Team India ODI Schedule | 2027 వరకు టీమిండియావన్డే షెడ్యూల్ ప్రకటించిన బీసీసీఐ
Team India వన్డే కెప్టెన్ గా రోహిత్ శర్మని తప్పించి శుభ్ మన్ గిల్ ని కెప్టెన్ చేసిన కోచ్ గంభీర్ అండ్ బీసీసీఐ ఇప్పుడు 2027 వన్డే World Cup ని దృష్టిలో పెట్టుకొని గిల్ ని ఫుల్ బిజీగా ఉంచబోతోంది. 2023 వన్డే వరల్డ్ కప్ తర్వాత ఈ మధ్య కాలంలో టీం ఇండియా పెద్దగా వన్డేలు ఆడిందే లేదు. 2 ఏళ్లలో కేవలం 6 వన్డేలు మాత్రమే ఆడిందంటే మనం ఎంతలా వెనక పడిపోయామో ఆలోచించండి. అయితే ఇలా వన్డేలని నిర్లక్ష్యం చేస్తే రాబోయే వన్డే World Cup లో ఇండియాకి కష్టాలు తప్పవని అర్థం చేసుకున్న బీసీసీఐ.. 2027 వన్డే వరల్డ్ కప్ వరకు TEAMINDIA ODI schedule ని చాలా టైట్ గా పేపర్ చేసింది. మొత్తం 7 టీమ్స్ తో 8 సిరీసుల్లో 24 వన్డేలు ఆడేలా మొత్తం ప్లాన్ రెడీ చేసింది. దీనికి సంబంధించిన scheduleని ఆదివారం రిలీజ్ చేసింది. ఈ schedule ప్రకారం.. ఫస్ట్ ఆస్ట్రేలియాతో, ఆ తర్వాత సౌత్ Africa, New-Zealand, Afghanistan, England, west indies, మళ్లీ new-zealand, చివరిగా శ్రీలంకతో వన్డే సిరీస్ లు ఆడబోతోంది టీం ఇండియా. ప్రతి టీంతో 3 వన్డేలు ఆడెలా సిరీస్ లు ప్లాన్ చేసింది బీసీసీఐ. అయితే ఈ schedule చూసి Hitman ఫ్యాన్స్ కొద్దిగా భయపడుతున్నారు. ఇంత టైట్ షెడ్యుల్ కావాలనే బీసీసీఐ ప్లాన్ చేసిందని, hit man, Kohli ఏ మాత్రం ఒకటి రెండు సిరీసుల్లో ఫెయిల్ అయినా వాళ్ళని తీసేయడానికే బీసీసీఐ, కోచ్ గంభీర్ ఈ ప్లాన్ రెడీ చేశారని అంటున్నారు. అయితే ప్రస్తుతానికి జరగబోయే ఆస్ట్రేలియా సిరీస్ వరకు అయితే టీం లో రోహిత్ కి ప్లేస్ ఉన్నట్లు కన్ఫర్మ్ అయింది. ఇక ఈ సిరీస్ లో Hitman performance పైనే నెక్స్ట్ సిరీస్ కి సెలెక్ట్ అవుతాడా? లేదా? అనేది ఆధారపడి ఉంటుంది.





















