Rishabh pant out Controversy | రిషభ్ పంత్ అవుటా..నాట్ అవుటా..వివాదం మొదలైంది | ABP Desam
న్యూజిలాండ్ విసిరిన లక్ష్యం 147 పరుగులు. భారత్ 106పరుగులకే 6వికెట్లు కోల్పోయింది. కానీ టీమిండియా అభిమానుల్లో ఓడిపోతామనే భయం లేదు. ఎందుకంటే అక్కడ ఆడుతుంది రిషభ్ పంత్. అంతటి క్రూషియల్ సిచ్యూయేషన్ లో బెరుకు భయం లేకుండా 57 బంతుల్లో 64పరుగులు చేశాడు. 112 స్ట్రైక్ రేట్ తో. అలాంటి టైమ్ లో అజాజ్ పటేల్ బౌలింగ్ లో పంత్ కీపర్ కి క్యాచ్ ఇచ్చాడు. కానీ ఫీల్డ్ అంపైర్ నాటౌట్ అన్నాడు. న్యూజిలాండ్ డీఆర్ఎస్ తీసుకుంది. డీఆర్ఎస్ తేలింది ఏంటంటే బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బాల్ ప్యాడ్ కి తగిలి కీపర్ కి క్యాచ్ వెళ్లింది అని. అయితే జాగ్రత్తగా గమనిస్తే అదే సమయంలో పంత్ చేతిలో ఉన్న బ్యాట్ కూడా ప్యాడ్ కి తగిలింది. వెంటనే పంత్ అంపైర్లతో మాట్లాడాడు కూడా. ఆ టైమ్ లో న్యా బ్యాట్ ప్యాడ్ కి తాకటంతో స్నికో మీటర్ లో మీకు స్పైక్ కనిపించింది అని. కానీ థర్డ్ అంపైర్ పంత్ ను ఔట్ గా ప్రకటించాడు. అసలు బంతి నా బ్యాట్ కి తాకలేదని పంత్ అంపైర్లతో వాదనకు దిగాడు. ఇది కచ్చితంగా డౌట్. అనుమానం ఉన్నప్పుడు స్పష్టమైన ఆధారం లేనప్పుడు ఫీల్డ్ అంపైర్ ఏ నిర్ణయం ప్రకటించారో దానికి థర్డ్ అంపైర్ కూడా కట్టుబడి ఉండాలి. కానీ థర్డ్ అంపైర్ పంత్ బ్యాట్ కే బాల్ ఎడ్జ్ తీసుకుందని అంత కచ్చితంగా ఎలా చెప్పారో అర్థం కావట్లేదని ఏబీ డివిలియర్స్ లాంటి మాజీలు కూడా ట్వీట్ చేశారు. మొత్తానికి అంత క్రూషియల్ టైమ్ లో పంత్ అవుట్ అవ్వటంతో భారత్ 92ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలి వైట్ వాష్ ను రుచి చూసింది.