అన్వేషించండి

Manda Jagannatham: మాజీ ఎంపీ మందా జగన్నాథానికి నివాళులు- తెలంగాణకు చేసిన సేవలు గుర్తు చేసుకున్న నేతలు

KTR NIVALI: మందా జగన్నాథం భౌతికకాయానికి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళులు అర్పించారు. సీఎంలు రేవంత్‌రెడ్డి, చంద్రబాబు సంతాపం ప్రకటించారు.

Manda Jagannatham : సీనియర్  రాజకీయ నాయకుడు, నాగర్‌కర్నూలు నుంచి 4సార్లు ఎంపీగా  ఎన్నికైన మందా జగన్నాథం  తీవ్ర అనారోగ్యంతో  కన్నుమూశారు. హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ఆయన మృతిచెందారు.  

నేతల నివాళులు
మందా జగన్నాథం మృతి పట్ల తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రులు సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు  తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి(Revanth ReddY) సానుభూతి  తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో  ఆయన చేసిన సేవలు  మరువలేనివని గుర్తుచేసుకున్నారు. మందా జగన్నాథం మృతిపట్ల  ఏపీ సీఎం చంద్రబాబు(Chandra Babu)  సంతాపం  తెలిపారు. నాలుగుసార్లు లోక్‌సభకు ఎన్నికైన  జగన్నాథం...రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారన్నారు. పేద కుటుంబంలో  పుట్టినా   ఉన్నత చదువులు చదివి పైకి ఎదిగారన్నారు.  

తెలుగుదేశం(Telugu desam) పార్టీ  నుంచే  మూడు సార్లు ఎంపీగా గెలిచి ప్రజాసేవ చేశారని గుర్తు చేసుకున్నారు. ఆయన మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తూ...కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలిపారు. చంపాపేటలో మందా జగన్నాథం  భౌతికకాయానికి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ (KTR)నివాళులు అర్పించారు.జగన్నాథం కుటుంబ సభ్యులను ఆయన ఓదార్చారు. మంద జగన్నాథం ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానన్నారు. తెలంగాణ ఓ అనుభజ్ఞుడైన రాజకీయ నేతను కోల్పోయిందన్నారు. నాలుగుసార్లు ఎంపీగా గెలిచి ప్రజలకు ఎంతో సేవ చేశారని కేటీఆర్ గుర్తు చేసుకున్నారు.

వివాదరహితుడుగా, సౌమ్యుడిగా, తెలంగాణ మేలు కోరుకున్న వ్యక్తిగా ఆయన ప్రజల గుండెల్లో ఎప్పుడూ గుర్తుండిపోతారన్నారు. తెలంగాణ (Telangana)ఉద్యమ సమయంలో  కలిసి పనిచేసిన రోజులను మంత్రి పొన్నం ప్రభాకర్‌ గుర్తుచేసుకున్నారు.అప్పటి  కాంగ్రెస్ సీనియర్ నేత  ప్రణబ్‌ ముఖర్జీ ఆగ్రహానికి గురై  గుండెపోటు వచ్చినా....మందా జగన్నాథం తెలంగాణ ఉద్యమాన్ని విరమించలేదని పొన్నం ప్రభాకర్‌ (Ponnam Prabhakar) అన్నారు.  ఆయన మృతి పట్ల మంత్రి  పొన్నం ప్రభాకర్  సంతాపం వ్యక్తం చేశారు. జగన్నాథం రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారని ఎమ్మెల్యే హరీశ్‌రావు(HarishRao) సంతాపం వ్యక్తం చేశారు.  

మందా జగన్నాథం నేపథ్యం
నాగర్‌కర్నూల్‌ జిల్లా ఇటిక్యాలలో 1951 మే 22న జన్మించిన మందా జగన్నాథం జన్మించిన మందా జగన్నాథం.. నాగర్‌కర్నూలు నుంచి  నాలుగుసార్లు ఎంపీగా విజయం సాధించారు. తొలుత తెలుగుదేశం పార్టీలో చేరిన  ఆయన.....1996, 1999, 2004 పార్లమెంటు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ  నుంచి గెలుపొందారు.  ఆ తర్వాత  2009లో కాంగ్రెస్‌ పార్టీలో చేరి మరోసారి  విజయం సాధించారు. తెలంగాణ ఉద్యమంలో విశేషంగా పాల్గొన్న ఆయన...నూతన రాష్ట్రం ఏర్పడిన తర్వాత  2014 లో బీఆర్‌ఎస్‌లో చేరి మరోసారి పోటీచేసినా  స్వల్ప  ఓట్లతేడాతో  ఆయన  ఓటమిపాలయ్యారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా సేవలందించారు.

కేబినెట్ హోదా కలిగిన ఈ పదవీకాలం ముగిసినా కేసీఆర్ మరోసారి అవకాశం కల్పించారు.  2023లో బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరినా  ఆయనకు టిక్కెట్  దక్కలేదు. దీంతో గత ఎన్నికలకు ముందు   ఆయన బీఎస్పీలో  చేరారు. వయోభారంతో కొంతకాలంగా అనారోగ్యంతో  బాధపడుతున్నారు. గుండె, మూత్రపిండాలు దెబ్బతినడంతోపాటు ఊపిరితిత్తుల్లోనూ ఇన్‌ఫెకన్  కారణంగా  ఆయన నిమ్స్‌లో చికిత్సపొందుతూ  కన్నుమూశారు. అధికారిక  లాంఛనాలతో మాజీఎంపీ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Water Board: నీళ్లు వృథా చేస్తే రూ.20 వేల ఫైన్.. వాటర్ కనెక్షన్ కట్, కఠిన చర్యలు
నీళ్లు వృథా చేస్తే రూ.20 వేల ఫైన్.. వాటర్ కనెక్షన్ కట్, కఠిన చర్యలు
Drone Smuggling Syndicate: సరిహద్దుల్లో డ్రోన్ల ద్వారా ఆయుధాలు, హెరాయిన్ స్మగ్లింగ్.. ఇద్దర్ని అరెస్టు చేసిన ఎన్ఐఏ
సరిహద్దుల్లో డ్రోన్ల ద్వారా ఆయుధాలు, హెరాయిన్ స్మగ్లింగ్.. ఇద్దర్ని అరెస్టు చేసిన ఎన్ఐఏ
Harish Rao: భార్యకు ఫ్రీ టికెట్.. భర్తకు డబుల్ టికెట్, ఇదేనా మీ ప్రజాపాలన?: మాజీ మంత్రి హరీష్ రావు
భార్యకు ఫ్రీ టికెట్.. భర్తకు డబుల్ టికెట్, ఇదేనా మీ ప్రజాపాలన?: మాజీ మంత్రి హరీష్ రావు
Dasara Festival Rush: పండుగ రద్దీతో స్తంభించిన హైదరాబాద్- విజయవాడ హైవే.. పంతంగి వద్ద రికార్డు స్థాయిలో వాహనాలు
పండుగ రద్దీతో స్తంభించిన హైదరాబాద్- విజయవాడ హైవే.. పంతంగి వద్ద రికార్డు స్థాయిలో వాహనాలు

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao: భార్యకు ఫ్రీ టికెట్.. భర్తకు డబుల్ టికెట్, ఇదేనా మీ ప్రజాపాలన?: మాజీ మంత్రి హరీష్ రావు
భార్యకు ఫ్రీ టికెట్.. భర్తకు డబుల్ టికెట్, ఇదేనా మీ ప్రజాపాలన?: మాజీ మంత్రి హరీష్ రావు
Hyderabad Water Board: నీళ్లు వృథా చేస్తే రూ.20 వేల ఫైన్.. వాటర్ కనెక్షన్ కట్, కఠిన చర్యలు
నీళ్లు వృథా చేస్తే రూ.20 వేల ఫైన్.. వాటర్ కనెక్షన్ కట్, కఠిన చర్యలు
Vangaveeti Radhakrishna: విజయవాడ మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ నామినేషన్.. అనంతరం చిరంజీవికి స్పెషల్ థ్యాంక్స్
విజయవాడ మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ నామినేషన్.. చిరంజీవికి స్పెషల్ థ్యాంక్స్
Thella Kagitham Nakshatra : టాలీవుడ్ యంగ్ బ్యూటీ గ్లామరస్ లుక్ - చూపులతోనే మ్యాజిక్ చేసిన తెల్లకాగితం హీరోయిన్
టాలీవుడ్ యంగ్ బ్యూటీ గ్లామరస్ లుక్ - చూపులతోనే మ్యాజిక్ చేసిన తెల్లకాగితం హీరోయిన్
YS Jagan: ఏపీ స్థానిక ఎన్నికల్లో ఎన్నో అరాచకాలు..! కూటమి ప్రభుత్వం, ఎస్ఈసీపై వైఎస్ జగన్ ఆరోపణలు
ఏపీ స్థానిక ఎన్నికల్లో ఎన్నో అరాచకాలు..! కూటమి ప్రభుత్వం, ఎస్ఈసీపై వైఎస్ జగన్ ఆరోపణలు
Mahindra XUV 3XO ZNG పేరుకే CNG కారు- అధిక మైలేజ్,పెట్రోల్ లాంటి పవర్ దీని సొంతం
Mahindra XUV 3XO ZNG పేరుకే CNG కారు- అధిక మైలేజ్,పెట్రోల్ లాంటి పవర్ దీని సొంతం
NATS: తెలుగు సంస్కృతి పరిరక్షణ కోసం 'నాట్స్' మిషిగన్ చాప్టర్‌ ప్రారంభం... హరినాథ్ పొలిచర్లకు సత్కారం
తెలుగు సంస్కృతి పరిరక్షణ కోసం 'నాట్స్' మిషిగన్ చాప్టర్‌ ప్రారంభం... హరినాథ్ పొలిచర్లకు సత్కారం
Punganur Elections: ఎంపీ మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పోలీసుల నోటీసులు.. హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్!
ఎంపీ మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పోలీసుల నోటీసులు.. హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్!
Embed widget