Adilabad Ganapathi Navaratri Special | ఆదిలాబాద్ గణపతి పందిళ్లలో మహారాష్ట్ర ఆచారం | ABP Desam
సాధారణంగా వినాయకచవితి కి గణేష్ విగ్రహాలను నిలబెట్టి తొమ్మిదిరోజుల పాటు పూజలు నిర్వహించిన ఘనంగా నిమజ్జనాలు నిర్వహిస్తాం కదా..ఆదిలాబాద్ జిల్లాలో వినాయక నవరాత్రులు మాత్రం కాస్త ప్రత్యేకం. ఇక్కడ గణనాధుడితో పాటు మహాలక్ష్మీ, గౌరి దేవిల విగ్రహాలు నెలకొల్పి పూజలు చేయటం ఇక్కడ ఆచారంగా కనిపిస్తుంది.వినాయకుడితో పాటే మండపంలో మహాలక్ష్మీ, గౌరి దేవి ప్రతిమలను ఏర్పాటు చేసిధూప దీప నైవేద్యలతో పూజలు చేస్తారు. ప్రత్యెకమైన పిండి వంటలను తయారు చేసి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుంటారు. ఆదిలాబాద్ తోపాటు, బేల, జైనథ్, ఇంద్రవెల్లి, ఇచ్చోడ, తాంసి, గుడిహత్నూర్ మండలాలలో ఇలా లక్ష్మీ,గౌరీ అమ్మవార్ల పూజలు చూడొచ్చు.పొరుగున ఉన్న మహారాష్ట్ర ప్రభావంగా ఇక్కడి ప్రజలు చెబుతారు. ఆదిలాబాద్ జిల్లా వాసులకు మహారాష్ట్ర ప్రాంతంలోనూ బంధువులు ఉండటంతో ఇక్కడికి రాకపోకలు సాగిస్తుంటారు. అయితే ఆచార వ్యవహారాలలోను కొందరు ఇప్పటికి మహారాష్ట్ర సంప్రదాయాలను, పద్దతులను ఆచరిస్తుంటారు. అలా ఆదిలాబాద్ జిల్లాలో మహాలక్ష్మీ పూజలు, గౌరీ పూజలు నేటికీ అలాగే కొనసాగుతున్నాయి.





















