అన్వేషించండి

PM Kisan Nidhi Yojana : పీఎం కిసాన్ నిధి యోజన డబ్బులు ఎప్పుడు వేస్తారు? రైతుల ఖాతాల్లో 4వేలు జమ చేస్తారా?

PM Kisan Nidhi Yojana : రైతులు 22వ విడత పీఎం కిసాన్ నిధి పథకం డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు. గత నవంబర్ 19న 21వ విడత నిధులు జమ చేశారు.  

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 22వ విడత నిధుల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు.
  • KYC లోపాలున్న రైతులకు రూ.4,000 చొప్పున రెండు విడతలు అందవచ్చు.
  • ఫిబ్రవరి చివరిలో లేదా మార్చి ప్రారంభంలో 22వ విడత విడుదల కావచ్చు.
  • pmkisan.gov.in వెబ్‌సైట్‌లో మీ అర్హత స్టేటస్‌ను చెక్ చేసుకోండి.

PM Kisan Nidhi Yojana : ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన దేశవ్యాప్తంగా లక్షల మంది రైతులకు ఒక ప్రధాన ఆర్థిక సహాయంగా మారింది. ఈ పథకం కింద, అర్హత కలిగిన రైతులు సంవత్సరానికి ₹6,000 ఆర్థిక సహాయం పొందుతున్నారు. మూడు వాయిదాలలో రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నారు. ఈ మొత్తం నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయడం వల్ల ప్రతి రైతు ఈ నిధుల కోసం ఎంతగానో ఎదురు చూస్తుంటారు. వీటితో వ్యవసాయ అవసరాలను తీర్చుకుంటున్నారు.  

అందుకే ఇప్పుడు రైతులు 22వ విడత నిధుల కోసం ఎదురు చూస్తున్నారు. 21వ విడత నిధులను నవంబర్ 19, 2025న రైతుల ఖాతాల్లో జమ చేశారు. తదుపరి విడత ఎప్పుడు వస్తుందో అని ఆశగా ఖాతాలు చెక్ చేస్తున్నారు. ఈసారి కొంతమంది రైతులకు ₹4,000 కూడా జమ చేస్తారని ప్రచారం జరుగుతోంది. కాబట్టి, కిసాన్ నిధి యోజన 22వ విడత ఎప్పుడు వస్తుందో? మీ అర్హత స్టాటస్ ఏంటో ఎలా చెక్ చేయాలో తెలుసుకోవడం చాలా అవసరం.  

22వ విడత ఎప్పుడు వస్తుంది?

22వ విడతకు సంబంధించిన అధికారిక తేదీని వ్యవసాయం, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఇంకా ప్రకటించలేదు. అయితే, మీడియా నివేదికల ప్రకారం, ఈ విడత ఫిబ్రవరి 2026 చివరిలో లేదా మార్చి 2026 ప్రారంభంలో విడుదల కావచ్చు. హోలీకి ముందు రైతుల ఖాతాలకు డబ్బు బదిలీ చేయవచ్చని కూడా చెబుతున్నారు. కానీ ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసే వరకు, తేదీని కచ్చితంగా ఇదీ అని చెప్పలేదు.  

ఏ రైతులు రూ.4,000 పొందగలరు?

ఈసారి, కొంతమంది రైతుల ఖాతాల్లో ₹4,000 జమ అవుతుందనే చర్చ జరుగుతోంది. వాస్తవానికి, KYC అసంపూర్ణంగా ఉండటం లేదా డాక్యుమెంట్ లోపాలు వంటి కారణాల వల్ల 21వ విడత ఆలస్యమైంది. అలాంటి రైతులు తమ సమస్యను పరిష్కరించుకొని రిక్వస్ట్ పెట్టుకున్నారు. వారికి గత వాయిదా, ఇప్పుడు 22వ వాయిదా రెండూ కలిపి ఇస్తారు. అంటే గత విడతలో సాంకేతిక కారణాలతో రెండు వేలు అందుకోలేని అన్నదాతలు ఈసారి ఒకేసారి ₹4,000 అందుకోవచ్చు. 

22వ విడత అర్హత జాబితాలో పేరును ఎలా చెక్ చేయాలి?

1. అధికారిక వెబ్‌సైట్ https://pmkisan.gov.inలోకి వెళ్లండి.  

2. హోమ్‌పేజీలో నో యువర్ స్టేటస్ లేదా బెనిఫిషియరీ స్టేటస్‌పై క్లిక్ చేయండి.

3. మీ రిజిస్ట్రేషన్ నంబర్ లేదా ఆధార్ నంబర్‌ను ఎంటర్‌ చేయండి.

4. క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేయండి.

5. 'డేటా పొందండి' పై క్లిక్ చేయండి. అప్పుడు స్క్రీన్‌పై అన్ని వాయిదా వివరాలు కనిపిస్తాయి. మీరు ఏ వాయిదాలను అందుకున్నారు, పెండింగ్‌లో ఉన్నవి ఎన్ని,  చివరి చెల్లింపు ఎప్పుడు జరిగింది అనే పూర్తి వివరాలు అందులో ఉంటాయి. 

Frequently Asked Questions

PM కిసాన్ 22వ విడత నిధులు ఎప్పుడు విడుదల అవుతాయి?

22వ విడతకు సంబంధించిన అధికారిక తేదీని వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఇంకా ప్రకటించలేదు. అయితే, మీడియా నివేదికల ప్రకారం, ఈ విడత ఫిబ్రవరి 2026 చివరిలో లేదా మార్చి 2026 ప్రారంభంలో విడుదల కావచ్చు.

కొంతమంది రైతులకు ₹4,000 ఎందుకు జమ అవుతుంది?

KYC అసంపూర్ణంగా ఉండటం లేదా డాక్యుమెంట్ లోపాలు వంటి కారణాల వల్ల గత విడతలో నిధులు రాని రైతులకు, ఈసారి గత వాయిదా మరియు 22వ వాయిదా కలిపి ₹4,000 జమ అవుతుంది.

22వ విడత అర్హత జాబితాలో నా పేరు ఉందో లేదో ఎలా చెక్ చేసుకోవాలి?

pmkisan.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి, 'బెనిఫిషియరీ స్టేటస్' పై క్లిక్ చేసి, మీ రిజిస్ట్రేషన్ లేదా ఆధార్ నంబర్‌ను ఎంటర్‌ చేయడం ద్వారా మీరు మీ అర్హత స్థితిని తనిఖీ చేయవచ్చు.

టాప్ హెడ్ లైన్స్

Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Cases Against YSRCP Leaders: గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
NTR Health Update : ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Embed widget