్తా - 'రా ఎన్టీఆర్' ఫౌండర్ సాయిరూప్
ఎన్టీఆర్ ఆపేయమంటే ఆపేస్తా... అప్పటి వరకు 'ఊరు వాడ' కంటిన్యూ చేస్తా - 'రా ఎన్టీఆర్' ఫౌండర్ సాయిరూప్
The Odyssey Box Office Collection Day 1: ది ఒడిస్సీ ఓపెనింగ్ డే కలెక్షన్స్... తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము దుమారమే... ఇండియాలో ఫస్ట్ డే ఎన్ని కోట్లు వచ్చాయంటే?
ది ఒడిస్సీ ఓపెనింగ్ డే కలెక్షన్స్... తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము దుమారమే... ఇండియాలో ఫస్ట్ డే ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Guntur Crime News: గుంటూరులో మహిళపై అమానుష దాడి- కఠిన చర్యలకు ప్రభుత్వం ఆదేశం 
గుంటూరులో మహిళపై అమానుష దాడి- కఠిన చర్యలకు ప్రభుత్వం ఆదేశం 
683 కి.మీ రేంజ్‌ Mahindra BE6 EVపై రూ. 2.50 లక్షల డిస్కౌంట్.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే
683 కి.మీ రేంజ్‌ Mahindra BE6 EVపై రూ. 2.50 లక్షల డిస్కౌంట్.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే
Anna Lezhneva Visits Thirumala: శ్రీవారి సన్నిధిలో అన్నా లెజినోవా... తిరుమలలో పవన్ భార్య ఫోటోలు
శ్రీవారి సన్నిధిలో అన్నా లెజినోవా... తిరుమలలో పవన్ భార్య ఫోటోలు
Prashant Kadiyam: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ చందు.. క్రికెట్ అంటే పిచ్చి.. సాఫ్ట్ వేర్ నుంచి బుల్లితెర వైపు
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ చందు.. క్రికెట్ అంటే పిచ్చి.. సాఫ్ట్ వేర్ నుంచి బుల్లితెర వైపు
Embed widget