Yashasvi Jaiswal about Vaibhav IPL 2026 | వైభవ్ సూర్యవంశీపై యశస్వి జైస్వాల్ కామెంట్స్
ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ సంచలనాలు సృష్టిస్తోంది. పంజాబ్ కింగ్స్‌పై విజయం ఒకెత్తయితే.. ఆ టీమ్ ఓపెనింగ్ పెయిర్ హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ చూసి స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఫిదా అయిపోయాడు.
మ్యాచ్ అనంతరం యశస్వి జైస్వాల్ మాట్లాడుతూ.. వైభవ్ సూర్యవంశీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. "వైభవ్ బ్యాటింగ్ అద్భుతం. 15 ఏళ్ల వయసులో అతను బాల్ ను కొట్టే తీరు చూస్తుంటే నాకు మాటలు రావడం లేదు. అవతలి ఎండ్‌లో నిలబడి అతని హిట్టింగ్‌ను చూడటం నేను బాగా ఎంజాయ్ చేస్తున్నాను" అని అన్నాడు.
పంజాబ్ ఇచ్చిన 223 పరుగుల టార్గెట్ గురించి స్పందిస్తూ.. "ఇది హై స్కోరింగ్ గ్రౌండ్ అని మాకు తెలుసు. అందుకే మొదటి నుంచే దూకుడుగా ఆడాలని నిర్ణయించుకున్నాం. బాల్ నా రేంజ్‌లోకి వస్తే కొట్టాలనే క్లారిటీతోనే వచ్చాను. వైభవ్ ఇచ్చిన స్టార్ట్ మాపై ఒత్తిడిని తగ్గించింది" అని జైస్వాల్ వివరించాడు.
ట్రెండింగ్ వార్తలు




















