Prabhsimran Singh 437 Runs IPL 2025 | బ్యాటింగ్ లో దుమ్ము రేపుతున్న ప్రభ్ సిమ్రన్ సింగ్ | ABP Desam
పంజాబ్ యువ బ్యాటర్ ప్రభ్ సిమ్రన్ సింగ్ ఈ సారి ఐపీఎల్లో దుమ్మురేపేస్తున్నాడు. వరుసగా మూడు మ్యాచుల్లో మూడు హాఫ్ సెంచరీలు కొట్టిన ప్రభ్ సిమ్రన్ నిన్న లక్నోతో జరిగిన మ్యాచ్ లో తృటిలో సెంచరీ మిస్సయ్యాడు. మొత్తంగా 48 బాల్స్ లో 6ఫోర్లు 7 సిక్సర్లతో 91పరుగులు చేసిన ప్రభ్ సిమ్రన్ పంజాబ్ 236పరుగుల భారీ స్కోరు చేసేందుకు కారణమయ్యాడు. నిన్న ప్రభ్ సిమ్రన్ కొట్టింది వరుసగా మూడో హాఫ్ సెంచరీ ఈ సీజన్ లో నాలుగోది. పంజాబ్ తరపున ప్రస్తుతం హయ్యెస్ట్ రన్స్ స్కోరర్ గా ప్రభ్ సిమ్రనే ఉన్నాడు. ఓవరాల్ గా అత్యధిక పరుగుల వీరుల జాబితాలో మొదటి స్థానంలో కొహ్లీ ఉంటే...8వ స్థానంలో ప్రభ్ సిమ్రన్ ఉన్నాడు. అయితే ఈ ఐపీఎల్ లో కొహ్లీ కంటే ప్రభ్ సిమ్రన్ స్ట్రైక్ రేటే ఎక్కువ. కొహ్లీ స్ట్రైక్ రేట్ 143 అయితే ప్రభ్ సిమ్రన్ 170 స్ట్రైక్ రేట్ తో పరుగులు రాబడుతున్నాడు. ఈ సీజన్ లో హయ్యెస్ట్ రన్స్ స్కోరర్ అయిన కొహ్లీ 44 ఫోర్లు 18 సిక్సర్లు కొడితే...ప్రభ్ సిమ్రన్ 45 ఫోర్లు, 24 సిక్సర్లు కొట్టాడు. కొహ్లీకి ప్రభ్ సిమ్రన్ కి మధ్య పరుగుల తేడా కేవలం 60 మాత్రమే. ఇదేదో కొహ్లీతో కంపేర్ చేయటం అని కాదు కానీ కొహ్లీ అంతటి ప్రపంచ అత్యుత్తమ బ్యాటర్ తో సమానంగా..ఓరకంగా చెప్పాలంటే కొహ్లీ కంటే గొప్పగా ఈ సీజన్ ను ఆడేస్తున్న ప్రభ్ సిమ్రన్ ఇదే తరహా ప్రదర్శనను గత రెండు సీజన్స్ లోనూ పంజాబ్ తరపున చూపించాడు. అయినా ఎందుకో మంది ఇతనికి అంత గుర్తింపు రావట్లేదు..టీమిండియా ఎలాంటి అవకాశాలు అందటం లేదు. గత సీజన్ లో సెంచరీ కూడా కొట్టిన ప్రభ్ సిమ్రన్ ఈ సీజన్ లోనూ ఓ సెంచరీ బాది ఇప్పటికైనా తన కష్టాలను దూరం చూసుకునేలా టీమిండియా కు సెలెక్టర్ల దృష్టిలో విపరీతంగా కష్టపడుతున్నాడు ఈ 24ఏళ్ల కుర్రాడు.





















