HCA President Jagan Mohan Rao Arrest | ఐపీఎల్ వివాదంలో హెచ్ సీఏ ప్రెసిడెంట్ ను అరెస్ట్ చేసిన సీఐడీ | ABP Desam
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో భారీ కుదుపు ఏర్పడింది. ఏకంగా హెచ్ సీఏ ఛైర్మన్ జగన్మోహన్ రావును సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఇటీవలే ముగిసిన ఐపీఎల్ సందర్భంగా SRH యాజమాన్యానికి, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు మధ్య వివాదం ఏర్పడింది. మ్యాచుల్లో 20 శాతం టిక్కెట్లను హెచ్ సీఏ సిబ్బంది కోసం ఉచితంగా ఇవ్వాలని తమపై ఛైర్మన్ జగన్మోహన్ రావు బెదిరింపులకు పాల్పడ్డారంటూ SRH యాజమాన్యం ఆరోపణలు చేసింది. అంతే కాదు SRH మేనేజ్మెంట్ తమ మాట వినటం లేదని HCA అధ్యక్షుడు జగన్మోహనరావు వీఐపీ గ్యాలరీకి తాళాలు వేయించారనే వార్తలు కూడా అప్పట్లో బయటకు వచ్చాయి. దీంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం దీనిపై విజిలెన్స్ ఎంక్వైరీ వేసింది. సో ఇప్పుడు నివేదికల ఆధారంగా కేసు నమోదు చేసిన జగన్మోహన్ రావును అదుపులోకి తీసుకున్నారు. ఆయనను విచారించి వదిలిపెడతారో లేదా కోర్టులో సబ్మిట్ చేస్తారనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.





















