Yuvraj Birthday: తన ట్రోఫీలను NFT చేస్తూ యువరాజ్ కీలక నిర్ణయం
క్రికెటర్ గా తన విలువైన క్షణాలు, ట్రోఫీలు, అవార్డులను NFT చేస్తున్నట్లు ప్రకటించాడు. దీనికి సంబంధించి ఓ వీడియోను రూపొందించిన యువీ...తన ఇంటిలో తనకున్న ట్రోఫీలు, అవార్డులను అభిమానులకు చూపిస్తూ మాట్లాడాడు. తన జీవితంలో ఫ్యాన్స్ ఇచ్చిన మద్దతు, వారి సహకారం మరిచిపోలేనిదన్న యువీ....అలాంటి జ్ఞాపకాలను అభిమానులకు అందించాలనే NFT చేస్తున్నట్లు ప్రకటించారు. ఇందుకోసం ఆసియా కు చెందిన బ్లాక్ చైన్ టెక్నాలజీ సంస్థ కలెక్సన్ తో టైఅప్ అవుతున్నట్లు ప్రకటన చేశాడు. ఈ ప్రక్రియ డిసెంబర్ 25న ప్రారంభమవుతుందని తన పుట్టినరోజు నాడు ఫ్యాన్స్ కి గుడ్ న్యూ స్ చెప్పాడు. కలెక్సన్ సంస్థ యువరాజ్ సింగ్ సహా మరో 30మంది దేశ, విదేశాలకు చెందిన స్టార్ క్రికెటర్ల విలువైన మూమెంట్స్ ని NFT చేస్తోంది. తద్వారా వర్చువల్ స్పేస్ లో యువీ లాంటి క్రికెటర్ల ఘనతలను ఈ ఆక్షన్ పెట్టనున్నారు.





















