Vaibhav Sooryavanshi Fight With Sri Lanka Players | శ్రీలంక ప్లేయర్లతో వైభవ్ గొడవ
దంబల్లా వేదికగా భారత్-ఎ, శ్రీలంక-ఎ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో సూపర్ ఓవర్ ఓటమి తర్వాత.. వైభవ్ లంక ప్లేయర్స్ తో గొడవ ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. రెండు టీమ్ ప్లేయర్స్ మధ్య తోపులాట జరిగి పరిస్థితి దారుణంగా మారింది. దాంతో సీనియర్ ప్లేయర్లు రంగంలోకి దిగాల్సి వచ్చింది.
ఇండియా-ఎ, శ్రీలంక-ఎ జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్ టైగా ముగియడంతో అంపైర్లు 'సూపర్ ఓవర్' నిర్వహించారు. మొదట బ్యాటింగ్ చేసిన లంక జట్టు 16 పరుగులు చేసి, భారత్ ముందు 17 పరుగుల టార్గెట్ ఉంచింది. అయితే, చేజింగ్‌లో భారత్ కేవలం 9 పరుగులు మాత్రమే చేయగలిగింది. సూపర్ ఓవర్ ఆఖరి మూడు బంతులను వైభవ్ సూర్యవంశీ ఎదుర్కొన్నాడు. లంక ఫాస్ట్ బౌలర్ మథులన్ వేసిన యార్కర్లను ఆడటంలో వైభవ్ విఫలమయ్యాడు. ఒక ఫోర్‌తో సహా కేవలం 6 పరుగులు మాత్రమే రావడంతో భారత్ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఓటమి చవిచూసింది.
వైభవ్ సూర్యవంశీ, సూర్యాంశ్ హెడ్గే నిరాశగా వెళ్తుండగా.. ఒక శ్రీలంక ప్లేయర్ వీరిని ఉద్దేశించి కామెంట్ చేశాడు. దాంతో వైభవ్ ఒక్కసారిగా వెనక్కి తిరిగి లంక ప్లేయర్ వైపు దూసుకెళ్లాడు. మధ్యలోకి వచ్చిన ఫీల్డర్ విషేన్ హలంబగేను గట్టిగా నెట్టేశాడు. పరిస్థితి చేయి దాటుతోందని గమనించిన లంక సీనియర్ ప్లేయర్ నిరోషన్ డిక్వెల్లా వెంటనే గొడవను సర్దుమణిగేలా చేశాడు.
ట్రెండింగ్ వార్తలు





















