Rishabh Pant Injury Dhruv Jurel Bat? | పంత్ వేలి గాయం తగ్గకపోతే కీపర్ ధృవ్ జురెల్ బ్యాటింగ్ చేయొచ్చా ? | ABP Desam
ఇంగ్లండ్ తో సిరీస్ ను 1-1 తో సమం చేసిన భారత్...లార్డ్స్ టెస్టులో పట్టు కోసం బ్రిటీష్ టీమ్ తో హోరాహోరీ తలపడుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ ను రూట్ సెంచరీతో ఆదుకున్నా అతనితో సహా స్టోక్స్ ను రెండో రోజు పెవిలియన్ దారి పట్టించిన భారత బౌలర్లు ఇంగ్లండ్ పై పట్టు సాధించే ప్రయత్నం ప్రారంభించారు. సరే ఆ సంగతి పక్కనపెడితే...నిన్న బుమ్రా బౌలింగ్ లో వికెట్ కీపర్ రిషభ్ పంత్ గాయపడ్డాడు. కీపింగ్ చేస్తుండగా బుమ్రా విసిరిన బాల్ తగిలి పంత్ కుడి చేతి చూపుడు వేలుకు గాయమైంది. నొప్పితో విలవిలాడిన పంత్ గ్రౌండ్ వదిలి బయటకు వెళ్లిపోయాడు. అంపైర్ అనుమతితో స్క్వాడ్ లో ఉన్న బ్యాకప్ కీపర్ ధృవ్ జురెల్ నిన్నటి నుంచి కీపింగ్ చేస్తున్నాడు. ఇంగ్లండ్ వికెట్లను మన బౌలర్లు తీయటంలోనూ కీలకపాత్ర పోషిస్తున్నాడు. అయితే ఇప్పుడు డౌట్ ఏంటంటే ఇంగ్లండ్ ఆల్ అవుట్ అయ్యాక భారత్ బ్యాటింగ్ ప్రారంభించాలి కదా. నిన్నంతా..మళ్లీ ఇవాళ రెండో రోజు కూడా ఫీల్డింగ్ కి రాని రిషభ్ పంత్ బ్యాటింగ్ కి అన్నా దిగుతాడో లేదో సందేహం గా ఉంది. ఒకవేళ పంత్ లేకపోతే భారత్ చాలా నష్టపోయే అవకాశం ఉంది. ఇంగ్లండ్ లో ఆడిన రెండు టెస్టుల్లో నాలుగు ఇన్నింగ్స్ ల్లో రెండు సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీతో గిల్ తర్వాత ఆ రేంజ్ లో ఫామ్ చూపిస్తున్నది రిషబ్ పంతే. మరి అంత ఫామ్ లో ఉన్న పంత్ లేకపోతే కీపింగ్ చేస్తున్న ధృవ్ జురెల్ అయినా బ్యాటింగ్ చేయొచ్చా అనే సందేహం చాలా మందిలో ఉంది. కానీ ఐసీసీ రూల్స్ అందుకు ఒప్పుకోవు. ఒకవేళ పంత్ ఆడకపోతే భారత ఓ బ్యాటర్ సేవలను కోల్పోవటం తప్ప మరో దారి లేదు. మరి ధృవ్ జురెల్ కీపింగ్ చేస్తున్నాడు కదా అంటే అంపైర్ అనుమతితో కీపింగ్, ఫీల్డింగ్ లాంటి మాత్రం స్క్వాడ్ లో ఉన్న ఎవరైనా చేయొచ్చు. ఒక్కోసారి టీమ్ లో వాళ్లంతా చేయలేని పరిస్థితి ఉంటే అపోజిట్ టీమ్ లో ఉన్న ఆటగాడైనా ఫీల్డింగ్ చేయొచ్చు కానీ బ్యాటింగ్ బౌలింగ్ చేయాలంటే మాత్రం..గాయపడిన ఆటగాడు కంకషన్ గురై ఉండాలి లేదా కోవిడ్ 19 సోకి ఉండాలి. మారిన రూల్స్ ప్రకారం ఈ రెండు కాకుండా జస్ట్ గాయపడితే ఆ గాయంతోనే ఆడాలి లేదా తన స్థానాన్ని వదిలేసుకోవాలి అంతే. సో పంత్ ఆడలేకపోతే ధృవ్ జురెల్ కూడా బ్యాటింగ్ చేయలేడు అంతే.





















