IPL 2026 KKR vs GT Cameron Green Supet Six | కామెరూన్ దెబ్బకు కారుకు డెంట్
గుజరాత్ టైటాన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఒక ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. కేకేఆర్ ఆల్‌రౌండర్ కెమెరూన్ గ్రీన్ కొట్టిన ఒక జెయింట్ సిక్సర్ నేరుగా వెళ్లి స్టేడియంలో ప్రదర్శనకు ఉంచిన కారును తాకింది. ఐపీఎల్ వేలంలో ఏకంగా 25.2 కోట్ల భారీ ధరకు అమ్ముడైన గ్రీన్, గ్రౌండ్ లో పరుగుల వర్షం కురిపించాడు.
కేకేఆర్ ఇన్నింగ్స్ 13వ ఓవర్‌లో అశోక్ శర్మ వేసిన మూడవ బాల్ ను గ్రీన్ లెగ్ సైడ్ వైపు భారీ సిక్సర్‌గా మలిచాడు. ఆ బాల్ నేరుగా వెళ్లి ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’కు బహుమతిగా ఇచ్చే కారుకు తగలడంతో బాడీపై చిన్న డెంట్ పడింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరలైంది.
అయితే టాటా మోటార్స్ రూల్స్ ప్రకారం, గ్రౌండ్ లో ఉన్న కార్ కు బాల్ తగిలితే గ్రాస్‌రూట్ క్రికెట్ డెవలప్మెంట్ కోసం కంపెనీ 5 లక్షల విరాళం అందజేస్తుంది. గ్రీన్ కొట్టిన సిక్సర్ వల్ల ఆ డబ్బు క్రికెట్ డెవలప్మెంట్ కోసం ఉపయోగిస్తారు. సరైన ఫామ్ లేక ఇబ్బంది పడుతున్న గ్రీన్, ఈ మ్యాచ్‌తో మళ్ళీ తన పాత జోరును అందుకున్నాడు.
ట్రెండింగ్ వార్తలు






















