What is Test Twenty | టెస్టు ట్వంటీ పేరుతో కొత్త ఫార్మాట్
క్రికెట్ లో ఇప్పటి వరకు మనకు తెలిసినవి మూడు ఫార్మట్ లు. కానీ ఇప్పుడు ఐసీసీ కొత్తగా నాలుగవ ఫార్మాట్ ను తీసుకురానుంది. అదే ‘టెస్టు ట్వంటీ’. టెస్టులను, టీ20లను కలుపుతూ ‘టెస్టు ట్వంటీ’ ను తీసుకొచ్చింది ఐసీసీ. ఈ ఫార్మాట్ ను వచ్చే సంవత్సరం నుంచి ప్రారంభిస్తారని అంటున్నారు.
టీ20 మ్యాచుల్లో రెండు టీమ్స్ 20 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేస్తాయి. కానీ టెస్టు ట్వంటీలో ఇరు జట్లు రెండు సార్లు బ్యాటింగ్ చేస్తాయి. ఉదారణకు తొలి సెషన్‌లో భారత్ బ్యాటింగ్ చేస్తే... రెండో సెషన్‌లో ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేస్తుంది. మూడో సెషన్‌లో మళ్లీ టీమ్ ఇండియా బ్యాటింగ్‌కి వస్తుంది. అప్పుడు భారత్ ఆడిన రెండు సెషన్ల స్కోరు కలిపి.... ఆఖరి సెషన్‌లో ఇంగ్లాండ్ చేజ్ చేయాల్సి ఉంటుంది.
క్రికెట్ లో మరో ఫార్మాట్ కు సంబందించిన చర్చలు ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. ఎన్నో సలహాలు సూచనల తర్వాత ఐసీసీ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది.ఈ మధ్యకాలంలో టెస్ట్ మ్యాచులకు ఫ్యాన్స్ నుంచి ఆదరణ తగ్గిపోవడం వల్లే.... ఇలా కొత్తగా టెస్టు ట్వంటీ ఫార్మాట్ ను తీసుకువచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ కొత్త ఫార్మాట్ కు సంబంధించి క్రికెట్ లవర్స్ రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. ఈ టెస్టు ట్వంటీ ఫార్మాట్ వల్ల వన్డే, టెస్టు ఫార్మాట్లపై తీవ్రంగా దెబ్బ పడుతుందని అంటున్నారు క్రికెట్ అభిమానులు.





















