RR vs PBKS Match Highlights IPL 2025 | రాజస్థాన్ పై 10 పరుగుల తేడాతో పంజాబ్ విక్టరీ | ABP Desam
టాప్ 2 లో ప్లేస్ సంపాదించాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ మరోసారి తన జోరు చూపించింది. ఇప్పటికే సీజన్ నుంచి ఎలిమినేట్ అయిపోయిన రాజస్థాన్ రాయల్స్ పై అన్ని విభాగాల్లోనూ పై చేయి సాధించింది పంజాబ్ జట్టు. ముందు పంజాబ్ బ్యాటింగ్ గురించి మాట్లాడుకోవాలి. పంజాబ్ బిగినింగ్ కి ఎండింగ్ కి సంబంధమే లేదు. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నామన్న సంతోషమే లేకుండా 34పరుగులకే 3వికెట్లు పడిపోయాయి పంజాబ్ కి. తుషార్ దేశ్ పాండే బౌలింగ్ జోరుకు వాళ్ల కీ బ్యాటర్లైన ప్రియాంశ్ ఆర్య, ప్రభ్ సిమ్రన్ వికెట్లు దక్కంటంతో పాటు.. మిచెల్ ఓవెన్ వికెట్లు కోల్పోవటంతో పంజాబ్ టాప్ ఆర్డర్ కుప్పకూలింది. కానీ నేహాల్ వధీరా, శశాంక్ సింగ్ అద్భుతమే చేశారు. 37 బాల్స్ లో 5ఫోర్లు 5సిక్సర్లతో 70పరుగులు చేశాడు వధీరా. వధీరాకు కెప్టెన్ అయ్యర్ మంచిగా సపోర్ట్ చేశాడు. చివర్లో శశాంక్ సింగ్ దుమ్ముదులిపాడు. 30 బాల్స్ లో 5ఫోర్లు 3 సిక్సర్లతో 59పరుగులు చేసి నాటౌట్ గా నిలవటంతో పాటు అజ్మతుల్లా కూడా హిట్ చేయటంతో పంజాబ్ ఎవ్వరూ ఊహించని విధంగా 219పరుగులు చేసి 220 టార్గెట్ ఇచ్చింది. అయితే రాజస్థాన్ రాయల్స్ ఛేజింగ్ కూడా ఊహించని రేంజ్ లో మొదలైంది. 5 ఓవర్లలో 80పరుగులు చేసి వైభవ్ సూర్యవంశీ, జైశ్వాల్ రచ్చరంబోలా చేశారు. వైభవ్ 15 బాల్స్ మాత్రమే ఆడి 4ఫోర్లు 4 సిక్సర్లతో 40పరుగులు చేశాడు. జైశ్వాల్ 25 బాల్స్ లో 9ఫోర్లు ఓ సిక్సర్ తో హాఫ్ సెంచరీ కొట్టేశాడు. కానీ హర్ ప్రీత్ బ్రార్ వీరిద్దరని అవుట్ చేయటంతో ఆర్ ఆర్ కథ ఆల్మోస్ట్ ముగిసిపోయింది. మధ్యలో ధృవ్ జురెల్ పోరాటం చేసినా 31 బాల్స్ లో 3ఫోర్లు 4 సిక్సర్లతో 53పరుగులు చేసి పోరాడినా మరో ఎండ్ లో బ్యాటర్ కరువవు అవ్వటంతో పంజాబ్ 10పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో పంజాబ్ పాయింట్స్ టేబుల్ లో రెండో స్థానానికి చేరుకోగా...రాజస్థాన్ రాయల్స్ కంఫర్టబుల్ గా తొమ్మిదో స్థానంలో ఉంది.





















