News
News
వీడియోలు ఆటలు
X

తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లకు రంగం సిద్ధం, సరిహద్దుల్లో చెక్ పోస్టులు

రాష్ట్రంలో ప్రతి రైస్ మిల్లును CMRలో భాగాస్వామ్యం  

9 సంవత్సరాల్లో ఆరు రేట్లు పెరిగిన ధాన్యం కొనుగోళ్లు

FOLLOW US: 
Share:

తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లకు రంగం సిద్ధమైంది. సరిహద్దుల్లో చెక్ పోస్టులు పెట్టాలని సీఎం ఆదేశించారు. పక్క రాష్ట్రాల వారు రాకుండా చూసే బాధ్యత అధికారులకే అప్పగించారు. రాష్ట్రంలో ప్రతీ రైసుమిల్లును సీఎంఆర్‌లో భాగస్వామ్యం చేయాలని నిర్ణయించారు. ఈ తొమ్మిదేళ్లలో ధాన్యం కొనుగోళ్లు 9రెట్లు పెరిగిట్టు గణాంకాలు చెబుతున్నాయి. రెండు సీజన్లలో కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రులు పేర్కొన్నారు.

7,100 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు

సీఎం ఆదేశాల మేరకు ధాన్యం కొనుగోలు సెంటర్లను ప్రారంభించాలని మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్ , నిరంజన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించి జిల్లా స్థాయిలో కలెక్టర్లు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించకొని సిద్దం కావాలని సూచించారు. రైతుల పండించిన ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని కోరారు. ఇందుకోసం 7,100 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ధాన్యం దిగుబడికి అనుగుణంగా కేంద్రాలను ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.

CMR అప్పగించే విషయంలో ఆలస్యం జరిగితే ఒప్పుకోం

యాసంగి ధాన్యం కొనుగోలు, సీఎంఆర్ సేకరణపై ఆయా జిల్లాల అడిషనల్ కలెక్టర్లలు, జిల్లా పౌర సరఫరాల అధికారులు, FCI అధికారులతో మంత్రులు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ధాన్యం కొనుగోళ్లకు కావాల్సిన ఏర్పాట్లను కలెక్టర్లు సిద్దం చేసుకోవాలని, వచ్చేవారంలో ధాన్యం సేకరణపై సమీక్ష నిర్వహిస్తామన్నారు మంత్రులు. యాసంగికి సీజన్ CMRను ఈనెల 30వ తేదీలోగా మిల్లర్లు నుంచి సేకరించాలని, దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ఇకనుంచి CMR అప్పగించే విషయంలో ఏమాత్రం ఆలస్యం జరిగినా ఉపేక్షించబోమని  హెచ్చరించారు. ఇప్పటి వరకు పెండింగులో ఉన్న CMRని అప్పగించి ఈ సీజన్ సంబంధించి ధాన్యాన్ని తీసుకోవాలని రైస్ మిల్లర్లుకు సూచించారు. ఇప్పటివరకు  CMRలో పాల్గొనని మిల్లర్లను కూడా ఈ యాసంగి సీజన్ నుంచి భాగాస్వామ్యం చేస్తున్నట్లు మంత్రులు  ప్రకటించారు.

రెండు సీజన్లలో కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ

దేశంలో ఆయా రాష్ట్రాలలో రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తిస్థాయిలో రెండు సీజన్లలో కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రులు పేర్కొన్నారు.  అదనపు కలెక్టర్లు జిల్లా స్థాయిలో కార్యాచరణ ప్రణాళికలు తయారు చేసుకోని ధాన్యం కొనుగోలు చేయాలని మంత్రులు సూచించారు. ధాన్యం నిల్వలకు ఇంటర్మీడియట్ గోడౌన్లు గుర్తించి తగు ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించాలని వారు సూచించారు. ఆరబెట్టిన  ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చే విధంగా రైతులకు అవగాహన కల్పించాలని మంత్రులు పేర్కొన్నారు. రాష్ట్రంలో రోజురోజుకు ధాన్యం దిగుబడి, కొనుగోలు గణనీయంగా పెరుగుతున్నాయని, 2014-15లో రూ.3,392 కోట్లతో ధాన్యం సేకరిస్తే, 2020-21 నాటికి రూ.26,600 కోట్లకు చేరుకుంది. 9 సంవత్సరాలలో ఆరురెట్ల ధాన్యం కొనుగోలు పెరగ్గా, మిల్లింగ్ సామర్థ్యం రెండురెట్లు మాత్రమే పెరిగిందని, దీన్ని దృష్టిలో పెట్టుకొని మిల్లర్ల నుంచి సీఎంఆర్ సేకరణలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 

రాష్ట్ర సరిహద్దుల వద్ద చెక్ పోస్టులు

ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం రాకుండా రాష్ట్ర సరిహద్దుల వద్ద చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలని మంత్రులు ఆదేశించారు.ప్రస్తుతం ఉన్న చెక్ పోస్టులను బలోపేతం చేయాలని మినిస్టర్లు సూచించారు. రైతులకు చెల్లింపులు ఆలస్యం జరగకుండా ధాన్యం కొనుగోలు వివరాలను కొనుగోలు కేంద్రాల నిర్వహకులు ఏప్పటికప్పడు ఆన్ లైన్లో నమోదు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Published at : 10 Apr 2023 08:33 PM (IST) Tags: Govt Telangana Paddy Farmer Procurement

సంబంధిత కథనాలు

Monsoon 2023: కేరళను తాకిన రుతుపవనాలు- వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో నైరుతి వానలు 

Monsoon 2023: కేరళను తాకిన రుతుపవనాలు- వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో నైరుతి వానలు 

Polavaram Project: పోలవరంలో సీఎం జగన్ టూర్- పనుల జరుగుతున్న తీరుపై ఏరియల్ సర్వే

Polavaram Project: పోలవరంలో సీఎం జగన్ టూర్- పనుల జరుగుతున్న తీరుపై ఏరియల్ సర్వే

తమిళనాడులో ఇషా ఆధ్వర్యంలో బిగ్‌ ప్లాంటేషన్‌ డ్రైవ్- 2023లో 1.1 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యం

తమిళనాడులో ఇషా ఆధ్వర్యంలో బిగ్‌ ప్లాంటేషన్‌ డ్రైవ్- 2023లో 1.1 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యం

Weather Latest Update: ఏపీ, తెలంగాణలో ఇవాళ రికార్డు స్థాయిలో ఎండలు-జూన్‌ రెండో వారంలో తెలుగు రాష్ట్రాల్లోకి రుతుపవనాలు!

Weather Latest Update: ఏపీ, తెలంగాణలో ఇవాళ రికార్డు స్థాయిలో ఎండలు-జూన్‌ రెండో వారంలో తెలుగు రాష్ట్రాల్లోకి రుతుపవనాలు!

గుంటూరులో వైఎస్‌ఆర్‌ యంత్ర సేవా పథకం ప్రారంభించిన సీఎం జగన్

గుంటూరులో వైఎస్‌ఆర్‌ యంత్ర సేవా పథకం ప్రారంభించిన సీఎం జగన్

టాప్ స్టోరీస్

AP TDP Plan : ఓటర్లకు ముందుగానే పథకాల కార్డులు - ఏపీలో టీడీపీ కొత్త ప్లాన్ !

AP TDP Plan : ఓటర్లకు ముందుగానే పథకాల కార్డులు -  ఏపీలో టీడీపీ కొత్త ప్లాన్ !

CM Jagan Gudivada Tour: సీఎం జగన్‌ గుడివాడ పర్యటన వాయిదా, ఇక టిడ్కో ఇళ్లు ప్రారంభం 16న!

CM Jagan Gudivada Tour: సీఎం జగన్‌ గుడివాడ పర్యటన వాయిదా, ఇక టిడ్కో ఇళ్లు ప్రారంభం 16న!

Durgam Chinnaiah: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు షాక్! మహిళా కమిషన్ కీలక ఆదేశం

Durgam Chinnaiah: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు షాక్! మహిళా కమిషన్ కీలక ఆదేశం

IND vs AUS Final: ఫాలోఆన్ ప్రమాదంలో టీమిండియా, ఫైనల్లో ఐపీఎల్ సింహాలకు చావుదెబ్బ

IND vs AUS Final: ఫాలోఆన్ ప్రమాదంలో టీమిండియా, ఫైనల్లో ఐపీఎల్ సింహాలకు చావుదెబ్బ