Fire Accident: స్టేషన్‌ఘన్‌పూర్లో నడిరోడ్డుపై మంటల్లో కాలిపోయిన బస్సు
జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద ఆర్టీసీ బస్సు మంటల్లో చిక్కుకుని పూర్తిగా దగ్ధమైంది. హన్మకొండ నుంచి హైదరాబాద్‌కు 30 మందితో వెళ్తున్న సూపర్ లగ్జరీ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బస్సు వెనక భాగంలో మంటలు రావటాన్ని గమనించిన డ్రైవర్.. వెంటనే ఆప్రమత్తమై బస్సును పక్కన ఆపేశాడు. హుటాహుటిన ప్రయాణికులందరినీ కిందికి దించేశాడు. క్షణాల్లోనే మంటలు బస్సును ఆవహించాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలు ఆర్పేశారు. ఈ ప్రమాదంలో ఎవ్వరికీ ఎలాంటి హానీ జరగకపోవటం వల్ల పెద్ద ప్రమాదమే తప్పినట్టైంది. షార్ట్‌సర్క్యూట్ కారణంగానే ప్రమాదం సంభవించిందని అధికారులు చెబుతున్నారు.





















