Maha Kumbh Madhya Pradesh Road Accident | కుంభమేళా యాత్రలో ఘోర విషాదం | ABP Desam
మహా కుంభమేళా యాత్రలో ఘోర విషాదం నెలకొంది. కుంభమేళాకు వెళ్లి వస్తున్న యాత్రికుల బస్సును మధ్యప్రదేశ్ లో ని సిహోరా దగ్గర ట్రక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహాకుంభమేళాకు వెళ్లి వస్తున్న 8 మంది మృతి చెందారు. 7గురు భక్తులు ఘటనా స్థలంలోనే మృతి చెందగా..మరొకరు ఆసుపత్రికి తీసుకెళ్లే మార్గంలో చనిపోయారు. 30వ నెంబర్ జాతీయ రహదారి మీద మోహ్లా బార్గి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వాహనం ఏపీ రిజిస్ట్రేషన్ తో ఉండటంతో తొలుత వీరిని ఏపీ వాసులుగా పోలీసులు భావించారు. అయితే మృతుల వద్ద ఆధార్ కార్డ్స్ లో వీళ్ల చిరునామా హైదరాబాద్ లోని నాచారంగా ఉండటంతో వీళ్లను తెలంగాణ వాసులుగా గుర్తించి తెలంగాణ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. పుణ్యస్నానాలకు వెళ్లి వస్తారనుకున్న కుటుంబసభ్యులు ఇలా మృత్యువాత పడటంతో వాళ్ల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. మృతుల సమాచారాన్ని తెలంగాణ ప్రభుత్వానికి సైతం పంపించారు అక్కడి పోలీసులు.





















