Digvesh Singh Rathi Note Book Celebrations IPL 2025 | ఏం రాస్తాడో తెలియదు కానీ ఫైన్స్ రాయించుకున్నాడు
దిగ్వేష్ రాఠీ. లక్నో సూపర్ జెయింట్స్ తరపున ఈ సీజన్ లో అరంగేట్రం చేసిన లెగ్ స్పిన్నర్. ఎకానమీ ఎక్కువే అయినా కీలక సందర్భాల్లో వికెట్లు తీసి బాగానే ఆకట్టుకున్నాడు. LSG పెద్దగా విజయాలు సాధించకపోవటంతో కనిపించ లేదు గానీ 14వికెట్లు తీశాడు దిగ్వేష్ రాఠీ. ఓ 26ఏళ్ల కుర్రాడు పైగా మొదటి ఐపీఎల్ సీజన్ లోనే 14వికెట్లు అంటే మంచి ప్రదర్శన అనే చెప్పాలి. కానీ దిగ్వేష్ రాఠీకి ఓ అలవాటు ఉంది. ఎవరైనా బ్యాటర్ ను అవుట్ చేస్తే వాళ్ల దగ్గరకు వెళ్లి నోట్ బుక్ లో పేరు రాసి చించేశా అన్నట్లు నోట్ బుక్ సెలబ్రేట్ చేస్తాడు. ఈ ఐపీఎల్ సీజన్ స్టార్టింగ్ లోనే ఈ తరహా సెలబ్రేషన్ తో వైరల్ అయిన రాఠీ ఫలితంగా డబ్బులు కూడా పోగొట్టుకున్నాడు. పంజాబ్ మీద మ్యాచ్ లో ప్రియాంశ్ ఆర్య మీద ముఖం మీదకు వెళ్లి నోట్ బుక్ సెలబ్రేట్ చేసినందుకు మ్యాచ్ ఫీజులో 25 పర్సెంట్ ఫైన్ పడింది. 1 లక్షా87 వేలు ఫైన్ కట్టాడు. మళ్లీ అప్పుడే నాలుగు రోజల తర్వాత ముంబై మ్యాచ్ లో నమన్ ధీర్ మీద సేమ్ టూ సేమ్ సెలబ్రేషన్ చేశాడు. ఈసారి 50 పర్సెంట్ మ్యాచ్ ఫీజ్ 3లక్షల 75వేలు పడింది. అంటే అక్కడికే 5లక్షల పైన ఫైన్ కట్టాడు దిగ్వేష్ రాఠీ. నిన్న మళ్లీ అభిషేక్ తో గొడవ. దీనికి రిఫరీ ఎంత ఫైన్ వేస్తాడో ఇంకా తెలియదు కానీ ఆక్షన్ లో 30 లక్షలకు కొనుక్కుంది LSG. తొలి సీజన్ ఆడుతూ మంచిగానే వికెట్లు తీసినా డబ్బులు ఫైన్ రూపంలో పోగొట్టుకోవటంతో పాటు బివిహేయర్ బాగోదు అన్న చెడ్డ పేరు తెచ్చుకున్నాడు రాఠీ. విషయం ఏంటంటే దిగ్వేష్ కి సునీల్ నరైన్ అంటే చాలా ఇష్టం. ఎంతెలా అంటే తనను గురువుగా భావిస్తాడు. కానీ సునీల్ నరైన్ ఎప్పుడైనా చూడండి. వికెట్ తీసి అస్సలు నవ్వడు కనీసం ఏ ఎక్స్ ప్రెషన్ ఉండదు. తన బౌలింగ్ బ్యాటింగ్ మీదే కాన్సట్రేట్ చేస్తూ వికెట్లు తీస్తుంటాడు..పరుగులు రాబడుతుంటాడు. మరి అలాంటి నరైన్ ను గురువు గారిలా భావించే దిగ్వేష్ మాత్రం వికెట్లు తీసినా ఈ కాంట్రవర్షియల్ నోట్ బుక్ సెలబ్రేషన్ తో కష్టపడి సంపాదించుకున్న డబ్బులు పోగొట్టుకుటంున్నాడు. డబ్బులు ఎవరికీ ఊరికే రావు కదా.





















