Palm Sugar | ఈత చెట్ల నీరా నుంచి పంచదార తయారుచేస్తారని తెలుసా.?| ABP Desam
తాటిచెట్లు, ఈత చెట్ల నుంచి కల్లు తీస్తారనేది అందరికీ తెలిసిందే. కొన్ని ప్రాంతాల్లో ఖర్జూర చెట్ల నుంచి కూడా కల్లు తీస్తుంటారు. అయితే తాజాగా తీసిన ఈత చెట్ల నీరా నుంచి పంచదార తయారు చేస్తున్నారు కరీంనగర్ కు చెందిన నేరెళ్ల శ్రియ.తన కులవృత్తిని వదిలేయలేక... కేవలం కల్లు అమ్మడం ఇష్టం లేని శ్రియ.. ఏదైనా విభిన్నంగా ప్రయత్నించాలనుకున్నారు. కేరళలో కొబ్బరి పాల నుంచి చక్కెర తయారుచేస్తున్నట్లు తెలుసుకున్న శ్రియ... ఇంటర్నెట్ లో బాగా సెర్చ్ చేసి, పామ్ జాగరీ గురించి తెలుసుకున్నారు. ఆ తర్వాత దానిపై పీజీ డిప్లొమా పూర్తిచేసి, నీరా షుగర్ పరిశ్రమను పెట్టాలని నిర్ణయించుకున్నారు. మహారాష్ట్రలోని ఫాల్గర్ జిల్లాలో పరిశ్రమను ఏర్పాటుచేసి, నీరా సేకరణకు స్థానిక గిరిజనులతో ఒప్పందం చేసుకున్నారు. ఏడాది క్రితం నీరా షుగర్ పౌడర్ ను మార్కెట్లోకి విడుదల చేశారు. ప్రస్తుతం రోజుకు 20 కేజీల చక్కెరను తయారుచేస్తున్నారు శ్రియ. నీరా నుంచి చక్కెర తయారీ ఎలానో మరి మీరు కూడా చూసేయండి