India vs Pakistan First Time in Asia Cup Final | ఆసియాకప్ లో మొదటిసారి ఫైనల్ లో ఆడబోతున్న ఇండియా పాక్
ఆసియా కప్ చరిత్రలోనే తొలిసారిగా ఇండియా పాకిస్తాన్ ఫైనల్ ఆడబోతున్నాయి. ఇప్పటి వరకు ఈ టోర్నమెంట్ లో ఎనిమిది సార్లు కప్ సొంతం చేసుకున్న భారత్ ఫైనల్ లో మాత్రం పాకిస్తాన్ తో ఆడలేదు. పాకిస్తాన్ ది కూడా అదే పరిస్థితి. రెండు సార్లు ఆసియా కప్ ను సొంతం చేసుకున్న పాకిస్తాన్ ఫైనల్ లో టీమ్ ఇండియాతో మాత్రం ఆడలేదు.
41 ఏళ్ల ఆసియాకప్ చరిత్రలో ... జరిగిన 17 టోర్నమెంట్ లో ఈ రెండు టీమ్స్ ఈ సంవత్సరం మొదటి సారి ఫైనల్లో ఎదురవుతున్నాయి.
ఇప్పుడు జరగబోయే ఫైనల్ మ్యాచ్ కూడా చాలా రసవత్తరంగా కొసనగనుంది. ఆపరేషన్ సింధూర్, పహాల్గమ్ దాడి తర్వాత ఆసియా కప్ లో ఇండియా పాకిస్తాన్ మొదటిసారి మ్యాచ్ ఆడాయి. మొదటి మ్యాచ్ లో టీమ్ ఇండియా పాకిస్తాన్ ప్లేయర్స్ కు షేక్ హ్యాండ్ ఇవ్వకుండా వెళ్ళిపోయింది. ఆ తర్వాత మ్యాచ్ రెఫరీ, షేక్ హ్యాండ్ వివాదాలు మొదలైయాయి. రెండవ మ్యాచ్ లో పాకిస్తాన్ ప్లేయర్ గన్ షాట్ సెలెబ్రేషన్స్ ఈ వివాదాలకు మరింత ఫైర్ యాడ్ చేసినట్టు అయింది. కానీ జరిగిన రెండు మ్యాచుల్లో టీమ్ ఇండియా విజయం సాధించింది. మరి ఫైనల్ లో ఈ రెండు టీమ్స్ ఎలా ప్రదర్శిస్తాయో చూడాలి.





















