RCB Suyash Sharma My Ground Celebration | పంజాబ్ ను స్పిన్ ఉచ్చుల్లో ఇరికించిన సూయాశ్ శర్మ | ABP Desam
నిన్న క్వాలిఫైయర్ 1 పంజాబ్ కి ఊహించలేని షాక్ ఇచ్చింది ఆర్సీబీ. లీగ్ లో టేబుల్ టాపర్ గా నిలిచిన పంజాబ్ జట్టు పటిష్ఠంగా ఉండటం...పైగా సొంత మైదానంలో జరిగే మ్యాచ్ కావటంతో పై చేయి సాధించటం పక్కా అని పంజాబ్ అభిమానులు ఆర్సీబీ మాత్రం సునామీలా చుట్టేసింది. అసలు ఏ మాత్రం పంజాబ్ కు ఊపిరి ఆడనివ్వకుండా పంజాబ్ బౌలర్లు ఉక్కిరి బిక్కిరి చేశారు. భువీ, హేజిల్ వుడ్ మొదలు పెట్టిన వికెట్ల జాతరను స్పిన్నర్ సూయాశ్ శర్మ నెక్ట్స్ లెవల్ కి తీసుకువెళ్లాడు. పంజాబ్ కి ఓపెనర్లు ప్రభ్ సిమ్రన్, ప్రియాంశ్ శర్మ, శ్రేయస్ అయ్యర్ ఎంత కీలకమో అంతే స్థాయిలో స్టాయినిస్, శశాంక్ సింగ్ క్రీజులో కుదురుకుంటే మ్యాచ్ స్వరూపాన్నే మార్చేయగల ఆ బ్యాటర్ల పని పట్టాడు సూయాశ్ శర్మ. ఫ్లిఫ్లర్స్, గూగ్లీస్, లెగ్ బ్రేక్స్ అంటూ తన దగ్గరున్న ఆయుధాలన్నీ వాడేసి స్పిన్ ఉచ్చు వేసేలా పంజాబ్ మిడిల్ ఆర్డర్ చిక్కుకుని విలవిల్లాడేలా చేశాడు సూయాశ్ శర్మ. మళ్లీ తీసినవి మాములు క్యాచ్ అవుట్ వికెట్లు కాదు క్లీన్ బౌల్డ్ లే. 17 బంతుల్లో 26 పరుగులు చేసిన స్టాయినిస్ క్లీన్ బౌల్డ్ చేసిన సూయాశ్...శశాంక్ సింగ్ ను 3పరుగులకే క్లీన్ బౌల్డ్ చేశాడు. ఇక తొలి మ్యాచ్ ఆడుతున్న సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు ముషీర్ ఖాన్ ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్న సూయాశ్ తనను డకౌట్ గా పెవిలియన్ కి పంపాడు. మొత్తంగా మూడు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసి 17పరుగులు మాత్రమే ఇచ్చి 3వికెట్లు తీసిన సూయాశ్ పంజాబ్ 101పరుగులకే కుప్పకూలటంలో కీలకపాత్ర పోషించాడు. వికెట్లు తీసిన సూయాశ్ చేసిన సెలబ్రేషన్ కూడా వైరల్ గా మారుతోంది. వికెట్ తీసిన ప్రతీసారి నేలకేసి వేల చూపిస్తూ ఇది నా గ్రౌండ్ రా అన్నట్లుగా సెలబ్రేట్ చేశాడు. వాస్తవానికి సూయాశ్ శర్మది ఢిల్లీ. పంజాబ్ గ్రౌండ్ తో తనకు సంబంధం లేదు. కానీ ఆ సెలబ్రేషన్ చేయటానికి రీజన్ కేఎల్ రాహుల్. ఇదే ఆర్సీబీ పై అదిరిపోయే ఛేజింగ్ చేసి లీగ్ మ్యాచ్ లో డిల్లీకి విజయం అందించిన రాహుల్ కాంతారా సినిమాలోని సెలబ్రేషన్ చేసి వైరల్ అయ్యాడు మీకు గుర్తుండే ఉంటుంది. ఆ సెలబ్రేషన్ నచ్చిన సూయాశ్ దాన్ని రిపీట్ చేస్తూ తన ఆనందాన్ని చూపించాడన్న మాట. ఈ రోజు ఈ గ్రౌండ్ నాది అన్నట్లు. మొత్తంగా సూయాశ్ శర్మ అదిరిపోయే ఫర్ ఫార్మేన్స్ ప్లెయర్ ఆఫ్ ది మ్యాచ్ అందకోవటమే కాదు తన జట్టును 9ఏళ్ల తర్వాత ఐపీఎల్ ఫైనల్ కి తీసుకువెళ్లటంలో కీలకపాత్ర పోషించాడు.





















