Lords Ground Turned in to Red | Eng vs Ind టెస్ట్ సిరీస్ లో రెడ్ క్యాప్స్ ఎందుకు వచ్చాయి.? | ABP Desam
ఈ ఫోటో లో చూడండి రవీంద్ర జడేజా, కెప్టెన్ శుభ్ మన్ గిల్ అంతా రెడ్ క్యాప్స్ పెట్టుకుని కనిపిస్తున్నారు. ఐపీఎల్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడికి ఆరెంజ్ క్యాప్ ఇచ్చినట్లు టెస్టు మ్యాచుల్లో ఏమన్నా ఇస్తున్నారా అని అనుకోకండి..ఈ రెడ్ క్యాప్ మనమే కాదు ఇంగ్లండ్ జట్టు ఆటగాళ్లు కూడా పెట్టుకున్నారు. అండ్ నిన్న లార్డ్స్ కి చాలా మంది రెడ్ కలర్ డ్రెస్సులోనూ వచ్చారు. వీటి అంతటికీ రీజన్ ఇంగ్లాండ్ మాజీ ప్లేయర్, మాజీ కెప్టెన్ ఆండ్రూ స్ట్రాస్. ఆయనకు రూత్ స్ట్రాస్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ ఉంది. అసలు క్యూర్ కాని క్యాన్సర్ పేషెంట్ల సంక్షేమం కోసం రూత్ స్ట్రాస్ ఫౌండేషన్ సంస్థ పనిచేస్తూ ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా నిధులను సేకరించి ఈ సంస్థ క్యాన్సర్ రోగులకు సేవలు అందిస్తూ ఉంటుంది. ఈ సేవా కార్యక్రమాలన్నీ ఆండ్రూ స్ట్రాసే క్రికెట్ నుంచి రిటైర్మెంట్ అయిన తర్వాత దగ్గరుండి చూసుకుంటున్నారు. ఆయన భార్య పేరు రూత్ స్ట్రాస్. ఆస్ట్రేలియాకు చెందిన నటి మోడల్ అయిన రూత్ స్ట్రాస్ ను 2003లో ఆండ్రూ స్ట్రాస్ పెళ్లి చేసుకున్నాడు. తర్వాత ఇంగ్లండ్ తరపున స్ట్రాస్ కి ఆడే అవకాశం రావటం..ఆ టీమ్ కి కెప్టెన్ కావటం జరిగిపోయాయి. ఆండ్రూ కోసం ఇంగ్లండ్ కి షిఫ్ట్ అయిన రూత్..ఇద్దరు పిల్లలతో కలిసి హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తుండగా 2018లో ఆమెకు ఇన్ క్యూరబుల్ లంగ్ క్యాన్సర్ ఉందని తేలింది. జీవితంలో కనీసం ఎప్పుడూ స్మోక్ కూడా చేయని రూత్ స్ట్రాస్ 46ఏళ్ల వయస్సులో అదే ఏడాదిలో కన్నుమూసింది. తన భార్య జ్ఞాపకార్థం నయం కాని క్యాన్సర్ తో బాధపడే రోగుల కోసం ఆండ్రూ స్ట్రాస్ 2019లో రూత్ స్ట్రాస్ ఫౌండేషన్ ను స్థాపించి అప్పటి నుంచి ఇదే పనిలో ఉన్నాడు.ఇప్పటి వరకూ ఈ సంస్థ 5వేల మంది రోగులకు 41 కోట్ల రూపాయలు సాయం అందించింది. దానికి మద్దతుగానే నిన్న భారత్, ఇంగ్లండ్ ఆటగాళ్లు కోసం ఈ మంచి పని కోసం రెడ్ క్యాప్ ధరించి కనిపించారు.



















