Cockfighting: ఆదిలాబాద్‌లో కోడిపందెల స్థావరాలపై పోలీసుల ఆకస్మిక దాడులు- పలువురి అరెస్ట్, నగదు సీజ్
Cock Fighting in Telangana | సంక్రాంతి పండుగ రావడంతో కోడి పందేలు జోరుగా సాగుతున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాలో కోడి పందేల స్థావరాలపై దాడులు చేశారు.

Cockfighting In Adilabad District: ఆదిలాబాద్: తెలంగాణలో సంక్రాంతి సందడి మొదలైంది. సంక్రాంతి పండుగ వేళ మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో కోడిపందాల స్థావరాలపై పోలీసులు దాడి చేశారు. మంచిర్యాల జిల్లాలోని కోటపల్లి మండలం నాగంపేట బొప్పరం గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో కోడిపందాలు నిర్వహిస్తున్నారన్న పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు కోడి పందాల స్థావరంపై ఆదివారం కోటపల్లి ఎస్సై రాజేందర్ ఆధ్వర్యంలో పోలీసులు దాడులు నిర్వహించారు.
బైకులు, నగదు సీజ్ చేసిన పోలీసులు
రామగుండం సీపీ శ్రీనివాస్ ఆదేశాల మేరకు ఈ దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఏడుగురు వ్యక్తులపై కేసు నమోదు చేశారు. వారి వద్దనుండి 10 కోళ్ళు, 7మొబైల్స్, రూ.59,780 నగదును స్వాధీనం చేసుకున్నారు. అలాగే 4 బైక్‌లు సీజ్ చేయడంజరిగిందనీ, దాడి సమయంలో పోలీసుల రాకను గమనించిన కోడి పందెం రాయుళ్లు తమ వాహనాలను అక్కడే వదిలేసి పారిపోయే ప్రయత్నం చేయగా పోలీసులు వారిని పట్టుకున్నార. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కోటపల్లి ఎస్సై రాజేందర్ తెలిపారు. కోడిపందాల స్థావరంలో పట్టుబడిన వారిలో జనగామ మల్లయ్య, పొట్టల రాజేందర్, సునాట్కారి రాజేష్, దుర్గం రమేష్, చిప్పకూర్తి బాపు, వెంకట్, గాండ్ల రవి ఉన్నారని ఈ ఏడుగురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఆసిఫాబాద్ జిల్లాలోనూ పోలీసుల ఆకస్మిక దాడులు
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోనూ కోడిపందాల స్థావరంపై పోలీసులు దాడి నిర్వహించారు. జిల్లా ఎస్పీ. శ్రీ.డీవీ.శ్రీనివాస రావు ఆదేశాల మేరకు కాగజ్ నగర్ మండలంలోని ఈస్గాం పోలిస్ స్టేషన్ లిమిట్స్ లో రాసపల్లి గ్రామ శివారులో ఉన్న పెద్దవాగు పరీవాహక ప్రాంతాలను అడ్డాలుగా చేసుకొని కోడి పంద్యాలు నిర్వహిస్తున్నారన్న సమాచారం రావడంతో అలర్ట్ అయ్యారు. టాస్క్ ఫోర్స్ సీఐ రాణా ప్రతాప్, ఎస్సై వెంకటేశ్ తో రెండు బృందాలుగా ఏర్పడి పెద్దవాగు పరీవాహక ప్రాంతంలో కోడి పందాలు ఆడుతున్న వారి పై దాడిచేసి పట్టుకున్నారు. కోడిపందాలు నిర్వహిస్తున్న పదిమందికి అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేసినట్లు టాస్క్ ఫోర్స్ రాణా ప్రతాప్ తెలిపారు. ఇందులో తొగరి సంభాయ్య, గజ్జి అంజయ్య, నాగోషి రామయ్య, నాగోషి సురేందర్, పెరక లింగమూర్తి, లగోటి దిలీప్, సదుల్ల ముత్తయ్య, నాస్పూరి రాజు, ధరణి జనార్ధన్, మదాసు ఇంద్రసేనుని పట్టుకోని విచారించగా అక్కడ నుండి కొంత మంది పారిపోయారు.
నిందితుల వద్ద నుండి నాలుగు పందెం పుంజులు స్వాధీనం చేసుకోగా, అందులో ఒక్కటి కత్తి గాట్లు తగిలి చనిపోయి ఉందనీ, రూ.3020/- నగదు మరియు 10 మోటర్ బైక్స్, 6 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకొని ఈస్గగాం పోలిస్ స్టేషన్ లో అప్పగించినట్లు టాస్క్ ఫోర్స్ సిఐ రాణా ప్రతాప్ తెలిపారు. ఈ టాస్క్ లో వారితో ఎస్సై వెంకటేష్, పోలీస్ సిబ్బంది రమేష్, మధు, దేవేందర్, సంజీవ్ తో పాటు స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

