అన్వేషించండి

ప్రకాశం బ్యారేజ్‌కు దిగువున మరో బ్యారేజ్‌ నిర్మాణం- అధికారులకు సీఎం జగన్ ఆదేశం

పోలవరం కల సాకారం అయితే వరద నీటి నిల్వలు కూడా పుష్కలంగా ఉంటాయని సీఎం ఆకాంక్షించారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో పోలవరం ప్రాజెక్టు పనులపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు.

ప్రకాశం బ్యారేజ్‌కు దిగువున మరో బ్యారేజ్‌ నిర్మాణానికి శ్రీకారం చుట్టాలని సీఎం జగన్ ఆదేశించారు. రాష్ట్రంలో విస్తారం కురుస్తున్న వర్షపు నీటిని నిల్వ చేసేందుకు చర్యలు అవసరం అని అభిప్రాయపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాల వలన ప్రాజెక్టుల నుంచి వరద నీరు దిగువకు వెళ్ళకుండా అవసరం అయిన చర్యలు తీసుకునేందుకు బ్యారేజ్‌ నిర్మాణం అవసరం అని ఆయన అదికారులతో అన్నారు.

పోలవరం కల సాకారం అయితే వరద నీటి నిల్వలు కూడా పుష్కలంగా ఉంటాయని సీఎం ఆకాంక్షించారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో పోలవరం ప్రాజెక్టు పనులపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈసీఆర్‌ఎఫ్‌ డ్యాంలో కోతకు గురైన ప్రాంతంలో చేపట్టే పనుల ప్రణాళికపై అధికారులతో జగన్ చర్చించారు. ప్రస్తుత పరిస్థితులను సీఎంకు అధికారులు వివరించారు. ఇప్పటికీ గోదావరిలో వరద కొనసాగుతోందని, ప్రస్తుతం రెండున్నర లక్షల క్యూసెక్కుల వరదనీరు ఉందన్న అధికారులు, ఈసీఆర్‌ఎఫ్‌ డ్యాంలో ఎలాంటి పనులు చేపట్టాలన్నా ముందుగా కోతకు గురైన ప్రాంతంలో పరీక్షలు, ఆ పరీక్షల్లో వెల్లడైన అంశాలు, దాని తర్వాత డిజైన్ల ఖరారు పూర్తయితే కానీ చేయలేమని అధికారులు సీఎంకు వివరించారు.

కోతకు గురైన ప్రాంతంలో పరిస్థితులు, డయాఫ్రం వాల్‌ పటిష్టతపై నిర్ధారణ కోసం పరీక్షలు నవంబర్‌ మధ్యంతరం నుంచి మొదలవుతాయని, తుది నిర్ణయం రావడానికి డిసెంబరు నెలాఖరు వరకూ పట్టే అవకాశం ఉందని, ఆతర్వాత సీడబ్ల్యూసీ డిజైన్లు, మెథడాలజీ ఖరారు చేయాల్సి ఉంటుందని అధికారులు సీఎంకు నివేదికను అందించారు.

ప్రకాశం బ్యారేజ్‌కు దిగువున మరో బ్యారేజ్‌..

వెలిగొండ టన్నెల్‌–2లో మిగిలి ఉన్న 3.4 కిలో మీటర్ల సొరంగం పనులపై కూడా సీఎం అదికారుల నుంచి వివరాలు తీసుకున్నారు. సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని జగన్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. కృష్ణానదిలో ప్రకాశం బ్యారేజీ దిగువన బ్యారేజీ నిర్మాణాన్ని ప్రాధాన్యతగా తీసుకోవాలన్న సీఎం, ఇందుకు అవసరం అయిన అన్ని చర్యలు తీసుకోవాలని  సూచించారు. అంతేకాదు సీఎం ఆదేశాలతో కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ పనులు కూడా జూన్‌ కల్లా పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్న వివరణ ఇచ్చారు. 

వీటన్నింటితోపాటు రిజర్వాయర్లు, నీటి ప్రాజెక్టుల నిర్వహణపై ప్రత్యేక దృష్టిపెట్టాలని, అవసరమైన సిబ్బందిని నియమించుకోవడంతోపాటు, నిర్వహణపై ఒక కార్యాచరణ రూపొందించాలని, క్రమం తప్పకుండా నిర్వహణ పనులు చేయాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు. లిఫ్ట్‌ స్కీంల నిర్వహణ కోసం ఎస్‌ఓపీ అమలు చేయాలన్నారు. ఏళ్లకొద్దీ నిర్వహణ సరిగ్గా లేక చాలా ఎత్తిపోతల పథకాలు మూలనపడుతున్నాయని సీఏం తెలిపారు. వీటి నిర్వహణపై ఒక ఎస్‌ఓపీ రూపొందించాలని,సంబంధిత ఎత్తిపోతల పథకాల పరిధిలో రైతులను కమిటీలుగా ఏర్పాటు చేసి వారి పర్యవేక్షణలో ఎత్తిపోతల పథకాలు నడిచేలా తగిన ఆలోచనలు చేయాలన్నారు. వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న మంచి విధానాలను గుర్తించి వాటిపై కసరత్తు చేయాలని అధికారులకు సీఎం ఆదేశించారు. ప్రభుత్వం నుంచి ఒక కార్పస్‌ ఫండ్‌ ఏర్పాటయ్యేలా చూడాలని, కరెంటు బిల్లులను ప్రభుత్వమే చెల్లిస్తున్నందున, నిర్వహణ రైతుల పర్యవేక్షణలో సమర్థవంతంగా నడిచేలా తగిన అవగాహన, వారికి శిక్షణ  ఇప్పించేలా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు.

Also Read: 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
Lagacherla Case: లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు-సురేష్‌పై లుక్‌ అవుట్ నోటీసు- ఢిల్లీకి చేరిన రైతుల పంచాయితీ
లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు-సురేష్‌పై లుక్‌ అవుట్ నోటీసు- ఢిల్లీకి చేరిన రైతుల పంచాయితీ
AP DSC 2024: ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
Telangana EV Subsidy 2024: తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సచ్చిపోదామని యాసిడ్ తాగినా!! ఇతని స్టోరీకి కన్నీళ్లు ఆగవు!బై నాన్నా.. వెక్కివెక్కి ఏడ్చిన నారా రోహిత్Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
Lagacherla Case: లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు-సురేష్‌పై లుక్‌ అవుట్ నోటీసు- ఢిల్లీకి చేరిన రైతుల పంచాయితీ
లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు-సురేష్‌పై లుక్‌ అవుట్ నోటీసు- ఢిల్లీకి చేరిన రైతుల పంచాయితీ
AP DSC 2024: ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
Telangana EV Subsidy 2024: తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
Andhra Pradesh High School Time Table: ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
Vishwak Sen : మేం ఇట్లనే మాట్లాడ్తాం, పర్సనల్ అటాక్ చేస్తే దబిడి దిబిడే - రివ్యూ రైటర్లకు విశ్వక్ సేన్ స్ట్రాంగ్ వార్నింగ్
మేం ఇట్లనే మాట్లాడ్తాం, పర్సనల్ అటాక్ చేస్తే దబిడి దిబిడే - రివ్యూ రైటర్లకు విశ్వక్ సేన్ స్ట్రాంగ్ వార్నింగ్
Kantara Chapter 1 Release Date: గాంధీ జయంతికి 'కాంతార' ప్రీక్వెల్... లాంగ్ వీకెండ్ మీద కన్నేసిన రిషబ్ శెట్టి
గాంధీ జయంతికి 'కాంతార' ప్రీక్వెల్... లాంగ్ వీకెండ్ మీద కన్నేసిన రిషబ్ శెట్టి
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Embed widget