Manav's Father Left Stadium Out Of Nervousness | కొడుకు మ్యాచ్ చూడకుండానే వెళ్లిన తండ్రి
23 ఏళ్ల యంగ్ స్పిన్నర్ మానవ్ సుతార్ కి సంబంధించి ఒక వార్త బాగా వైరల్ అవుతుంది. అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్ లో డెబ్యూ చేసిన మానవ్ తొలి ఇన్నింగ్స్‌లోనే 33 పరుగులకి 6 వికెట్లు పడగొట్టి అద్భుత రికార్డు సృష్టించాడు. డెబ్యూ మ్యాచ్‌లోనే 5 వికెట్ల ఘనత అందుకున్న 10వ భారత బౌలర్‌గా చరిత్రకెక్కాడు.
అయితే మానవ్ పెర్ఫార్మన్స్ వెనుక ఒక ఎమోషనల్ స్టోరీ ఉంది. ఈ మ్యాచ్ చూడటానికి రాజస్థాన్ నుంచి మానవ్ సుతార్ తండ్రి జగదీష్, తల్లి, సోదరి మానసి స్టేడియంకు వచ్చారు. కొడుకు టెస్ట్ క్యాప్ అందుకునేటప్పుడు వారంతా ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. కానీ, రెండో రోజు ఆటలో కొడుకు బౌలింగ్ చేస్తుంటే చూడటానికి భయపడి, నర్వస్‌నెస్‌తో తండ్రి జగదీష్ స్టేడియం వదిలి వెళ్ళిపోయారు.
ఈ విషయంపై జగదీష్ మాట్లాడుతూ "మానవ్ చిన్నప్పటి నుండి ఎంతో కష్టపడ్డాడు. ఉదయమే ప్రాక్టీస్‌కి వెళ్లి సాయంత్రం వచ్చేవాడు. అతని కోచ్ ధీరజ్ శర్మ కృషి కూడా ఎంతో ఉంది. కానీ గ్రౌండ్ లో నా కొడుకు ఎలా ఆడతాడో అనే టెన్షన్‌తో మ్యాచ్ చూసే ధైర్యం లేకనే బయటకు వచ్చేశాను" అని ఎమోషనల్ అయ్యారు.
ట్రెండింగ్ వార్తలు





















