Shubman Gill Records in Ind vs Eng | విరాట్ కోహ్లీ రికార్డు బ్రేక్ చేసిన గిల్
టీం ఇండియా టెస్టు కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న మొదటి సిరీస్‌లోనే శుభమన్ గిల్ రికార్డులు బద్దలుగొడుతున్నాడు. ఇంగ్లండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో వరుస సెంచరీలతో చరిత్ర సృష్టిస్తున్నాడు. కెప్టెన్ గా టీం ని ముందుకు నడిపిస్తూ.. బ్యాటర్ గా ఇరగదీస్తున్నాడు. బర్మింగ్‌హామ్‌లో జరుగుతున్న రెండో టెస్టులో డబుల్ సెంచరీ చేసిన గిల్..ఇండియా నుండి ఇంగ్లండ్ గడ్డపై తొలి డబుల్ సెంచరీ చేసిన భారత కెప్టెన్‌గా చరిత్ర సృష్టించాడు. ఇది ఒక అరుదైన రికార్డు. విరాట్ కోహ్లీ, సచిన్, సెహ్వాగ్ రికార్డులను చెరిపేసాడు.
కోహ్లీ టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ ప్రతి మ్యాచ్ లో ఫ్యాన్స్ విరాట్ ని మిస్ అవుతున్నారు. తన ఇన్స్పిరేషన్ విరాట్ కోహ్లీ అంటూ ఎన్నో సార్లు చెప్పుకొచ్చాడు శుబ్మన్ గిల్. అందుకే గిల్ కి ప్రిన్స్ అన్న పేరు వచ్చింది. తన ఐడల్ గా చెప్పుకునే కింగ్ కోహ్లీకి తన స్టైల్ లో ప్రిన్స్ ట్రిబ్యూట్ ఇచ్చాడు అంటూ ఫ్యాన్స్ అంటున్నారు. అది ఎలా అంటే ఇంగ్లాండ్ తో జరిగిన రెండవ టెస్ట్ లో గిల్ 269 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. విరాట్ కోహ్లీ టెస్ట్ క్యాప్ నంబర్ కూడా 269. విరాట్ రిటైర్ అయినప్పుడు ఫ్యాన్స్ అంతా థ్యాంక్యూ 269... అంటూ కోహ్లీకి రిటైర్మెంట్ శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పుడు గిల్ 269 పరుగులు చేసి ... 269 క్యాప్ నంబర్ అంటే కోహ్లీకి ట్రిబ్యూట్ ఇచ్చినట్లు అయింది. ఈ ఇన్నింగ్స్ తో ప్రిన్స్ కాస్త కింగ్ అయి టైం వచ్చేసింది అని అంటున్నారు ఫ్యాన్స్.
టీమిండియా తరఫున టెస్టుల్లో డబుల్ సెంచరీలు చేసిన కెప్టెన్ లలో విరాట్ కోహ్లి, ఎంఎస్ ధోనీ, శుభమన్ గిల్ ఉన్నారు. టెస్టు కెప్టెన్‌గా ఇప్పటి వరకు విరాట్ కోహ్లినే అత్యధిక పరుగులు చేయగా.. ఆ రికార్డును గిల్ ఇంగ్లండ్‌పై బ్రేక్ చేశాడు. విరాట్ కోహ్లి 2019లో సౌతాఫ్రికాపై జరిగిన టెస్టులో 254 నాటౌట్‌గా నిలిచాడు. ఇప్పటి వరకు ఇదే హైయెస్ట్. కానీ శుభమన్ గిల్ 269 స్కోర్‌తో రికార్డు బ్రేక్ చేశాడు. ఇంగ్లండ్ గడ్డపై ఎక్కువ రన్స్ చేసిన ప్లేయర్ గా కూడా గిల్ టాప్ లో ఉన్నాడు. సునీల్ గవాస్కర్ 221, రాహుల్ ద్రవిడ్ 217, సచిన్ టెండూల్కర్ 193, రవిశాస్త్రి 187 పరుగులు చేశాడు. ఈ రికార్డులన్నీ బ్రేక్ చేస్తూ గిల్ ఎడ్జ్‌బాస్టన్ వేదికగా 269 పరుగులతో రాణించాడు.





















