Manchu Vishnu on Nagarjuna Issue | నాగార్జున, సమంత, నాగచైతన్య వెంటే ఉంటాం | ABP Desam
తెలంగాణ మంత్రి కొండా సురేఖ అక్కినేని ఫ్యామిలీపై చేసిన వ్యాఖ్యల గురించి మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు స్పందించారు. ఈ విషయాన్ని తాము తేలిగ్గా పరిగణించబోమని, కచ్చితంగా న్యాయపరంగా చర్యలకు వెళ్తామని హెచ్చరించారు. నటీ నటుల పై ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేసే వారిని చూస్తూ ఊరుకోమన్న మంచు విష్ణు వారిపై ఎలా స్పందించాలో నిర్ణయించుకుని ఓ కఠినమైన నియమావళిని ఫాలో అవుతామన్నారు. ప్రత్యేకించి హీరోయిన్లు, మహిళా ఆర్టిస్ట్స్ విషయాల్లో ఈ నిబంధనలు మరింత కఠినంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటామని మంచు విష్ణు చెప్పారు. పీటీఐ కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన మంచు విష్ణు కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందిచారు. నాగార్జున, నాగచైతన్య, సమంత లపై అనుచిత వ్యాఖ్యలు చేయటంతో పాటు ఇతరుల వ్యక్తిగత జీవితాలను మీడియా ముందు పెట్టిన మంత్రి కొండా సురేఖ పై నాగార్జున కూడా న్యాయపరంగా వెళ్తున్నారు. నాంపల్లి కోర్టులో ఇప్పటికే నాగార్జున పరువు నష్టం దావా వేశారు.