వీడియో: డ్రోన్లు వ్యాక్సిన్లను ఎలా పట్టుకెళ్తున్నాయో చూడండి
దేశంలోనే తొలిసారిగా తెలంగాణలోని వికారాబాద్లో మందులు, వ్యాక్సిన్లను డ్రోన్ల ద్వారా పంపిణీ చేయడాన్ని ప్రారంభించారు. మారుత్ డ్రోన్ టెక్, అల్ఫా డిజిటల్ టెక్ కంపెనీలు సంయుక్తంగా తయారు చేసిన హెవీ పేలోడ్ డ్రోన్లను మందుల సరఫరాకు వాడుతున్నారు. బరువులను దూర ప్రాంతాలకు మోసుకుపోగలగడం ఈ డ్రోన్ల ప్రత్యేకత. డ్రోన్లకు అమర్చిన ఉష్ణోగ్రత నియంత్రణ గదిలో వ్యాక్సిన్లు లేదా మందులను ఉంచి పంపిణీ చేయవచ్చు.
2.9 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఈ డ్రోన్లు వ్యాక్సిన్లను పంపిణీ చేశాయి. ఈ ప్రాజెక్టును కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రారంభించారు. టెక్నాలజీ విషయంలో తెలంగాణ ముందుండడం ప్రశంసనీయం అని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, కాలె యాదయ్య, మహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.