Tilak Varma | తిలక్ వర్మకి మళ్లీ కెప్టెన్సీ అప్పగించిన హెచ్‌సీఏ
టీమిండియా స్టార్ బ్యాటర్, తెలుగు తేజం తిలక్ వర్మ ప్రస్తుతం ఓ రకంగా నేషనల్ హీరోలా మారిపోయాడు. ఆసియా కప్ 2025 టోర్నీ మొదటి నుంచి నిలకడైన బ్యాటింగ్‌తో అదరగొట్టిన తిలక్.. ఫైనల్లో మిగిలిన బ్యాటర్లంతా అవుటై జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు హీరోలా ఆదుకుని.. అద్భుతమైన ఇన్నింగ్స్‌తో పాక్ ఓటమకి రూట్ క్లియర్ చేశాడు. భారత్‌కి మర్చిపోలేని విజయాన్నందించాడు. దీంతో ఇప్పుడు దేశ వ్యాప్తంగా తిలక్ వర్మ పేరు మారుమోగిపోతోంది. ఇలాంటి టైంలో తిలక్ వర్మకి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించేందుకు రెడీ అవుతోంది హెచ్‌సీఏ.అంటే హైదరాబాద్ జట్టును మరోసారి తిలక్ కెప్టెన్‌గా నడిపించనున్నాడన్నమాట. ప్రతిష్ఠాత్మక రంజీ సిరీస్ కోసం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) సెలెక్షన్ కమిటీ బుధవారం 15 మంది సభ్యులతో కూడిన టీమ్‌ని ప్రకటించింది. అంతర్జాతీయ క్రికెట్‌లో దుమ్మురేపుతున్న తిలక్ వర్మను మళ్లీ జట్టుకు కెప్టెన్‌గా నియమిస్తున్నట్లు ప్రకటించింది. అలాగే తిలక్‌కి డిప్యూటీగా రాహుల్ సింగ్‌ని సెలక్ట్ చేసింది. తిలక్ వర్మ 2023 నుంచి రంజీ ట్రోఫీలతో పాట, సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీల్లో హైదరాబాద్ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. మధ్యలో జాతీయ జట్టుకు ఆడాల్సి రావడంతో టీమ్‌కి, కెప్టెన్సీకి దూరమైనా.. అవకాశం ఉన్నప్పుడల్లా హెచ్‌సీఏ తిలక్ వర్మనే కెప్టెన్‌గా నియమిస్తోంది. అయితే గత సీజన్‌లో ఎలైట్ గ్రూప్-బీలో ఆడిన హైదరాబాద్ జట్టు 7 మ్యాచ్‌లకు 2 మాత్రమే గెలిచింది. మరో 2 మ్యాచ్‌లను డ్రా చేసుకొని మూడింటిలో ఓడి.. లీగ్ దశలోనే టోర్నీ నుంచి టోర్నీ నుంచి అవుటైపోయింది. మరి కనీసం ఈ సారైనా మెరుగైన ప్రదర్శన చేయాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ రంజీ ట్రోఫీకి టీమిండియా స్టార్ పేసర్, హైదరాబాద్ డీఎస్పీ మహమ్మద్ సిరాజ్ దూరంగా ఉన్నాడు. ఆస్ట్రేలియా పర్యటన, సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌ల నేపథ్యంలో దేశవాళీ క్రికెట్ నుంచి సిరాజ్‌కు విశ్రాంతి కల్పించారు.





















